Reinstate Ashok Gajapathi Raju As Mansas Trust Chairman: HC మన్సాన్ ట్రస్టు చైర్మన్ ఎంపికపై హైకోర్టు సంచలన తీర్పు

Andhra hc cancels appointment of sanchaita gajapathi as mansas trust chairperson

Varahalakshmi Narasimha temple, Maharaja Alak Narayana Society of Arts and Science (MANSAS) trust, YS Jagan Mohan Reddy, GO 74, Sanchaita Gajapathi, Mansas trust chairperson, Simhachalam Temple Board, Mansas Trust, TDP senior leader Pusapati Ashok Ganapathi Raju, AP State government, Vizianagaram, Ashok Gajapathi Raju, family, royal, battle, Sanchita, Gajapathi, trust, TDP, YSRCP, BJP, AP High court, Andhra Pradesh, POlitics, crime

The Andhra Pradesh High Court on Monday cancelled the appointment of Sanchaita Gajapati as the chairperson of the MANSAS trust. The development comes as a setback to the Andhra government led by YS Jagan Mohan Reddy, as in March 2020, CM Jagan issued Government Order (GO) 74, and appointed Sanchaita Gajapathi, in the place of her uncle Ashok Gajapathi Raju, a TDP leader and chairman of the trust.

ఏపీ ప్రభుత్వానికి షాక్.. మన్సాన్ ట్రస్టు చైర్మన్ ఎంపికపై హైకోర్టు సంచలన తీర్పు

Posted: 06/14/2021 04:35 PM IST
Andhra hc cancels appointment of sanchaita gajapathi as mansas trust chairperson

రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది. మాజీ కేంద్రమంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు అశోక్ గజపతి రాజు రిట్ పిటిషన్లపై విచారణించిన న్యాయస్థానం ఇవాళ తీర్పును వెలువరిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన మాన్సాన్ ట్రస్ట్ చైర్మన్ నియామక జీవోను హైకోర్టు కొట్టివేసింది. ఏపీ ప్రభుత్వం చట్టవిరుద్దంగా మన్సాస్ ట్రస్ట్, సింహాచల దేవాలయాలకు చైర్మన్ గా వున్న తనను తొలగించిందని పేర్కోంటూ అశోక్ గజపతిరాజు వేసిన పిటీషన్లను విచారణ సందర్భంగా ఇరు పక్షాల తరపు వాదనలను విన్న న్యాయస్థానం తీర్పును వెలువరించింది.

అశోక గజపతి రాజును ట్రస్ట్ చైర్మన్ గా పునరుద్దరించాలని ఆదేశాల్లో పేర్కొంది. ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో అశోక్ గజపతిరాజు పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం జారీ చేసిన సంచయిత గజపతిరాజు నియామక జీవో 72ను రద్దు చేసింది. వారహలక్ష్మీ నరసింహ దేవస్థానానికి, మానస ట్రస్ట్‌కు ఆయనే చైర్మన్ గా ఉండేలా కోర్టు ఆదేశాల్లో పేర్కొంది. గతంలో మాన్సాస్ ట్రస్టీ, వారహలక్ష్మీ నరసింహ దేవస్థానం చైర్మన్‌గా ఉన్న అశోక్ గజపతి రాజును ప్రభుత్వం తొలగించింది. ఆ స్థానంలో సంచయితను నియమిస్తూ 72 జీవోను ప్రభుత్వం విడుదల చేసింది.

హైకోర్టు ఆదేశాలతో మాన్సాస్  ట్రస్ట్, సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికీ తిరిగి చైర్మన్‌గా అశోక్ గజపతి రాజు బాధ్యతలు స్వీకరించనున్నారు. మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్‌గా సంచయిత నియామకం చెల్లదని సింగిల్ బెంచ్ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే మాన్సాస్ ట్రస్ట్ కేసులో హైకోర్టు తీర్పును ఆంధ్రప్రదేశ్ సర్కార్ సవాల్ చేయనుంది. సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ లో ప్రభుత్వం సవాల్ చేయనున్నట్లు సమాచారం. అయితే అప్పటి వరకు మాన్సాస్ ట్రస్ట్, సింహాచల ఆలయ చైర్మన్ గా ఆశోకగజపతి రాజు కోనసాగనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vizianagaram  Ashok Gajapathi Raju  family  royal  battle  Sanchita  Gajapathi  trust  TDP  YSRCP  BJP  AP High court  Andhra Pradesh  POlitics  crime  

Other Articles