KCR bribed Huzurabad leaders to influence by-poll: Etela కేసీఆర్ ఆటిట్యూడ్.. ఉద్యమ ద్రోహులను అందలం: ధ్వజమెత్తిన ఈటెల

Cm kcr bribed huzurabad leaders to influence by poll result alleges etela

Padi Kaushik Reddy, CM KCR, Padi Kaushik reddy nominated MLC, Governor quota, By-Elections, Huzurabad, Padi Kaushik Reddy Madannapet Vijender, Padi Kaushik Reddy Audio call viral, Huzurabad By-elections, Etela Rajender By-Elections, Huzurabad, TPCC secretary, KoushikReddy, Phone Call viral, Congress, Audio viral, Etela Rajender, CM KCR, TRS, KTR, Gangula Kamalakar, Harish Rao, Telangana, Politics

Telangana BJP leader Eatala Rajender on Thursday alleged that Chief Minister K Chandrashekar Rao bribed leaders of various political parties in Huzurabad Assembly constituency in view of by-election. Speaking to the media, the former minister accused the TRS government of spending Rs 150 crore in Huzurabad constituency alone.

కేసీఆర్ ఆటిట్యూడ్.. ఉద్యమ ద్రోహులను అందలం: ధ్వజమెత్తిన ఈటెల

Posted: 08/05/2021 04:57 PM IST
Cm kcr bribed huzurabad leaders to influence by poll result alleges etela

మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యమ పార్టీలో ఉద్యమ ద్రోహులను అందలం ఎక్కించడం ఎంతవరకు సమంజసమని ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ ను నిలదీశారు. కేసీఆర్ ఎప్పుడు ఎవరికి పట్టం కడతారో జనం అర్థం చేసుకోవాలన్నారు. ఉద్యమంలో నిద్రహారాలు లేకుండా తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిన తనను ఓడించేందుకు.. మానుకొండలో ఉద్యమనేతలపై రాళ్లు రువ్విన వారికి ఇప్పుడు పార్టీలో పెద్దపీట వేస్తున్నారని దీనిని తెలంగాణ ప్రజలందరూ గుర్తించాలని అన్నారు.

కేసీఆర్ కు హుజూరాబాద్ ప్రజల మీద కంటే వారి ఓట్ల మీదే ప్రేమ ఎక్కువన్నారు. హుజూరాబాద్ ఎన్నిక రాగానే పెన్షన్ వస్తున్నాయి.. రేషన్ కార్డులు వస్తున్నాయి, యాదవులకు గోర్రెలు, మేకలు వస్తున్నాయి.. దళితులకు దళితబంధు వస్తుందని.. తన ఓడించేందుకు ఈ పథకాలను తీసుకువచ్చినా.. తన ప్రజలకు మేటు జరుగుతున్నందుకు తనకు సంతోషంగా వుందని ఈటెల అన్నారు. ప్రభుత్వం ఎన్ని పథకాలను తీసుకోచ్చినా.. అన్నింటినీ తీసుకుని.. ఎన్నికలలో మాత్రం ఓటు ఎవరికి వేయాలో కూడా తన హుజూరాబాద్ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని ఆయన అన్నారు.

హుజూరాబాద్ లో గొల్ల, కుర్ముల ఓట్లు కొల్లగొట్టేందుకు బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ కూడా ప్రభుత్వమే భరిస్తుండటం మరింత సంతోషాన్ని కలిగిస్తుందని అన్నారు. ఎన్నికల సమయం వచ్చిదంటే చాలు పథకాలు.. వరాలు కురిపించే కేసీఆర్ ఇప్పుడు దళితబంధు పథకాన్ని తీసుకోచ్చారని అన్నారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కానీ, సీఎంగా కానీ ఎప్పుడైనా ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారా అని ప్రశ్నించారు. ఏడు సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా ట్యాంక్ బండ్ పైనున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయని కేసీఆర్…దళితులను గౌరవించే పద్ధతి ఇదేనా అని ప్రశ్నించారు.

ఏడేళ్లలో సీఎం ఆఫీస్ లో ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అధికారి నియామకం జరగలేదన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఎక్కడ కూడా అములు కాలేదని చెప్పారు. దళితుల జీవితాల్లో వెలుగు నింపలేదని విమర్శించారు. దళితులకు ముఖ్యమంత్రి పదవి కాదు ఇచ్చిన ఉపముఖ్యమంత్రి పదవిని కూడా మున్నాళ్ల ముచ్చటే చేశాడని విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు రూ.3116 భృతి ఇస్తామన్న వాగ్ధానాన్ని కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే నిలుపుకోవాలని డిమాండ్ చేశారు. దళితబంధు పథకాన్ని యావత్తు తెలంగాణకు వర్తింపజేయాలని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CM KCR  Padi Kaushik reddy  MLC  By-Elections  Huzurabad  Etela Rajender  Telangana  Politics  

Other Articles