TTD good news srivari devotees తిరుమల శ్రీవారి భక్తులు టీటీడీ శుభవార్త..

Tirumala tirupati devasthanam good news srivari devotees

Tirumala Tirupati Devasthanam, TTD, Sri Vari darshanam, Tirumala Darshanam, Lord Balaji darshan, sarva darshanam tokens, Lord Venkateshwara swamy darshanam, YV SubbaReddy, Tirumala darshan, Padmavati Temple, Tiruchanoor, APTDC, Piligrims, Tirumala darshan, Tirumala Package, AP Tourism, Tirumala tirupati devasthanam, TTD Board, Diety Sri Venkateshwara swamy, SriVari dhana Prasadam, Dharma reddy, devotional

The Tirumala Turupati Devasthanam Boad has send good news to Sri Vari devotees with an increase in sarvadarshanam tokens. By which ordinary devotees can have Lord Sri Venkateshwara darshanam.

తిరుమల శ్రీవారి భక్తులు టీటీడీ శుభవార్త.. ఆ టోకన్ల సంఖ్య పెంపు..

Posted: 09/20/2021 09:57 AM IST
Tirumala tirupati devasthanam good news srivari devotees

నిత్యం శ్రీవారి భక్తులకు స్వామి వారి దర్శనాన్ని కల్పించేందుకు పెద్ద పీట వేసే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు.. కరోనా మహమ్మారి విజృంభించి నేపథ్యంలో శ్రీవారి భక్తలకు స్వామివారి దర్శనం కల్పించడంలోనూ అంక్షలను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దీంతో తమకు తమ కొంగు బంగారమైన స్వామివారి దర్శనభాగ్యం కలగడం లేదంటూ ఎందరెందరో భక్తులు నిరాశ, నిసృహలకు గురవుతున్నారు. అయితే సాంకేతిక పరిజ్ఞానం తెలిసిన భక్తులు ఎలాగోలా స్వామివారి ప్రత్యేక దర్శన టికెట్లు తీసుకుని దర్శనం చేసుకుంటుండగా, స్వామివారి దర్శనం కోసం ముడుపులు కట్టుకున్న భక్తలు మాత్రం ఆ వివరాలు తెలియక, స్వామి దర్శనం కలగక అందోళన చెందుతున్నారు.

దీంతో సామన్యా భక్తుల ఇబ్బందులను అర్థం చేసుకున్న టీటీడీ పాలక మండలి.. వారికి స్వామివారి దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంది, అయితే అన్ లైన్ పరిధిలోనే సర్వదర్శనం టోక్లన్లు కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే కోవిడ్ ప్రోటోకాల్ నేపథ్యంలో వీటిని కూడా తక్కువ సంఖ్యలోనే అందుబాటులోకి తీసుకువచ్చింది. వాటిని కూడా కేవలం చిత్తూరువాసులకే పరిమితం చేసింది. ఇక రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో టీటీడీ.. సామాన్య భక్తులకు శుభవార్తను అందించింది. సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.

తద్వారా ఇప్పటి వరకు చిత్తూరు జిల్లా వారికే పరిమితమైన సర్వదర్శన భాగ్యం ఇకపై అందరికీ కలగనుంది. ప్రస్తుతం చిత్తూరు జిల్లా వారికి రోజుకు 2 వేల టికెట్లను జారీ చేస్తుండగా, ఇకపై వాటి సంఖ్యను 8 వేలకు పెంచాలని టీటీడీ నిర్ణయించింది. అంతేకాక, అన్ని ప్రాంతాల వారికి దర్శనానికి అవకాశం కల్పించింది. పెరటాసి నెలకావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తే అవకాశం ఉండడంతోనే టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, సర్వదర్శనం కోసం ఆధార్ కార్డు తప్పనిసరి. ఏ రోజు టికెట్లను ఆ రోజు తెల్లవారుజాము నుంచి శ్రీనివాసంలో జారీ చేస్తామని అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles