Leopard and cat`s nail-biting fight video goes viral బావిలో బిగ్ ఫైట్: చిరుతపులి vs మార్జాలము.. గెలుపెవరిదీ.?

Leopard cat come face to face after falling in well in maharashtra

Cat Leopard Faceoff, Cat Leopard Faceoff Video, Nashik Maharashtra Cat Leopard Faceoff, Cat Leopard Faceoff well, what happened next, nail biting video, cat leopard faceoff video nashik, cat leopard faceoff Maharashtra, viral video, video viral, animal, pets vs wild animals, leopard, cat, chase, well, nashik, maharashtra, wild cat vs cat, leopard cat face-off, nail bttting fight, big fight, Viral videos

A cat and a leopard came face to face in Nashik recently. The dramatic video of the nail-biting face-off soon went viral on social media. Both the animals fell in a well. This happened as the leopard was attempting to chase the cat.

ITEMVIDEOS: బావిలో బిగ్ ఫైట్: చిరుతపులి vs మార్జాలము.. గెలుపెవరిదీ.?

Posted: 09/06/2021 07:46 PM IST
Leopard cat come face to face after falling in well in maharashtra

పిల్లి పిల్లలా వున్నావు కూన.. వెళ్లిపో అంటూ అప్పడప్పుడూ వయస్సులో పెద్దవారు చిన్నారులను మందలిస్తుంటారు. చిన్నపిల్లలు తలకుమించిన పనులు చేసినా.. లేక సాహసాలు చేయబూనినా.. వారిని ఇలా మందలించి పంపడం పెద్దలకు అలవాటే. అయితే ఇదే పెద్దవాళ్లు చిరుతను చేస్తూ తడిపేసుకుని ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగులు పెడతారు. కానీ నిజంగా అదే పిల్లి ఇలా జరిగితే.. ఏం చేయగలదో.. ఎలా చిరుతను కూడా ఎదర్కొనగలదో తెలుసా.? ఈ వీడియో చేస్తే.. మీకే అర్థమవుతుంది.

మ‌హ‌రాష్ట్ర‌లోని నాసిక్ జిల్లాలో ఒక గ‌మ్మ‌త్తైన ఘ‌ట‌న చోటుచేసుకుంది. నాసిక్ శివార్లలోని అటవీ ప్రాంతంలో ఓ చిరుత‌పులి మార్జాలము వెంట పడింది. దానిని ఎలాగైనా వేటాడి తినాలని భావించింది. అంతే అనుకున్నదే తడవుగా ఒక ఉదుటున ముందకు అడుగేసి.. మార్జాలన్ని చేధించేందుకు పరుగుతీసింది. ఇది గమనించిన పిల్లి దాని బారి నుంచి త‌ప్పించుకునేందుకు పరుగుతీసింది. అంతే ఇలా ఒకదాని వెంట మరోకటి పరుగులు పెడుతూ రెండూ లోతైన‌ బావిలో ప‌డ్డాయి. నీళ్ల‌లో ప‌డిన వెంట‌నే పిల్లి బావిలోప‌లి గ‌ట్టుపైకి చేరింది.

అంత‌కుమించి ఎటూ వెళ్లే దారిలేక చిరుత‌కు చిక్కిన‌ట్లేన‌ని పిల్లి భ‌యంతో వ‌ణికిపోయింది. ఇంత‌లో చిరుతపులి కూడా నీళ్ల‌లోంచి బావిలోప‌లి గ‌ట్టుపైకి చేరింది. వ‌చ్చీరావ‌డంతోనే పిల్లిపై దాడికి య‌త్నించింది. దాంతో గ‌డ‌గ‌డ వ‌ణుకుతూనే పిల్లి రెండు కాళ్ల‌పై నిల‌బ‌డి ముందు కాళ్ల‌తో చిరుత‌కు దండం పెట్టినంత ప‌నిచేసింది. దాంతో పులి కూడా దాన్ని వేటాడ‌కుండా వ‌దిలేసింది. ఈ ఫ‌న్నీ ఘ‌ట‌న‌కు సంబంధించిన 16 సెక‌న్ల‌ నిడివిగ‌ల వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. పిల్లి భ‌యంతో గ‌డ‌గ‌డ‌ వ‌ణికిపోవ‌డం, చిరుత జాలిచూప‌డం నెటిజ‌న్ల‌ను తెగ ఆక‌ర్షిస్తున్న‌ది. కింది వీడియోలో ఆ ఫన్నీ దృశ్యాల‌ను మీరు కూడా వీక్షించండి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles