Shilpa Shetty questioned in Raj Kundra's porn case రాజ్ కుంద్రా ఇంటిపై ముంబై పోలీసుల తనిఖీలు

Police record shilpa shetty s statement seize a laptop during search

Raj Kundra, Mumbai Police, Porn Case, Raj Kundra News, Raj Kundra News Today, Porn Case News, Raj Kundra Latest News, Pornography Case News, Raj Kundra sent to Police Custody, Raj Kundra Police Custody, Raj Kundra arrested, shilpa shetty husband arrested, shilpa shetty husband case, raj kundra porn racket, Crime

After arresting her husband and businessman Raj Kundra in a case of alleged production and distribution of pornographic films through apps, Mumbai Police recorded the statement of Bollywood actor Shilpa Shetty, an official said.

నీలి చిత్రాల కేసు: రాజ్ కుంద్రా నివాసంపై పోలీసుల తనిఖీలు

Posted: 07/24/2021 12:04 PM IST
Police record shilpa shetty s statement seize a laptop during search

బాలీవుడ్ న‌టి శిల్పా శెట్టి భ‌ర్త, వ్యాపార‌వేత్త రాజ్ కుంద్రాకు మూడు రోజుల పోలీసు కస్టడీని పోడగించింది న్యాయస్థానం. పోర్నోగ్రఫీ (నీలిచిత్రాలకు) సంబంధించిన  కేసులో ఆయ‌న్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇవాళ ఆయన నివాసంలో సోదాలు నిర్వహించారు. ఓ వైపు ఆయనను తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు అదే సమయంలో ఈ కేసులో దర్యాప్తు వేగాన్ని పెంచారు. రాజ్ కుంద్రా, శిల్పాశెట్టిలకు చెందిన నివాసాలు, వ్యాపార సముదాయాలలో సోదాలు నిర్వహించారు.

ఆయనకు నీలిచిత్రాల తీసినవారితో సంబంధాలు వున్నాయని ఇప్పటికే తమ వద్ద బలమైన సాక్ష్యాలు వున్నాయిన చెప్పిన ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు.. ఆయనే ఈ చిత్రాల వ్యవహారంలో కీలక సూత్రధారి అని నిరూపించేందుకు మరిన్ని సాక్ష్యాధారాలను సేకరించడంలో భాగంగా ఆయన ఇళ్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహించారు. అయితే రాజ్ కుంద్రా అరెస్టుకు సంబంధించి ఆయన భార్య శిల్పాశెట్టి స్పందించిన నేపథ్యంలో ఈ దాడులు సంచభవించడం గమనార్హం. అన్ని నీలిచిత్రాలు కావని, శృంగార చిత్రాలని అమె సమర్థించే ప్రయత్నం చేశారు.

కాగా, యాప్ లో అప్ లోడ్ చేసిన వీడియోలను పోర్న్ వీడియోలుగా చూడరాదని రాజ్ తరపు న్యాయవాది వాదించారు. మరోవైపు, తన అరెస్ట్ ను బాంబే హైకోర్టులో రాజ్ కుంద్రా సవాల్ చేశారు. పోలీసులు తన పేరును ఒరిజినల్ ఎఫ్ఐఆర్ లో నమోదు చేయకుండానే తనను అరెస్టు చేశారని ఆయన అన్నారు. తన అరెస్టు తర్వాతే సీఆర్‌పీసీ41ఏ నోటీసుపై బలవంతంగా సంతకం చేయించుకున్నారని తెలిపారు. ఇది ముమ్మాటికీ చట్టాన్ని ఉల్లంఘించడమేనని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles