Priyanka Gandhi cleans room at PAC guesthouse ధుమ్ముధూళి నిండిన గదిలో నిర్భంధం.. ఊడ్చిన ప్రియాంకా గది

Detained priyanka gandhi vadra cleans room at pac guesthouse

priyanaka cleans guest house, priyanka gandhi cleans detained room, priyanaka gandhi PAC guest house, priyanaka gandhi room cleaning video, priyanaka gandhi brooming video, viral video, priyanaka gandhi viral video, Lakhimpur kheri protest, Lakhimpur Kheri, Farmer Protest, farmer dead, Priyanka Gandhi, Congress, farmer protest updates, accident, farmer death, Ajay Mishras son, Uttar Pradesh, Crime

A video of Congress General Secretary Priyanka Gandhi Vadra sweeping a room with a broom has gone viral on social media. According to sources, the video is of the room where Priyanka has been detained since Monday morning at the Sitapur PAC headquarters. The room was apparently dirty and Priyanka asked for a broom and cleaned it herself.

ITEMVIDEOS: ధుమ్ముధూళి నిండిన గదిలో నిర్భంధం.. ఊడ్చిన ప్రియాంకా గది

Posted: 10/04/2021 03:25 PM IST
Detained priyanka gandhi vadra cleans room at pac guesthouse

కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉత్తర్ ప్రదేశ్ లోని ల‌ఖింపూర్ ఖేరీలో అదివారం రోజుల పలువురు రైతులు కేంద్రమంత్రి అజయ్ మిశ్ర తనయుడు ఆశీష్ వాహనాన్ని అడ్డున్నారు. దీంతో రైతులను నెట్టుకుంటూ కేంద్రమంత్రి తనయుడి వాహనంతో పాటు మూడు వాహనాలు అలా వెళ్లడంతో అందోళన చేస్తున్న రైతులలో ఏకంగా ఎనమిది మంది మరణించారు. అయితే వీరిలో నలుగురు రైతులు ఉన్నారు. ఈ నేపథ్యంలో మృతుల కుటంబాలను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దీంతో పోలీసుల‌పై మండిపడిన ప్రియాంక గాంధీ.. తన పట్ల దురుసుగా వ్యవహరించడంతో పాటు నెట్టివేశారని అమె అరోపించారు. బాధిత కుటుంబాల క‌న్నీళ్లు తుడిచేందుకు వెళ్తున్నాన‌ని ఆమె పేర్కొన్నారు. తాము ఎలాంటి నేరం చేయ‌లేదు.. ఎందుకు అడ్డుకుంటున్నార‌ని ప్ర‌శ్నించారు. త‌న‌కు లీగ‌ల్ ఆర్డ‌ర్ ఇచ్చి అడ్డుకోవాల‌న్నారు. ఒక వేళ త‌న‌ను బ‌ల‌వంతంగా పోలీసు కారులో ఎక్కిస్తే.. మీపై కిడ్నాప్ కేసు పెడుతాన‌ని హెచ్చ‌రించారు. దేశంతో పాటు బీజేపి పాలిత రాష్ట్రాల్లో ఆ పార్టీ తీరు విచారకరంగా వుందన్నారు.

అయినా అమెను అుదుపులోకి తీసుకున్న సీతాపూర్ పోలీసులు అమెను దుమ్ముదూలితో నిండిన ఓ గెస్ట్ హౌజ్ కు తరలించి అక్కడ నిర్భంధించారు. కూర్చునేందుకు కూడా ఓ కుర్చీ కానీ, సోఫాలు కానీ లేని ఓ గెస్ట్ హౌస్ ను ఎంచుకుని మరీ అందులో ఉంచడంతో ప్రభుత్వ తీరును నిరసించిన ప్రియాంక గాంధీ.. దానిని కూడా తనకు అనుకూలంగా మార్చుకున్నారు. అదెలా అంటారా.. పీఏసీ గెస్ట్ హౌజ్‌లో ఉన్న ఆమె.. అక్క‌డ చీపురు అందుకుని తనను బంధీగా ఉంచిన గదిని శుభ్రపర్చారు. ఆ త‌ర్వాత ఆమె అదే గదిలో నిరాహార దీక్ష చేప‌ట్టారు.

ప్రియాంకా గాంధీని నిర్భంధించిన గెస్ట్ హౌజ్ రూమ్ శుభ్రంగా లేద‌ని, అందుకే ఆమె ఆ గదిని క్లీన్ చేసిన‌ట్లు కొంద‌రు తెలిపారు. ప్రియాంకా త‌న‌ను బంధించిన గ‌దిని ఊడ్చిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ప్రియాంకా గాంధీకి గదిని ఊడ్చడం మాత్రమే కాదు.. ప్రజలకు సుపరిపాలనను అందించలేని ప్రభుత్వాలను కూడా ఊడ్చివేసే శక్తి వుందని కామెంట్లు పెడుతున్నారు. ఇక ప్రియాంకా గాంధీ ఆమె అరెస్టును నిర‌సిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు గెస్ట్ హౌజ్ ముందు ధ‌ర్నా చేప‌ట్టారు. ప్రియాంకా గాంధీ, దీపేంద‌ర్ హూడాల‌పై పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరును కాంగ్రెస్ ఖండించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles