Two tried to dump nude woman dead body in lake బాతుల చెరువు వద్ద నగ్నంగా మహిళ మృతదేహం..

Two caught red handed while trying to dump nude woman dead body in lake

woman, nude deadbody, Bhatula cheruvu, Local caught two youth, love marriage, wife, ill health, Hayath nagar, Hyderabad, Rachakonda Police, Telangana, Crime

Locals caught two persons red-handed while trying to dump a nude woman dead body in Bhatula Cheruvu under the limits of Hayat Nagar in Hyderabad on Thursday night. On receiving information, the police reached the spot and took them into custody.

ITEMVIDEOS: బాతుల చెరువు వద్ద నగ్నంగా మహిళ మృతదేహం.. ఆ ఇద్దరూ ఎవరూ.?

Posted: 09/24/2021 05:39 PM IST
Two caught red handed while trying to dump nude woman dead body in lake

హైదరాబాద్ సహా నగర శివారులోని ప్రాంతాలు పూర్తిగా జనసంధ్రం కావడంతో నేరాలకు కూడా ఈ ప్రాంతం అడ్డగా మారిందని ఇటీవల విడుదలైన ఎన్సీఆర్బీ నివేదికలు కూడా స్పష్టం చేస్తున్నాయి. నగరంలో తాము ఏ నేరాలు చేసినా. ఎక్కడికైనా పారిపోవచ్చునన్న నేరగాళ్లకు భావనకు పోలీసులు చెక్ పెడుతూనే వున్నారు. అంతబట్టిన కేసులను కూడా అత్యంత చాకచక్యంగా రోజల వ్యవధిలోనే చేధిస్తూన్నా.. నేరగాళ్లలో మాత్రం ఇంకా నేర ప్రవృత్తి మారడం లేదు. అయితే ఇప్పటికీ శివారు ప్రాంతాల్లో కోందరు తమ ప్రాంతానికి చెందని యువకులను అడ్డుకుని అరా తీస్తున్నారు.

స్థానికులు ఇలా వ్యవహరించడం వల్లే హయత్ నగర్ లో దారుణ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. హయత్ నగర్ సమీపంలోని బాతుల చెరువు వద్దకు బైక్ పై చేరుకున్న ఇద్ద‌రు యువ‌కులు ఓ యువ‌తి మృత‌దేహాన్ని దుప్పట్లో చుట్టి చెరువులో వేయడానికి యత్నించారు. దీంతో స్థానికులు వారిని ఎవరు మీరు అని ఆరా తీశారు. స్థానికులు ఒక్కరుగా గుమ్మిగూడటంతో నేరగాళ్ల మృతదేహాన్ని చెరువులో వేయలేకపోయారు. స్థానికులు మూటలో ఏముందని తీసి చూడటంతో అందులో ఓ మహిళ మృత‌దేహంపై దుస్తులు కూడా లేవు. ఈ విష‌యాన్ని గుర్తించిన స్థానికులు ఆ యువ‌కుల‌ను అడ్డుకుని ప్ర‌శ్నించారు.

ఆ అమ్మాయి గురించి పోంతన లేని సమాధానాలు చెప్పడంతో స్థానికులకు మరింత అనుమానం కలిగింది. దీంతో వారు మృతదేహాన్ని తరలించి బాతుల చెరువులో వేసేందుకు ప్రయత్నించిన యువ‌కులకు దేహశుద్ది చేశారు. అంతటితో ఆగకుండా వారిపై స్థానిక పోలీసులకు కూడా సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని, ఇద్ద‌రు యువ‌కుల‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా వినోద్ అనే యువకుడు.. ఆ యువతని తాను ప్రేమ వివాహం చేసుకున్నాన‌ని పోలీసుల‌ను న‌మ్మించే ప్ర‌య‌త్నం చేశాడు.  

అయితే ఆమె కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధ‌ప‌డుతోంద‌ని, ఈ క్రమంలో గ‌త రాత్రి మృతి చెందింద‌ని అన్నాడు. త‌న వ‌ద్ద‌ అంత్యక్రియలకు డ‌బ్బు లేద‌ని అందుకే బయటికి తీసుకెళ్లి ఖననం చేయాలకున్నాన‌ని అంటున్నాడు. ఆ యువ‌కుడు చెప్పేది నిజ‌మైతే ఆ యువ‌తి మృత‌దేహాన్ని న‌గ్నంగా ఎందుకు త‌ర‌లిస్తాడ‌ని పోలీసులు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఆ యువ‌కులే అమ్మాయిని హ‌త్య చేసి, పోలీసుల‌కు దొరికిపోవ‌డంతో క‌థ‌లు చెబుతున్నార‌ని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh