Remdesivir induced bradycardia in COVID-19 patients రెమిడిసివిర్ సైడ్ ఎఫెక్ట్స్.. బ్రాడికార్డియాతో అప్రమత్తత అవసరం..

Remdesivir induced dangerously low heart rate in covid 19 patients

Remdesivir, bradycardia, low heart rate, dopamine, USF Morsani Medical College, Regional Medical Center, Bayonet, Dr. Patrick Jacinto, hemodynamics, Hudson, Florida, USA

After starting treatment with COVID-19 with remdesivir, the patient experienced significant bradycardia or low heart rate. Her doctor used dopamine injections to stabilize her throughout the 5-day course of remdesivir treatment, and her heart condition resolved spontaneously at the end of the treatment. The case is explained in Case report of cardiac rhythm.

రెమిడిసివిర్ సైడ్ ఎఫెక్ట్స్.. బ్రాడికార్డియాతో అప్రమత్తత అవసరం..

Posted: 06/29/2021 11:33 AM IST
Remdesivir induced dangerously low heart rate in covid 19 patients

కరోనా మహమ్మారి సోకిన వ్యక్తులకు అందించే చికిత్సలో భాగంగా రెమిడిసివిర్ ఇంజక్షన్ ను ఉపయోగించడం ప్రపంచవ్యాప్తంగా సాధరణ ఔషధంగా మారింది. కరోనా తొలిదశలో వుండగా రెమిడెసివిర్‌ ఓరల్ మెడిసిన్ కాసింత తీవ్రంగా వుంటే ఇంజక్షన్ రూపకంగా రోగులకు చికిత్స చేస్తున్నారు. అయితే రెమిడిసివిర్ ఔషధంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వున్నాయన్న విషయాలపై అప్పట్లో పెద్దగా పరిశీలించలేదు. కరోనా మహమ్మారి నుంచి రోగులను నయం చేయడానికే వైద్యలు, పరిశోధకులు అధ్యయనం చేసి రెమిడిసివీర్ ఔషధాన్ని తయారు చేశారు.

అయితే తాజాగా రెమిడిసివీర్ ఔషధంతో బ్రాడికార్డియా సంభవిస్తోందని తాజాగా అగ్రరాజ్యంలోని వైద్యుల పరిశీలనలో వెల్లడైంది. తద్వారా రెమిడిసివిర్ ఔషధాన్ని తీసుకున్న రోగి గుండె వేగం బాగా నెమ్మదిస్తున్నట్టు వైద్యులు గుర్తించారు. అమెరికాలోని రీజినల్ మెడికల్ సెంటర్ బేయోనెట్ పాయింట్లో చేరిన మహిళకు కరోనా సోకినట్టు నిర్ధారించిన వైద్యులు రెమ్‌డెసివిర్‌తో చికిత్స ప్రారంభించారు. ఈ ఔషధం ఇచ్చిన 24 గంటల తర్వాత ఆమె రక్తపోటు పడిపోవడం, గుండె వేగం సగానికి పడిపోయాయని గుర్తించారు.

గుండె వేగం నిమిషానికి 38 సార్లే కొట్టుకుంటున్నట్టు గుర్తించిన వైద్యులు బిపి కూడా సగానికి పడిపోయినట్లు గుర్తించారు. అయితే సదరు రోగి గతంలో ఏమైనా హృధయ సంబంధిత సమస్యలతో బాధపడిందా.? అని పరిశీలించగా ఆమెకు ఎలాంటి హృదయ సంబంధిత సమస్యలు లేవని తేలింది. గుండె జబ్బులు లేకపోయినా గుండె వేగం నెమ్మదించడంతో వైద్యులను ఆశ్చర్యానికి గురిచేసింది. రెమిడెసివిర్ ఇవ్వడానికి ముందు చేసిన ఈసీజీ పరీక్షలు కూడా అమె గుండె పరిస్థితి సాధారణంగా ఉందని స్పష్టం చేయడంతో వైద్యులు ఎందుకిలా జరిగిందని పరిశీలించారు.

ఇది రెమిడెసివిర్ సైడ్ ఎఫెక్ట్ అని తేల్చిన వైద్యులు రోగికి వెంటనే డోపమైన్ ఇవ్వడంతో గుండె వేగం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంది. రెమిడెసివిర్ చివరి మోతాదు ఇచ్చిన 18 గంటల తర్వాత డోపమైన్ ఇవ్వడాన్ని ఆపేశారు. దీంతో ఆమె కోలుకున్నారు. గుండె పనితీరు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంది. కాబట్టి రెమిడెసివిర్ ఇచ్చే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, గుండె పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని వైద్యులు పేర్కొన్నారు. గుండె కొట్టుకునే వేగంలో మార్పులు కనుక వస్తే వెంటనే అందుకు అవసరమైన చికిత్స అందించాలని సూచించారు. రోగికి అప్పటికే గుండెకు సంబంధించిన సమస్యలేమైనా ఉంటే మరింత అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ మేరకు హార్ట్ రిథమ్ సొసైటీ పత్రికలో ఇందుకు సంబంధించిన వివరాలు ప్రచురితమయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Remdesivir  bradycardia  low heart rate  dopamine  USF Morsani Medical College  hemodynamics  Hudson  Florida  USA  

Other Articles