Want cheaper petrol? Go to Afghanistan, BJP leader పెట్రోల్ ధర తగ్గలాలా.? అప్ఘన్ కు వెళ్లు.. బీజేపి నేత వ్యాఖ్య

Go to taliban petrol cheaper in afghanistan bjp leader to journalist

Ramratan Payal, go to afghanistan, BJP Afghanistan, Afghanistan BJP, fuel price, petrol price, diesel price, India fuel price, petrol price today, diesel price today, Taliban, BJP, Katni, Madhya Pradesh, Covid-19 third wave, Madhya Pradesh, Crime

After Pakistan, BJP leaders seem to have found a new favourite destination for their detractors -- Afghanistan under Taliban rule. Ramratan Payal, BJP president for the district of Katni in Madhya Pradesh, told reporters to take a hike to Afghanistan when questioned about inflation and rising fuel prices.

ITEMVIDEOS: పెట్రోల్ ధర తగ్గలాలా.? అప్ఘన్ కు వెళ్లు.. బీజేపి నేత వ్యాఖ్య

Posted: 08/20/2021 05:14 PM IST
Go to taliban petrol cheaper in afghanistan bjp leader to journalist

కరోనా మహమ్మారి రెండో విడత నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ ముగించి అన్ లాక్ ప్రారంభం కాగానే ఇంధన ధరలకు రెక్కలు రావడం.. అసలే కష్టకాలంలో వున్న ప్రజలపై పిడుగు పాటులా పెట్రోల్, డీజీల్ సహా గ్యాస్ ధరల పెంపు పడింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొద్ది రోజుల పాటు నిలకడగా వున్న ధరలు.. ఫలితాలు వెలువడి.. బీజేపికి చెంపపెట్టులాంటి ఫలితాలను అందించడంలో.. ధరలకు ఏ మాత్రం కళ్లెం లేకుండా పోయింది. ఇక ప్రతిపక్షాలు పలు పర్యాలు దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపునివ్వడంతో ఈ మధ్యకాలంలో ధరలు కాసింత స్థిరంగా కొనసాగుతున్నాయి.

ఈ క్రమంలో దేశంలో ఎనబై రూపాయల మార్కు దాటగానే ప్రతిపక్షంలో ఉండగా గగ్గోలు పెట్టిన బీజేపి.. ఇప్పుడు ఆ ధర దేశంలో ఎక్కడా కనిపించకుండా చేసింది. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100 దాటగా.. సామాన్యులు పెరిగిన ఇంధన ధరలతో బెంబేలెత్తుతున్నారు. దీనికి తోడు డీజిల్ ధర కూడా పెరగడంతో దాని ప్రభావం టోకు ధరల ద్రవ్యోల్బణంపై కూడా పడింది. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్‌ ధరలపై ప్రశ్నించిన మీడియాపై మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘పెట్రోల్‌, డీజిల్‌ తక్కువ ధరకు కావాలంటే తాలిబన్‌ పాలిత ప్రాంతానికి వెళ్లండి.. అక్కడ చౌకగా పెట్రోల్‌ దొరుకుతుంది’ అంటూ మండిపడ్డారు.

పెరిగిన పెట్రోల్‌ ధరలపై కట్నీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామ్‌రతన్‌ పాయల్‌ను ప్రశిస్తే.. ‘తాలిబన్‌ పాలిత ప్రాంతానికి వెళ్లిపో. అక్కడ పెట్రోల్‌ రూ.50కే దొరుకుతుంది’ అంటూ వ్యాఖ్యానించారు. ఇంకా మాట్లాడుతూ దేశంలో కరోనా రెండు వేవ్‌లో వచ్చాయని.. మూడో వేవ్‌ రాబోతుందన్నారు. దేశంలో ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుందో మీకు తెలుసా? అంటూ ఎదురు ప్రశ్నించారు. బీజేపీ నేత తీరుపై కాంగ్రెస్‌ విమర్శలు గుప్పించింది. బీజేపీ నేతల వాక్చాతుర్యం కొనసాగుతుందని.. వారికి దేవుడు జ్ఞానం ఇవ్వాలని పేర్కొంది. ఇదిలా ఉండగా దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.101.84 ఉండగా.. డీజిల్‌ ధర రూ.89.27 పలుకుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ramratan Payal  fuel price  Taliban  Afghanistan  BJP leader  Petrol price  Madhya Pradesh  Crime  

Other Articles