Telangana Govt to Fix Meat Prices మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. ఇక నాసిరకానికి చెక్..

Good news to meat lovers govt to take control of meat shops

telangana government, telangana government to undertake meat shops, telangana government meat prices, fish prices fixed by government, government to fix meat prices, telangana meat news, mutton price telangana, Meat shops, slaughter house, GHMC, district wise, Quality Meat, Quality Fish, Prices cap, Animal Husbandry Dept, Telangana

The Telangana government decided to bring all the meat shops under its control and is planning to set up regional wise slaughterhouses in the state. These slaughterhouses will be linked to all local meat shops where the shop keepers are required to sell only that meat to the consumers.

మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. నాణ్యమైన మటన్.. సరమైన ధరకు..

Posted: 09/24/2021 05:42 PM IST
Good news to meat lovers govt to take control of meat shops

మాంసాహార ప్రియులకు మరీ ముఖ్యంగా మటన్ తినేవారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని ఏ రాష్ట్రం అందించని విధంగా మేకలు, గోర్రలను సబ్డీడీ ధరలకు అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్రంలో మాంసం ధరలపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. దీనికి తోడు అంత డబ్బు పెట్టినా నాణ్యమైన మాంసం లభించకపోవడంతో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. రాష్ట్రంలో ఉన్న మాంసం దుకాణాలన్నింటీని పశుసంవర్థకశాఖ పరిధిలోకి తీసుకోబోతోంది. దీంతో రాష్ట్ర ప్రజలకు శుచికరమైన, నాణ్యతతో కూడిన మాంసాన్ని సరసమైన ధరలకు అందించనుంది.

కరోనా నేపథ్యంలో ఇమ్యూనిటీ కోసం చికెన్, మటన్ తినాలని వైద్యులు సూచించిన క్రమంలో మాంసం ధరలకు రెక్కలు రావడంతో.. ఈ విషయమై చోరవ తీసుకున్న కేసీఆర్ మాంసం ధరలను ఎవ్వరూ రూ.800 మించి అమ్మరాదని అదేశించారు. దీంతో అప్పట్లో అన్నిచోట్ల మాంసం ధర రూ.800కు మించలేదు. కాగా తాజాగా మాంసం ధరలు ఇష్టారాజ్యంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మాంసం ధరలను నియంత్రించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తొలి నుంచి కూడా మాంసం విక్రయాలు ప్రైవేట్ వ్యక్తుల చేతిలోనే ఉంటున్నాయి.

దీనికి తోడు పలు చోట్ల నాసిరకం మాంసాన్ని వ్యాపారులు అమ్ముతున్నారన్న అరోపణలు కూడా ఉన్నాయి. బతికున్న మేక పోటేళ్లను మాత్రమే వధించిన తరువాత వాటి మాంసం దుకాణాల్లో అమ్మాల్సి వుండగా, కొందరు వ్యాపారులు ప్రజారోగ్యానికి తిలోదకాలు వదిలి.. చనిపోయిన జంతువుల మాంసాన్ని కూడా దుకాణాల్లో విక్రయిస్తూ సోమ్ము చేసుకుంటున్నారని అరోపణలు వున్నాయి. కీలో మాంసం ధర రూ.800 నుంచి ఆపేనే వుండటంతో.. పేదవారు మాంసం తినలేని పరిస్థితిని తీసుకొచ్చారు. వీటన్నింటికీ చెక్ పెట్టడానికి ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

మాంసం దుకాణాలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ఇప్పటికే పశుసంవర్ధక శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కబేళాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి జోన్ లో రెండు కబేళాలు, ప్రతి జిల్లాలో ఒకటి లేదా రెండు కబేళాలను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ కబేళాలకు స్థానిక మాంసం దుకాణాలను అనుసంధానం చేస్తారు. ఇకపై ప్రభుత్వం సరఫరా చేసే మాంసాన్నే షాపుల్లో అమ్మాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయాలు జరపాల్సి ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles