It is the right time for an electric-bike with subsidy ఫేమ్-2తో చౌకగా మారిన ఎలక్ట్రిక్ వాహనాలు

Electric two wheelers to become cheaper in india with key fame ii subsidy revisions

Ather 450X, ather energy, e scooter subsidy, Electric bike, Electric scooter, Electric Scooters, electric scooters in india 2021, Fame 2 scheme, fame 2 subsidy, fame 2 subsidy amount, fame 2 subsidy list, fame 2 subsidy motorcycle, fame 2 subsidy scooter, FAME II, FAME II guidelines, fame ii news, fame ii subsidy, fame-india scheme

Department of Heavy Industry (DHI) has made vital revisions to the Faster Adoption and Manufacturing of (Hybrid) and Electric Vehicles II (FAME II) scheme that will lower prices of electric scooters and motorcycles in the country and convince more riders to make the switch from a combustion-engined model to an electric one.

కేంద్రం ప్రోత్సాహకం: ఫేమ్-2తో చౌకగా మారిన ఎలక్ట్రిక్ వాహనాలు

Posted: 06/19/2021 01:47 PM IST
Electric two wheelers to become cheaper in india with key fame ii subsidy revisions

ఇంధన ధరలు ఇన్ని రోజులు ఒకలా.. ఇకపై ఒకలా అంటూ 2020 నుంచి పైపైకి ఎగబాకుతున్నాయి. ఈ క్రమంలో ఇంధన దరల ఎగబాకుతున్న క్రమంలో ప్రత్యామ్నాయంపై అలోచనలు చేస్తున్న కేంద్రం.. పర్యవరణంతో పాటు ఇంధన ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే ఏకంగా వంద రూపాయలు దాటిన పెట్రోల్ ధరతో వాహనాలు తీయాంటేనే సామాన్యులు జంకుతున్నారు. దీంతో సామాన్య ప్రజలు ప్రత్యామ్నాయం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో కేంద్రం సామాన్యులకు ఎలక్ట్రిక్ వాహనాల దిశగా వెళ్లేందుకు ప్రోత్సహం కల్పిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలతో ఎలక్ట్రిక్ వాహనాద ధరలు భారీగా తగ్గడం అనుకూలంగా కనిపిస్తుంది. దీంతో సామాన్య ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లిందుకు మొగ్గు చూపుతున్నారు. మరీ ముఖ్యంగా ఒక్క ఫుల్ చార్జితో ఏకంగా 100 కిలోమీటర్ల దూరం నడిచేలా నూతన ఎలక్ట్రిక్ వాహనాలు కూడా అవిష్కృతం కావడం సామాన్యులను ఆ దిశగా ఆకర్షిస్తోంది. దీంతో కేంద్రం చేపట్టిన చర్యలు ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై ప్రభావితం చూపడంతో ఇప్పుడు భారీగా తగ్గి ప్రజలను ఆకర్షిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫేమ్-2 (ఫాస్ట్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్షరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్)-II ప్రాజెక్టులో భాగంగా ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు ఇచ్చే ప్రోత్సాహకాలలో ఇటీవల సవరణలు చేసింది.

ఈ నిర్ణయంతో దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఫేమ్ ప్రాజెక్టులో భాగంగా పలు సంస్థలకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల ధరలు గణనీయంగా తగ్గాయి. ఒక్కో వాహనంపై ఎనమిది వేల నుంచి పదిహేను వేల వరకు ధరలు తగ్గాయి. వాటిలో ప్రముఖ ద్విచక్ర వాహనాల సంస్థ హీరో ప్రముఖంగా కనిపిస్తుంది. హీరో ఎలక్ట్రిక్ అందిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు ఏకంగా రూ15,600 వరకూ తగ్గాయి. కస్టమర్ ఎంచుకునే మోడల్‌ను బట్టి ఈ సబ్సిడీ మారుతుంది. హీరో కంపెనీలో పాపులర్ ఎలక్టిక్ స్కూటర్ ఆప్టిమా హెచ్‌ఎక్స్ డ్యూయల్ బ్యాటరీ వేరియంట్ ధర రూ.15,680 తగ్గి, రూ.58,990గా ఉండగా అలాగే సింగిల్ బ్యాటరీ వేరియంట్ ధర రూ.8,040 తగ్గి, రూ.53,600 గా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : e scooter  subsidy  Electric bike  Electric scooter  Fame 2 scheme  fame 2 subsidy  fame-india scheme  

Other Articles