మనిషై పుట్టినవాడు కాదు మట్టి బొమ్మ.. పట్టుదలే వుంటే కాగలడు మరో బ్రహ్మ.. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహా పురుషులవుతారు.. తరతరాలకీ తరగని వెలుగవుతారు.. ఇలవేల్పులు అవుతారు.. అన్న వేటూరు సుందరరామమూర్తి పాటను వంటబట్టించుకుందోమో తెలియదు గాని.. పట్టుమని ఐదేళ్లు కూడా లేని ఓ చిన్నారి.. తన టాలెంట్, ప్రాక్టీస్ తో అసాధ్యమైన జిమ్నాస్టిక్స్ ను సుసాధ్యం చేసిచూపుతోంది. ఈ చిన్నారి వీడియో నెట్టింట్లో సంచలనంగా మారింది. పలు రంగాలకు చెందిన ప్రముఖల నుంచి సాధారణమైన నెటి జనుల వరకు అందరూ చిన్నారి జిమ్నాస్టిక్కు ఫిదా అవుతున్నారంటతే.
సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా తన గురించే చర్చ. తన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది అంటారా? తను చేసిన జిమ్నాస్టిక్ వీడియో అది. తన జిమ్నాస్టిక్ వర్కవుట్ చూసి మీరే నోరెళ్లబెబతారు. ప్రపంచవ్యాప్తంగా సినీ, క్రీడా సెలబ్రిటీలు సైతం ఈ వీడియోను షేర్ చేసి చిన్నారిని ప్రశంసిస్తున్నారు. రిటైర్డ్ ఇండియన్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ట్విట్టర్ లో ఆ చిన్నారి వీడియోను షేర్ చేయగా.. ఒక్క ట్విట్టర్ లోనే ఇప్పటి వరకు 4.7 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇంత చిన్న వయసులో చిన్నారి ఫిట్నెస్, టాలెంట్ చూసిన నెటిజన్లకు మతిపోతుంది. కొందరైతే ఇది జిమ్నాస్టిక్స్ కాదురా బాబోయ్ ఇది విధ్వంసాన్ని మించిన అరాచకం అంటూ సెల్యూట్ చేస్తున్నారు.
This is INSANE!
The bit at the end
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more