Hundreds of men grope, tear clothes of a woman in Lahore పాక్ యువతి బట్టలు చించేసి అటవికమూక దాడి..

Pakistani tiktoker groped thrown into air her clothes torn by hundreds on independence day

Assault on woman in pakistan, Greater Iqbal Park woman assault, assault on woman in Lahore, woman assaulted on Pak Independence day, TikTok, TikToker assaulted in pakistan, woman clothes toren in pakistan, woman tiktoker assaulted, Pakistan, woman Assault, Greater Iqbal Park, Lahore, Pak Independence day, TikTok,TikToker, woman tiktoker, Pakistan, Crime, viral video

In a shocking incident, a female TikToker in Pakistan was assaulted by hundreds of people in Pakistan's Lahore on August 14. The Lahore Police on Tuesday registered a case against hundreds of unidentified persons for assaulting and stealing from the female TikToker and her companions at the city's Greater Iqbal Park.

ITEMVIDEOS: పాక్ స్వత్రంత్య వేడుక పరాకాష్ట.. యువతి బట్టలు చించేసి అటవికదాడి

Posted: 08/18/2021 05:37 PM IST
Pakistani tiktoker groped thrown into air her clothes torn by hundreds on independence day

పాకిస్థాన్ కు భారతదేశం కన్నా ఒక్కరోజు ముందే స్వాతంత్ర్యం వచ్చింది.. కానీ ఈ ఏడాది ఆగస్టు 14న ఓ యువతిపై అక్కడి ఆటవిక మూక జరిపిన వికృతచర్య ప్రపంచవ్యాప్తంగా ఇప్పడు చర్చనీయాంశంగా మారింది. అప్ఘనిస్తాన్ లోని తాలిబన్లకు పాకిస్థాన్ లోని ఈ అల్లరి మూకకు పెద్దగా తేడా లేదంటూ నెటిజనులు మండిపడుతున్నారు. ఇంతగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటే అసలేం జరిగింది.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజున ఓ యువతి తన స్నేహితులతో కలసి టిక్ టాక్ వీడియోలు చేయడానిని గ్రేటర్ ఇక్బాల్ పార్కులోని మినార్ వద్దకు చేరుకోగా అమెపై వందలాది మంది మగాళ్ల లైంగిక దాడికి పాల్పడ్డారు.

ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. చుట్టూ మూగిన 400 మంది మృగాళ్ల నుంచి తప్పించుకునేందుకు ఆ అమ్మాయి చేసిన ప్రయత్నాలన్నీ వృథా ప్రయాసలే అయ్యాయి. అమెతో పాటు అమె స్నేహితులైన ఆరుగురిపై ఈ అనాగరిక మూక దాడి చేసింది. వారి దస్తుల్ని చించి గాల్లోకి విసిరేసి.. వారిని నగ్నంగా మార్చి నడిపించింది. ఆగస్టు 14న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లాహోర్ లోని గ్రేటర్ ఇక్బాల్ పార్క్ లో తన ఐదుగురు సహచరులతో కలిసి వీడియో తీస్తున్న టిక్ టాకర్ ను ఆ అల్లరి మూక హింసించింది.

గుమిగూడి ఆ అమ్మాయిపై 400 మంది అకృత్యాలకు పాల్పడ్డారు. ఆమెను తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు. బట్టలు చించేశారు. గాల్లోకి విసిరేసి వికృతానందం పొందారు. నడి బజార్ లో ఆ అమ్మాయిని బట్టల్లేకుండా నడిపించారు. అంతేకాదు.. ఆమె ఒంటిపైనున్న బంగారు ఆభరణాలను దోచేశారు. సెల్ ఫోన్ ను లాక్కున్నారు. డబ్బులను దొంగిలించారు. ఆ బాధాకరమైన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఆటవిక సమాజంలోనే ఉన్నామా? అంటూ ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు.


ఈ ఘటనపై బాధిత యువతి నిన్న లాహోర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శనివారం స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మినారీ పాకిస్థాన్ వద్ద తన ఆరుగురు సహచరులతో కలిసి వీడియో తీస్తుండగా.. 400 మంది తనను లైంగికంగా, శారీరకంగా హింసించారని ఫిర్యాదులో పేర్కొంది.  ఆ అల్లరి మూకల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినా.. ఫలితం దక్కలేదని ఆవేదన చెందింది. కొందరు తనను కాపాడే ప్రయత్నం చేసినా.. గుంపు ఎక్కువగా ఉండడంతో కుదరలేదని వాపోయింది. తనను గాల్లోకి ఎగిరేసి, బట్టలు చించేసి వికృతానందం పొందారని ఆవేదన వ్యక్తం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles