Twitter unlocks Rahul Gandhi's handle రాహుల్ గాంధీ అకౌంట్ అన్ లాక్.. దిద్దుబాటు చర్యల్లో ట్విట్టర్

Pm modi hit soul of india s democracy by using pegasus rahul gandhi

Rahul Gandhi, Parliament, Twitter India, Rahul Gandhi s twitter handle, Rahul Gandhis twitter handle blocked, Congress accused Twitter, BJP, Parliament ruckus, Pegasus issue, Indias new IT laws, Twitter policy violations, manipulated tweets, social media freedom, Twitter unlocks Rahul handle, Pegasus issue, Amit Shah, PM Modi, National Politics

A week after temporarily suspending his account, Twitter restored Congress leader Rahul Gandhi's handle Saturday, August 14, 2021, but not before the principal opposition party accused it of bias.

రాహుల్ గాంధీ అకౌంట్ అన్ లాక్.. దిద్దుబాటు చర్యల్లో ట్విట్టర్

Posted: 08/14/2021 01:16 PM IST
Pm modi hit soul of india s democracy by using pegasus rahul gandhi

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తో పాటు ఆ పార్టీకి చెందిన దాదాపు 5000 మంది ఇత‌ర నేత‌ల అకౌంట్ల‌ను లాక్ చేసిన ట్విట్టర్ సంస్థ తాజాగా వారినీ అన్‌లాక్ చేసింది. ఆగస్టు 1న ఢిల్లీలో మైనర్ బాలికపై అత్యాచారం‌, హ‌త్య‌ చేయడంతో మృత్యురాలి కుటుంబాన్ని కలసిన రాహుల్ గాంధీ వారిని పరామర్శించి సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తొమ్మిదేళ్ల బాలిక కుటుంబసభ్యులతో దిగిన ఫోటోను రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఈ నేప‌థ్యంలో రాహుల్ గాంధీతో పాటు ఆ పార్టీకి చెందిన ఏకంగా 5 వేల మంది నేత‌ల అకౌంట్ల‌ను ట్విట్ట‌ర్ సంస్థ తాత్కాలికంగా లాక్ చేసిన విష‌యం తెలిసిందే.

అయితే తన ట్విట్టర్ ఖాతాను తాత్కాలికంగా లాక్ చేయడంపై క్రితంరోజున రాహుల్ .. ట్విట్ట‌ర్ యాజమాన్యంపై విరుచుకుప‌డ్డారు. ట్వి్టర్ సంస్థ తమ పాలసిని కొనసాగించేందుకు బదులు అధికార బీజేపి పాలసీని ఫాలో అవుతుందని విమర్శించారు. భార‌తీయ రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌లో జోక్యం చేసుకుని ట్విట్ట‌ర్ సంస్థ ప్ర‌మాద‌క‌ర ఆట ఆడుతున్న‌ట్లు రాహుల్ దుయ్యబట్టారు. ఈ నేప‌థ్యంలో దిగివచ్చిన ట్విట్టర్ సంస్థ యాజమాన్యం.. హుటాహుటిన దిదుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో ట్విటర్‌ ఇండియా హెడ్ మనీష్‌ మహేశ్వరిపై అమెరికాకు బదిలీ వేటు వేస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది.

మనీష్‌ను అమెరికాలో కంపెనీ రెవెన్యూ స్ట్రాటజీ, ఆపరేషన్స్ సీనియర్ డైరెక్టర్ గా ట్విటర్‌ నియమించనుంది. దీంతో మనీష్ మహేశ్వరి.. ట్విట్టర్ హెడ్ క్వార్టర్స్​ ఉన్న శాన్​ఫ్రాన్సిస్కోకు మకాం మార్చనున్నారు. ఇదే క్రమంలో భారత్ లో కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా ఓ డైరెక్టర్ ను నియమించరాదని ట్విటర్ నిర్ణయించింది. ఇక తమపై వచ్చిన అరోపణలను బాపుకునే ప్రయత్నాలు చేసిన ట్విట్ట‌ర్ సంస్థ కాంగ్రెస్ పార్టీ అకౌంట్ల‌ను తిరిగి అన్‌లాక్ చేసింది. అయితే అన్ లాకింగ్ కు సంబంధించి ట్విట్ట‌ర్ సంస్థ ఎటువంటి వివ‌ర‌ణ ఇవ్వ‌లేద‌ని ఆ పార్టీ సోష‌ల్ మీడియా ఇంచార్జి రోహ‌న్ గుప్తా తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles