Modi-Shah ‘hit soul of India’s democracy’: Rahul Gandhi పెగసస్ తో కేంద్రమే దేశద్రోహానికి పాల్పడింది: రాహుల్ ఫైర్

Pm modi hit soul of india s democracy by using pegasus rahul gandhi

Pegasus scandal, Rahul Gandhi, Parliament, Pegasus, pegasus hack, rahul gandhi opposition meet, rahul gandhi parliament pegasus, opposition unity pegasus, rahul gandhi news, pegasus news, Pegasus snooping row, Industrialist Anil Ambani, former CBI Director Alok Verma, CBI senior officers Rakesh Asthana, AK Sharma, Reliance ADA, Tony Jesudan, French company Dassault, Dassault Aviation India rep venkata rao posina, Pegasus issue, Amit Shah, PM Modi, National Politics

The Prime Minister "inserted a weapon in our phones", used it to "hit the soul of India's democracy" and now the government is trying to silence opposition demands for a discussion in Parliament, Congress MP Rahul Gandhi said Wednesday.

పెగసస్ తో కేంద్రమే దేశద్రోహానికి పాల్పడింది: రాహుల్ ఫైర్

Posted: 07/28/2021 04:16 PM IST
Pm modi hit soul of india s democracy by using pegasus rahul gandhi

ఇజ్రాయిల్ కు చెందిన పెగాసస్ స్పైవేర్ తో దేశంలోని పలువురు ప్ర‌ముఖుల ఫోన్లు హ్యాక్ అయ్యాయని విషయమై ఇవాళ కూడా పార్లమెంటు ఉభయ సభల్లో ప్రకంపనలు సృష్టించాయి. దేశభద్రతకు ముప్పును తెచ్చే ఉగ్రవాదులపై వినియోగించాల్సిన పెగాసెస్ ను దేశ ప్రజలపై వినియోగించారన్న అరోపణలతో తీవ్ర కలకలం రేగుతోంది. ఇప్పటికే విపక్షాలు కేంద్రం హోం మంత్రి అమిత్ షాను తన పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్ చేస్తున్నాయి. స్వతంత్ర సంస్థలతో దర్యాప్తు చేయాలని కూడా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

తాజాగా పెగాసస్ విషయంపై పార్లమెంటులో చర్చించాలని డిమాండ్ చేస్తున్న విపక్షాలు ఈ విషయలో కేంద్రప్రభుత్వాన్ని అదేశించాలని కోరుతూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు కూడా లేఖ రాశాయి. ఇవాళ లోక్ సభలోనూ పెగాసస్ పై చర్చించాలని కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు వాయిదా తీర్మాణానికి నోటీసులు ఇచ్చాయి. అయినా ఇవాళ కూడా కేంద్రం అందుకు అనుమతించలేదు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల నాయకులతో కలసి పార్లమెంటు వద్ద సమావేశమైన రాహుల్ పార్లమెంటులో వ్యవహరించాల్సిన వ్యూహాల గురించి చర్చించారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోడీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ ప్రజల పోన్లలో కేంద్రం ఆయుధాన్ని పెట్టిందని అరోపించారు. దేశప్రజలను స్వేచ్చగా మాట్లాడుకోలేని దయనీయస్థితికి తీసుకెళ్తోందని విమర్శించారు. పార్లమెంటులో తమ సంఖ్యబలంతో ప్రతిపక్షాల గోంతు నొక్కుతున్న కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం.. పెగాసెస్ అంశంపై చర్చించాలని తాము పట్టుబడుతున్నా అందుకు అనుమతించడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెగాసస్ ను కొన్నదా? లేదా? స్పష్టంగా చెప్పాలని నిలదీశారు. దేశ ప్రజలపై దానిని వాడారా? లేదా? అని ప్రశ్నించారు.

పెగాసస్ అనేది తమకు దేశద్రోహం లాంటిదేనని, ఈ ఆయుధాన్ని ప్రజాస్వామ్యంపై వాడారని అన్నారు. ఇది వ్యక్తిగత గోప్యతకు సంబంధించింది కాదన్నారు. ఉగ్రవాదులపై వాడాల్సిన ఆయుధాన్ని మోదీ, అమిత్ షాలు ప్రజలపై వాడారన్నారు. దేశ ప్రజాస్వామ్యపు ఆత్మపై వారిద్దరూ దెబ్బకొట్టారన్నారు. పార్లమెంట్ లో పెగాసస్ అంశాన్ని ఎందుకు చర్చించరని ప్రశ్నించారు. తాము పార్లమెంట్ సమావేశాలను అడ్డుకుంటున్నామంటూ ప్రభుత్వం ఆరోపిస్తోందని, అయితే, తమ విధులనే తాము నిర్వర్తిస్తున్నామని రాహుల్ అన్నారు. కాగా, పెగాసస్ అంశంపై 14 పార్టీలతో కలిసి రాహుల్ గాంధీ పోరాటానికి సిద్ధమయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles