woman labourer finds diamond turns lakhpati overnight మహిళా కూలీ అదృష్టం: పోలం చదను చేస్తుండగా లభించిన వజ్రం

Kurnool thuggali woman labourer finds diamond turns lakhpati overnight

Diamond in Agriculture land, Agriculture woman labourer turns lakhpati, woman labourer diamond, land tilling diamond woman laborer, Diamond, Farmer, Agriculture land, Jonnagiri woman, agriculture labour, Lakpati, Thuggali woman labour, Kurnool, Andhra Pradesh

A woman farmer in Jonnagiri in Thuggali mandal has reportedly found a diamond in his agriculture land while tilling the land for farming. She also sold the diamond to a local perosn for Rs 6.5 lakhs. She found the diamond weighing about 4 carats while tilling land.

మహిళా కూలీని వరించిన అదృష్టం.. పోలం చదను చేస్తుండగా లభించిన వజ్రం

Posted: 06/28/2021 01:17 PM IST
Kurnool thuggali woman labourer finds diamond turns lakhpati overnight

 కష్టాలు పడుతున్నవారు రోజు రాత్రి పడుకునే సమయంలో దేవుడిని తమ కష్టాలు తీర్చమని.. లేదా కష్టాలను తీర్చే మార్గాన్ని చూపమని అర్థించడం సహజం. అందరి భక్తుల మొరలను ఆలకించిన భగవంతుడు.. ఒక్కోక్కరికి ఒక్కో సమయంలో కష్టాల కడలి నుంచి గట్టేకిస్తుంటాడు. అది కూడా వారి పూర్వజన్మసుకృతం ఆధారంగా చేస్తుంటాడని ఆధ్యాత్మికవేత్తలు చెబుతుంటారు. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా తుగ్గలి మండల పరిధిలోని జొన్నగరి గ్రామానికి చెందిన మహిళా కూలి కష్టాలను కూడా విన్న భగవంతుడు ఆమె కష్టాలను తీర్చే మార్గాన్ని చూపాడు.

ఔనా నిజంగానా.. అంటే అంతేనని చెప్పాలి. మామాలుగా రాత్రికి రాత్రి ఓ వ్యవసాయ కూలి కుటుంబం లక్షాధికారకుటుంబంగా మారిపోయింది. దేవుడికి మొక్కుకుని ఇంట్లోంచి గ్రామంలోని తెలిసినవారి పోలాన్ని చదును చేసేందుకు కూలికి బయలుదేరిన ఆ మహిళా కూలికి అదృష్టం వరించింది. అమె కష్టాలు ఒక్క ఉదుటున తీరిపోయాయి. ఉదయం కూలిపనులకు వెళ్లిన ఆమె రాత్రికి లక్షాధికారిగా మారిపోయింద. అంతేకాదు అమె మెడలోకి రెండు తులాల బంగారు ఆభరణాలు కూడా వచ్చి చేరాయి. అమె ముఖంతో సంతోషం.. ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసాయి.

అదెలా అంటారా.? నుదిట రాత రాసే భగవంతుడు తాను తలచుకుంటే ఏమైనా చేయగలడన్న ఆధ్యాత్మికులు చేప్పేమాటలు నూటకినూరు పాళ్లు నిజమని చెప్పేందుకు ఈ ఘటనే ఉదాహరణ. పొలం పనులకు వెళ్లిన ఓ మహిళా కూలీకి వజ్రం లభ్యమైంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి గ్రామానికి చెందిన ఓ మహిళ శనివారం పొలంలో కూలి పనులకు వెళ్లింది. అక్కడ పనులు చేస్తుండగా వజ్రం లభ్యమైనట్లు సమాచారం. నాలుగున్నర క్యారెట్లు ఉన్న ఆ వజ్రాన్ని అదే గ్రామానికి చెందిన ఓ వ్యాపారి రూ.6.50 లక్షలు, 2 తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ ప్రాంతంలో ఏటా తొలకరి వర్షాలకు వజ్రాలు లభ్యమవడం సహజం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles