No Need to worry with asymptomatic corona in Children చిన్నారుల్లో లక్షణాలు లేని కరోనా.. అందోళన వద్దన్న నిపుణులు

Experts say no need to worry if children are suffering from asymptomatic covid 19

covid-19 children, Asymptomatic corona, covid-19, coronavirus, AIIMS, Kerala, Mizoram, Hospitalisation, cororna Third wave, Schools-reopen, concern

Coronavirus in children should not be of much concern if they are asymptomatic and do not have severe infection, experts said on Thursday, amid some states including Mizoram and Kerala reporting a rise in cases among those aged below 10 years. They, however, stressed on the need for preparing and ramping up arrangements for any eventuality, including more children requiring hospitalisation.

చిన్నారుల్లో లక్షణాలు లేని కరోనా.. అందోళన అవసరం లేదన్న నిపుణులు

Posted: 09/17/2021 11:33 AM IST
Experts say no need to worry if children are suffering from asymptomatic covid 19

కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతున్న కేరళ, మిజోరం సహా పలు రాష్ట్రాల్లో పదేళ్లలోపు చిన్నారులు ఎక్కువగా కోవిడ్ బారినపడుతున్న నేపథ్యంలో నిపుణులు కీలక ప్రకటన చేశారు. పిల్లలకు కరోనా సోకినప్పటికీ వారిలో లక్షణాలు కనిపించకుంటే భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు తెలిపారు. ఒకవేళ చిన్నారుల్లో ఎక్కువమంది కరోనా బారినపడి ఆసుపత్రిలో చేరాల్సి వచ్చినా, ఇతర ఆరోగ్య సంబంధ సమస్యలు కనిపించినా వారి చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాలకు సూచించారు.

కాగా, ఈ ఏడాది మార్చి నుంచి దేశంలోని మొత్తం యాక్టివ్ కేసుల్లో పదేళ్లలోపు చిన్నారుల శాతం పెరుగుతున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. మరీ ముఖ్యంగా మిజోరం, మేఘాలయ, మణిపూర్, కేరళ రాష్ట్రాల్లో చిన్నారులు ఎక్కువగా కొవిడ్ బారినపడుతున్నారు. మిజోరంలో కరోనా బారినపడిన వారిలో 300 మంది చిన్నారులు ఉండడంతో ఆందోళన మొదలైంది. దీనిపై ‘ఎన్‌టాగి’కి చెందిన కొవిడ్ జాతీయ టాస్క్‌ఫోర్స్ చైర్మన్ ఎన్‌కే అరోరా మాట్లాడుతూ.. చిన్నారులకు కరోనా సంక్రమించినట్టు తేలినా అందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

ఇక, చిన్నారులలో లక్షణాలు కనిపించకుంటే మాత్రం భయపడాల్సిన అవసరం లేదన్నారు. వారు తీవ్రస్థాయిలో కరోనా బారినపడడం అత్యంత అసాధారణ విషయమని చెప్పారు. ప్రస్తుతం ఆంక్షలు లేకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి ప్రయాణాలు ప్రారంభించారని, ఈ నేపథ్యంలో వారు కరోనా బారినపడే అవకాశం ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా అన్నారు. కరోనాతో పిల్లలు ఆసుపత్రిలో చేరినంత మాత్రాన మరణించే ప్రమాదం ఉందని భావించకూడదన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles