Devineni Uma gets bail in rioting and SC/ST case హైకోర్టులో దేవినేని ఉమకు ఊరట.. బెయిల్ మంజూరు

Andhra pradesh high court grants bail to devineni uma maheswara rao in sc st case

Devineni Uma, Devineni Uma Maheswar Rao, TDP Senior Leader, Former Minister, SC ST Atrocity case, G Konduru police station, High Court, bail petition, Mylavaram constituency, Kondapalli forest area, illegal mining, Andrha Pradesh, Politics

Former irrigation minister of Andhra Pradesh and senior Telugu Desam Party leader Devineni Umamaheswara Rao was on Wednesday granted bail by the state high court in connection with the alleged rioting and attack on the police at G Konduru police station last week.

దేవినేని ఉమకు ఊరట.. బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

Posted: 08/04/2021 03:03 PM IST
Andhra pradesh high court grants bail to devineni uma maheswara rao in sc st case

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత దేవినేని ఉమామహేశ్వర్ రావుకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో హైకోర్టులో ఊరట లభించింది. కృష్ణా జిల్లా జి.కొండూరు పోలీస్ స్టేషన్ లో ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. తనపై కావాలనే అక్రమంగా కేసులు పెట్టారంటూ దేవినేని ఉమ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం క్రితం రోజునే విచారణ చేపట్టింది. వాదనలు ముగిసిన నేపథ్యంలో బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది.

మైలవరం నియోజకవర్గంలోని కొండపల్లి అటవీ ప్రాంతంలో మైనింగ్ అక్రమాలకు అధికార పార్టీకి చెందిన నాయకులు పాల్పడుతున్నారని అరోపణలు రావడంతో అక్కడికి వెళ్లి పరిశీలించిన ఆయన తిరిగి వస్తుండగా ఆయన కారుపై దాడి జరిగింది. దీంతో ఆయన జి.కొండూరు పోలిస్ స్టేషన్ ఎదుట తన కారులోనే కూర్చోని ధర్నా చేస్తుండగా.. అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఉద్దేశపూర్వకంగానే దేవినేని ఉమపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. ఫిర్యాదుదారు ఆరోపిస్తున్నట్టు పిటిషనర్‌ ఏ నేరానికీ పాల్పడలేదని చెప్పారు. ఫిర్యాదుదారుది ఏ సామాజికవర్గమో తెలియదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.

కొండపల్లిలో జరిగిన పార్టీ సమావేశంలో గ్రామస్థులు అటవీ ప్రాంత సమస్యను దేవినేని ఉమ దృష్టికి తీసుకెళ్లటంతో అప్పటికప్పుడు నిర్ణయించుకుని ఆ ప్రాంతానికి వెళ్లారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. కస్టడీ కోసం మచిలీపట్నం కోర్టులో పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించారు. కేసు విచారణ జరుగుతోందని.. మిగిలిన నిందితులను అరెస్టు చేయాల్సి ఉన్నందున ఈ దశలో బెయిల్‌ ఇవ్వటం సరికాదని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. నిర్ణయాన్ని వాయిదా వేసింది. తాజాగా దేవినేని ఉమకు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles