Traffic restrictions for Balkampet Yellamma Kalyanam వైభవోపేతంగా బల్కంపేట ఎల్లమ్మతల్లి కల్యాణ మహోత్సవం

Balkampet yellamma kalyanam traffic restrictions in hyderabad

balkampet Temple, bonala jathara, Minister Indrakaran Reddy, Minister Talasani Srinivas Yadav, yellamma kalyanam, Balkampet Yellamma Temple, Traffic restrictions, Balkampet Yellamma thalli Kalyanam, SR Nagar T Junction, Hyderabad, Telangana, Politics

In view of Balkampet Yellamma Kalyanam at Yellamma Devasthanam, Balkampet, Hyderabad Traffic Police imposed traffic restrictions from Monday to Wednesday in the surrounding areas. Bylanes and link roads from SR Nagar ‘T’ Junction to Fateh Nagar will remain closed.

వైభవోపేతంగా బల్కంపేట ఎల్లమ్మతల్లి కల్యాణ మహోత్సవం

Posted: 07/13/2021 11:16 AM IST
Balkampet yellamma kalyanam traffic restrictions in hyderabad

ప్రతీఏటా ఆషాడమాసంలో బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని భక్తులు అత్యంత భక్తిశ్రద్దలతో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సంవత్సరం కూడా అమ్మవారి కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కోవిడ్ మహమ్మారి నుంచి తెలంగాణ బయటపడిందన్న నేపథ్యంలోనూ కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ.. అతిరధ మహారధులు అమ్మవారి ఆలయానికి విచ్చేసి అమ్మవారికి కళ్యాణాన్ని వీక్షించారు. అంతకుముందు అమ్మవారికి ప్రత్యేక పూజలను కూడా నిర్వహించారు.

బల్కంపేల ఎల్లమ్మతల్లి అనుగ్రహాన్ని పోందటంతో పాటు అమ్మవారి క‌ల్యాణ మ‌హోత్స‌వాన్ని తిల‌కించేందుకు న‌గ‌రంతో పాటు రంగారెడ్డి సహా పలు జిల్లాలకు చెందిన భక్తులు కూడా భారీ సంఖ్యలో త‌ర‌లివ‌చ్చారు. భ‌క్తులు అమ్మ‌వారికి మొక్కులు స‌మ‌ర్పించుకున్నారు. అమ్మవారికి కల్యాణ మహోత్సవం సందర్భంగా అమ్మవారికి బియ్యం పోసేందుకు కూడా భక్తులు పోటీపడ్డారు. అమ్మవారి కల్యాణ మహోత్సవం సందర్భంగా రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ క‌లిసి ప్ర‌భుత్వం త‌ర‌పున‌ అమ్మ‌వారికి ప‌ట్టు వ‌స్ర్తాలు స‌మ‌ర్పించారు.

అమ్మ‌వారి క‌ల్యాణాన్ని తిల‌కించి.. ఆశీర్వాదాలు పోందేందుకు మంత్రులు కుటుంబ స‌మేతంగా వచ్చి దర్శించుకున్నారు. కొవిడ్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా క‌ల్యాణ వేడుక‌ను నిర్వ‌హించారు. కార్య‌క్ర‌మంలో జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి కూడా హాజరయ్యారు. కాగా అమ్మవారి కల్యాణమహోత్సవం సందర్భంగా ఈ ప్రాంతంలో ట్రాఫిక్ అంక్షలు అమల్లో వున్నాయి. ఆలయ పరిసరాల్లో మూడు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలను పెట్టిన పోలీసులు, వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా దారిమళ్లించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles