ACb raids in AO Mahesh chandra chatterjee's house అవినీతి వ్యవసాయ అధికారి.. అమ్యామ్యాల కోసం నయాదారి..

Acb raids in ao mahesh chandra chatterjee s house

Anti corruption Bureau (ACB), ACB raids, Agriculture Officer, Mahesh chandra chatterjee, Chandrugonda Mandal, Rs 90000 bribe, whatsapp group, pesticides shop owners, Ashwarao pet, Khammam district, Telangana, Crime

The Anti corruption Bureau Officials had conducted raids in the house of Aggriculture Officer Mahesh chandra chatterjee at Ashwarao pet, after he has been caught red handedly taking a bride of Rs 90000 from pesticides shop owners of Chandrugonda Mandal of Khammam district

అవినీతి వ్యవసాయ అధికారి.. అమ్యామ్యాల కోసం నయాదారి..

Posted: 08/10/2021 12:31 PM IST
Acb raids in ao mahesh chandra chatterjee s house

ఎనమిదేళ్లుగా ఒకే జిల్లాలో పాతుకుపోవడం అతని అవినీతికి కొత్త బాష్యం చెప్పేలా చేసింది. అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మరీ ఓ అధికారి అమ్యామ్యాల కోసం నయాదారిని వెతుక్కున్నాడు. అధికారి ఆగడాలు నానాటికీ శృతిమించిపోవడంతో తట్టుకోలకపోయిన దుకాణాదారులు అతనిపై అవినీతి నిరోధకశాఖ అధికారులకు పిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఏసీబి అధికారులు యధావిధిగా లంచాలు తీసుకువెళ్లేందుకు అధికారి రావడంతో లంచంగా తీసుకున్న డబ్బుతో పాటు రెడ్ హ్యండెండ్ గా పట్టుకున్నారు. అధికారి నివాసంలోనూ సోదాలు నిర్వహించారు.

కాగా, ఏ నెలలో ఏ దుకాణాదారుడు ఎంతెంత ముడుపులు చెల్లించుకోవాలో పేర్కోంటూ ఈ అధికారి ఎంచుకున్న నయాదారి వాట్సాప్ గ్రూప్. మండలంలోని దుకాణాదారులతో కూడిన వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసి మరీ లంచాలు వసూలు చేస్తున్న మండల వ్యవసాయాధికారి తంతు తెలిసి ఏసీబీ అధికారులు నివ్వెరపోయారు. ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇవ్వరాదని ఓ వైపు విపరీతంగా ప్రచారం చేస్తున్నా.. అధికారులు మాత్రం అమ్యామ్యాల కోసం అర్రులు చాస్తుండటం విస్తుగొలుపుతుందని ఏసీభి అధికారులు పేర్కోన్నారు.

ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలంలో నార్లపాటి మహేశ్‌చందర్‌ ఛటర్జీ 8 సంవత్సరాలుగా మండల వ్యవసాయాధికారి (ఏవో)గా పనిచేస్తున్నారు.  లంచాల రుచిమరిగిన ఆయన ఎరువులు, పురుగుమందుల దుకాణాల యజమానుల నుంచి ముడుపులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. తాను తనిఖీలు నిర్వహించకుండా ఉండాలంటే నెల నెలా ముడుపులు సమర్పించుకోవాలంటూ ఏకంగా వాట్సాప్ గ్రూపునే ఏర్పాటు చేశారు. ఈ నెలలో ప్రతి దుకాణం రూ. 15 వేల చొప్పున ఇవ్వాలంటూ మెసేజ్‌లు పంపారు. ఇక దీంతో పాటు ఇద్దరు వ్యక్తులతో కలసి మండల పరిధిలో పరోక్షంగా ఎరువుల దుకాణాన్ని కూడా ప్రారంభించాడు.

ఓ వైపు లంచాలు తీసుకుంటూనే మరోవైపు వ్యాపారం కూడా చేయిస్తున్న మండల వ్యవసాయ అధికారి వేధింపులు భరించలేని వ్యాపారులు గత నెల 30న ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఏసీబీ అధికారుల సలహా మేరకు ఆరు దుకాణాల నుంచి సేకరించిన సొమ్మును తీసుకునేందుకు రావాలంటూ దుకాణదారులు ఏవోను కోరారు. నిన్న చంద్రుగొండ రైతు వేదికలో యజమానుల నుంచి రూ. 90 వేల లంచం సొమ్ము తీసుకుంటుండగా వల పన్నిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అదే సమయంలో అశ్వారావుపేటలోని ఆయన స్వగృహంలోనూ సోదాలు నిర్వహించారు. ఏవోపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles