Anandaiah's Ayurveda medicine named Aushadha chakra ఆనందయ్య మందు పేరు ‘‘ఔషధచక్ర’’.. తయారీకి చకచకా ఏర్పాట్లు

Anandaiah s ayurveda medicine named aushadha chakra preparation are on

Anandaiah, ayurvedic corona medicine, Krishnapatnam medicine, kakani govardhan reddy, herbal medicine, anandaiah medicine, COVID 19, Coronavirus, Pandemic, Lockdown, corona vaccine, vaccination, vaccines, oxygen, herbal medicine, eye drops, B. Anandaiah, Andhra Pradesh, politics

The SPS Nellore district Ayurvedic practitioner B Anandaiah traditional medicine is named as Aushadha Chakra and preparations are on in large scale, touted as a miracle cure particularly for Covid-19 patients, after the Andhra Pradesh government and High Court gave nod.

ఆనందయ్య మందు పేరు ‘‘ఔషధచక్ర’’.. తయారీకి చకచకా ఏర్పాట్లు

Posted: 06/04/2021 02:35 PM IST
Anandaiah s ayurveda medicine named aushadha chakra preparation are on

తన అయుర్వేద ఔషదంతో కరోనా బాధితులకు నిమిషాల వ్యవధిలో ఉపశమనం కల్పిస్తూ పేదల నుంచి పెద్దల వరకు క‌రోనా రోగుల‌ పాలిట ఆరాద్యుడిగా మారిన నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య తన ఔషధానికి నామకరణం కూడా చేశారు. కరోనా బాధితులకు అందిస్తున్న మందుకు ఔషధ చక్ర అని పేరు పెట్టారు. గత పది రోజులుగా ఆయన ఔషధానికి శాస్త్రీయపరంగా నిరూపితం కావాలని పరీక్షలు చేసిన నిర్థారించిన పిమ్మట ఆయుష్ సంస్థ ఎలాంటి అభ్యంతరాలను వ్యక్తం చేయకపోవడంతో ఆంధ్రప్రదేశ్ స‌ర్కారు అనుమ‌తులు ఇచ్చిన విష‌యం తెలిసిందే. అటు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన రోజునే ఇటు హైకోర్టు కూడా ఔషధ పంఫిణీకి పచ్చజెండా ఊపింది.

కాగా ప్రభుత్వం అనుమతి లభించిన పక్షంలో మందును భారీ మొత్తంలో తయారు చేసేందుకు ఆనందయ్య ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మందును కేవలం ఆన్ లైన్ ద్వారా మాత్రమే పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యతో పాటు ఎమ్మెల్యే కకాని గోవర్థన్ రెడ్డి తో కలసి సమావేశం ఏర్పాటు చేసి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆనందయ్య మందు కోసం కృష్ణపట్నం ఎవరూ రాకూడదని, ఏ రాష్ట్రం నుంచి ఎవరు కోరుకున్నా వారికి ఆన్ లౌన్ ద్వారా, యాప్ ద్వారా, పోస్టల్, కోరియర్ సర్వీసుల ద్వారా ఔషధ చక్రను పంఫిణీ చేస్తామని చెప్పారు. ప్రస్తుతం కృష్ణపట్నంలో కరోనా కేసులు అధికంగా వున్నందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

ఇక పెద్దమొత్తంలో తయారు చేస్తున్న మందుకు కృష్ణ‌ప‌ట్నం పోర్టు వ‌ద్ద ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్ప‌టికే త‌యారీకి అవ‌స‌ర‌మైన సామ‌గ్రిని కృష్ణ‌ప‌ట్నం పోర్టుకు త‌ర‌లించే ప‌నులు మొద‌లు పెట్టారు. ప్ర‌స్తుతం కృష్ణపట్నం పోర్టుకు చెందిన సీవీఆర్‌ కాంప్లెక్స్‌లో మూలిక‌లు, దినుసులు సిద్ధం చేసుకోవడంలో ఆనందయ్య బృందం బిజీగా ఉంది. వీటి సేకరణ పూర్తయిన తర్వాత రెండురోజుల్లో మందు తయారీ ప్రారంభమవుతుంది. ఎమ్మెల్యే కాకాని గోవర్ధనరెడ్డి సూచన మేరకు మొదట సర్వేపల్లి నియోజకవర్గంలో లక్షమందికి కరోనా రానివారు వాడే మందును అందజేయాలని ఆనంద‌య్య బృందం నిర్ణ‌యించింది. అనంత‌రం కరోనా రోగులకు అవసరమైన ‘పి, ఎల్, ఎఫ్‌’ రకాల మందు పంపిణీ చేస్తారు. ఆ త‌ర్వాతే ఇతర నియోజకవర్గాలకు పంపిణీ చేయ‌నున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles