Rahul Gandhi Breakfast Meet with Opposition మాక్ పార్లమెంటుపై విపక్ష పార్టీలతో చర్చించిన రాహుల్

Breakfast meet cycle protest opposition launches parliament offensive

Rahul Gandhi, Opposition Meeting, Rahul Gandhi cycles to parliament, Opposition breakfast meeting, Pegasus Snooping row, Fuel price hike, petrol prices, Monsoon Session of parliament, spying software, pegasus snooping gate, Farmers agitation, corona pandemic, mock parliament, taxes on fuel, National politics

Congress leader Rahul Gandhi led a meeting of opposition leaders this morning - the second in a week - amid disruptions and protests in parliament over the Pegasus snooping row, the handling of the pandemic, and farmers' agitation, among other issues. Today's breakfast meeting was called to discuss the option of holding a "mock parliament" outside.

ITEMVIDEOS: మాక్ పార్లమెంటుపై విపక్ష పార్టీలతో చర్చించిన రాహుల్

Posted: 08/03/2021 11:37 AM IST
Breakfast meet cycle protest opposition launches parliament offensive

కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం అమలుపరుస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై వారం రోజుల వ్యవధిలో రెండో పర్యాయం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంటు ఉభయ సభలకు చెందిన విప‌క్ష సభ్యులతో ఇవాళ సమావేశమయ్యారు. విప‌క్ష పార్టీ నేత‌ల‌తో కాన్ స్టూష‌న్ క్ల‌బ్ లో జరిగిన విపక్ష పార్టీ ఎంపీల సమావేశంలో ఆయన పలు అంశాలపై చర్చించారు. ఇవాళ విపక్ష పార్టీలకు చెందిన సభ్యులకు బ్రేక్ ఫాస్ట్ మీట్ కు ఆహ్వానించిన ఆయన పార్లమెంటు ఎదుట మాక్ పార్లమెంట్ నిర్వహించే అంశంపై వారితో చర్చిచారు.

ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు చెందిన ఫ్లోర్‌లీడ‌ర్లలతో పాటు పలువురు ఎంపీలు కూడా ఈ అల్పాహార సమావేశానికి హాజరైనట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివ‌సేన‌, ఆర్జేడీ, ఎస్పీ, సీపీఐ, సీపీఎం, ఆర్ఎస్‌పీ, కేర‌ళ కాంగ్రెస్‌, జార్ఖండ్ ముక్తి మోర్చా, నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్‌, తృణ‌మూల్ కాంగ్రెస్‌, లోక‌తాంత్రిక్ జ‌న‌తాద‌ళ్ పార్టీల‌కు చెందిన ఫ్లోర్ లీడ‌ర్లు హాజ‌ర‌య్యారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ భావ‌జాలానికి వ్య‌తిరేకంగా మ‌నం అంతా క‌లిసి పోరాడాల‌ని రాహుల్ అన్నారు. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా మ‌న స్వ‌రం వినిపిస్తే, మ‌న స్వ‌రం అంత బ‌లంగా మారుతుంద‌ని కాంగ్రెస్ నేత తెలిపారు.

మాక్ పార్లమెంటు నిర్వహణ విషయమై చర్చించిన రాహుల్ గాంధీ.. ఈ సందర్భంగా కరోనా కష్టకాలంలో ప్రజలపై పడుతున్న ఇంధన భారం.. తద్వరా నిత్యావసర సరుకులపై పడుతున్న భారం.. కరోనా కల్లోలాన్ని అదుపు చేయడంలో విఫలమైన పాలకపక్షం.. కరోనా బాధిత కుటుంబాలకు దక్కని ప్రభుత్వం అభయం.. సాగు చట్టాలకు వ్యతిరేకంగా.. రైతులకు అండగా నిలవడం.. దేశంలోని ప్రముఖులకు ఫోన్లు ట్యాపింగ్ వ్యవహరాంతో పాటు ఇత్యది విషయాలపై మాక్ పార్లమెంటు నిర్వహించాలని కూడా నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

విప‌క్ష పార్టీ నేత‌ల‌తో అల్పాహారం సమావేశం తరువాత రాహుల్ గాంధీ.. తనదైన శైలిలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనను వ్యక్తం చేశారు. రోజురోజుకు పెరుగుతున్న ఇంధన ధరలు, గ్యాస్ సిలిండర్ ధరల నేపథ్యంలో ప్రజలకు మళ్లీ సైకిల్ పై ప్రయాణించే రోజులను గుర్తు చేస్తున్నాయంటూ ఆయన పార్ల‌మెంట్ కు సైకిల్ యాత్ర చేప‌ట్టారు. ఆ ర్యాలీలో విప‌క్ష ఎంపీలు కూడా పాల్గొన్నారు. ఇదిలావుండగా ఈ వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో దాదాపుగా అన్ని రోజులు సమావేశాలు వాయిదా పడుతూనే వస్తున్నాయి. పెగాస‌స్ వ్య‌వ‌హారంపై చర్చ జరగాలని జేపీసి కమిటీతో విచారణ జరిపించాలని విపక్షాలు డిమాండ్ చేస్తూనే వున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles