NIA court discharges Akhil Gogoi in UAPA case జైలు నుంచి పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే విడుదల

Nia court discharges akhil gogoi in uapa case pulls up agency

Akhil Gogoi discharged NIA, Akhil Gogoi, Assam news, Akhil Gogoi anti-CAA, anti-CAA movement, CAA, Akhil Gogoi UAPA, Crime

Assam activist and Sibsagar MLA Akhil Gogoi walked free after a special NIA court in Guwahati cleared him of all charges under the Unlawful Activities (Prevention) Act or UAPA for his alleged role in violent anti-Citizenship (Amendment) Act protests in the state in December 2019.

జైలు నుంచి పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే అఖిల్ గొగోయ్ విడుదల

Posted: 07/02/2021 12:31 PM IST
Nia court discharges akhil gogoi in uapa case pulls up agency

అసెంబ్లీ రౌడీ చిత్రంలో దుష్టశక్తులకు వ్యతిరేకంగా పోరాడి జైలు పాలైన హీరో మోహన్ బాబును ఆ ప్రాంత ప్రజలు ఒక్కటై గెలిపించినట్లుగా.. అస్సోంలోని శివసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఈ సామాజిక కార్యకర్తను కూడా ప్రజలు అదే తరహాలో గెలిపించి బ్రహ్మరథం పట్టారు. ఆయన పేరు అఖిల్ గొగోయ్. ఈయనను సామాజిక కార్యకర్త అంటున్నా.. మరి ఏడాదిన్నర కాలంగా జైలుకు ఎందుకు వున్నారన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయా.? ఆయన కేంద్రప్రభుత్వం అమలు పరుస్తున్న సీఏఏకు వ్యతిరేకంగా ఉద్యమించిన నేపథ్యంలో ఆయనపై చట్టవ్యతిరేక కార్యకలాపాల ప్రతిఘటించే చట్టం కింద అరెస్టు చేశారు.

అయితే ఆయనపై పెట్టిన కేసు విచారణ నేపథ్యంలో విచారించిన ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు ఆయనపై మోపబడిన అభియోగాలను ఎన్ఐఏ అధికారులు నిరూపించలేకపోయారని పేర్కోంటే కేసును కొట్టివేసింది. దేశానికి ముప్పుతలపెట్టే వ్యక్తులను కటకటాల్లోకి నెట్టే ఎన్ఐఏ అధికారుల పనితీరును ప్రశంసిస్తూనే.. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న అభియోగాలను సామాన్యులపై మోపడం మాత్రం ఎన్ఐఏ అధికారుల పనితీరుకు వ్యతిరేకంగా వుందని న్యాయస్థానం అక్షేపించింది. ఈ కేసులో నిందితులను ట్రయల్ పేరుతో జైలులో పెట్టడం కంటే స్వేచ్చవాతావరణంలోకి పంపడం సముచితంగా భావిస్తున్నట్లు పేర్కోంది.

కాగా, అసోంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జైలు నుంచి పోటీచేసి గెలుపోందిన రైజోర్ దళ్ పార్టీ ఎమ్మెల్యే అఖిల్ గొగొయ్ ను విడుదల చేయాలని అదేశాలు జారీ చేసింది. దీంతో 2019 నుంచి జైలులో వున్న ఆయన విడుదలవుతూనే సీఏఏకు వ్యతిరేకంగా ఉద్యమించి.. పోలీసు కాల్పుల్లో మరణించిన 17 ఏళ్ల యువకుడు సామ్ స్టాఫోర్డ్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ఇక తనకు అఖండ విజయాన్ని అందించిన శివసాగర్ నియోజకవర్గం ప్రజలు కలువనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇకపై తన పోరు ఉపా చట్టంపైనే ఉంటుందని ఆయన అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles