హైదరాబాద్ శివారులోని శంషాబాద్ లో రెండేళ్ల క్రితం టోల్ గేటు వద్ద తన వాహనాన్ని పార్కు చేసి తిరిగి వచ్చిన వెటర్నరీ వైద్యురాలిని అత్యంత దారుణంగా నలుగురు మానవమృగాలు చేసిన హత్యాచారకాండ కేసులో మరో మలుపు తిరిగింది. ’దిశ‘ కేసుగా పోలీసులు ఈ కేసును నమోదు చేయడంతో పాటు ఈ కేసలు దారుణానికి పాల్పడిన నలుగరు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. సీన్ ఆఫ్ ఆప్పెన్స్ లో కేసు రీ-కన్సట్రక్షన్ చేస్తుండగా.. పోలీసులను తప్పించుకునే ప్రయత్నం చేసిన నిందితులపై కాల్పులు జరపడంతో వారు ఎన్ కౌంటర్ లో మరణించిన విషయం తెలిసందే.
అయితే ఇది ఫేక్ ఎన్ కౌంటర్ అన్న అరోపణలపై ప్రస్తుతం దీనిని విచారించేందుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కమీషన్ ఏర్పాటు చేసిన విషయం కూడా తెలిసిందే. ఇక శనివారం రోజున నిందితులలో ఒకడైన మహమ్మాద్ ఆరిఫ్ అలియాస్ అహ్మద్ తండ్రి పింజారి హుస్సేన్ ఈ కమీషన్ ఎదుట హాజరై తన కొడుకును పోలీసులు తీసుకుని వెళ్లి.. దారుణంగా ఫేక్ ఎన్ కౌంటర్ పేరుతో దారుణంగా చంపేశారని పింజారి హుస్సేన్ కమీషన్ ఎదుట తెలిపారు. ఇదిలావుండగా తాజాగా ‘దిశ’ హత్యాచార ఘటనలో బాధితురాలి పేరు వెల్లడించడంపై తెలుగు, హిందీ చిత్రసీమకు చెందిన ప్రముఖులతోపాటు మొత్తంగా 38 మంది ప్రముఖులపై కేసు నమోదైంది.
దిశ హత్యాచార కేసులో అమె పేరును సోషల్ మీడియా వేదికగా వెల్లడించడంతో పాటు ఆమె ఫొటోను కూడా షేర్ చేశారంటూ టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులతోపాటు ప్రముఖ క్రీడాకారులపై అప్పట్లోనే నమోదైన కేసులో తీస్ హాజరీ కోర్టు అదేశాలతో ఈ కేసులో కదలిక వచ్చింది. డిల్లీకి చెందిన గౌరవ్ గులాటీ అనే న్యాయవాది ఫిర్యాదు మేరకు 38 మంది ప్రముఖులపై అప్పట్లోనే ఢిల్లీలోని సబ్జీమండి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు వారెంట్ కూడా జారీ చేశారు. అయితే, ఈ కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో న్యాయవాది నిన్న తీస్‌హజారీ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
గౌరవ్ గులాటీ తన ఫిర్యాదులో బాలీవుడ్ స్టార్లు సల్మాన్‌ఖాన్, అక్షయ్‌కుమార్, అజయ్‌దేవ్‌గణ్, అభిషేక్ బచ్చన్, ఫర్హాన్ అక్తర్, అనుపమ్‌ఖేర్, అర్మాన్ మాలిక్, కరీంవీర్ వోహ్రా, టాలీవుడ్ ప్రముఖ నటులు రవితేజ, అల్లు శిరీష్, సాయి ధరమ్‌తేజ్, హీరోయిన్లు పరిణితి చోప్రా, దియా మిర్జా, స్వర భాస్కర్, రకుల్ ప్రీత్‌సింగ్, జరీన్ ఖాన్, యామి గౌతమ్, రిచా చద్దా, కాజల్ అగర్వాల్, షబానా అజ్మీ, హన్సిక మోత్వాని, ప్రియా మాలిక్, మెహ్రీన్ పిర్జాదా, నిధి అగర్వాల్, ఛార్మీ కౌర్, అశిక రంగనాథ్, కీర్తి సురేశ్, దివ్యాంశ్ కౌశిక్, మోడల్ లావణ్య, ఫిల్మ్ మేకర్ అలంకిత శ్రీవాస్తవ, బాలీవుడ్ దర్శకుడు మాధుర్ భండార్కర్, గాయని సోనా మహాపాత్ర, టాలీవుడ్ దర్శకుడు సందీప్‌రెడ్డి, క్రికెటర్ హర్భజన్ సింగ్, శిఖర్ ధావన్, స్టార్ షెట్లర్ సైనా నెహ్వాల్ తదితర 38 మంది పేర్లను పేర్కొన్నారు. వీరందరిపైనా కేసులు నమోదయ్యాయి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more