Andhra clears Anandaiah’s herbal medicine ఆనందయ్య ఆయుర్వేద ఔషధానికి గ్రీన్ సిగ్నల్..!

Andhra pradesh government allows use of anandaiah s ayurveda medicine to treat covid patients

Anandaiah, ayurvedic corona medicine, Krishnapatnam medicine, nellore corona medicine, herbal medicine, anandaiah medicine, COVID 19, Coronavirus, Pandemic, Lockdown, corona vaccine, vaccination, vaccines, oxygen, herbal medicine, eye drops, B. Anandaiah, Andhra Pradesh, politics

The Andhra Pradesh government on Monday gave the green signal for the use of the traditional medicine, touted as a miracle cure particularly for Covid-19 patients, being prepared by an Ayurvedic practitioner B Anandaiah in Krishnapatnam village in SPS Nellore district.

ఆనందయ్య ఆయుర్వేద ఔషధానికి గ్రీన్ సిగ్నల్.. త్వరలో పంఫిణీ షురూ..!

Posted: 05/31/2021 03:36 PM IST
Andhra pradesh government allows use of anandaiah s ayurveda medicine to treat covid patients

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య ఔషదానికి ఎట్టకేలకు అనుమతి లభించింది. గతంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఆనందయ్య ఔషదానికి అనుమతి మంజూరు చేసినప్పటికీ ఆయుష్ సంస్థ పరిశోధనల అనంతరం అనుమతినిస్తామని గత వారం పది రోజులగా ఆనందయ్య ఔషదం విషయంలో హైడ్రామాను కొనసాగించింది. ఈ క్రమంలో ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యను కూడా అదుపులోకి తీసుకుని పలు రహస్య ప్రాంతాల్లో ఆయనకు భద్రతను కల్పించిన ప్రభుత్వం ఎట్టకేలకు ఆయన ఔషదానికి అనుమతినిస్తూ నిర్ణయం తీసుకుంది.

కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆనందయ్య మందు ఎంతోమందిలో ఆశలు కల్పించిందని, ఎంతో మంది దీని బారిన పడి పైసా ఖర్చు లేకుండా నయం అవుతున్నామని చెప్పారు. ఇటీవల ఆనందయ్యను అదుపులోకి తీసుకున్న తరువాత కూడా తెలంగాణలోని పెద్దపల్లికి చెందిన ఓ కరోనా బాధితుడు అపసోపాలు పడుతూ కృష్ణపట్నం చేరుకున్న తరువాత ఊఫిరి తీసుకోవడం కష్టమై అక్కడే పడిపోయాడు. దీంతో స్థానికులు తమ వద్ద భద్రపర్చుకున్న కంటిచుక్కల మందును ఆయన కళ్లలో వేశారు. దీంతో సరిగ్గా పదిహేను నిమిషాలు అయిన తరువాత సదరు బాధితుడు లేచి తనకు ఆనందయ్య మందు పనిచేసిందని చెప్పడం.. ఆ వీడియో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కావడం కూడా తెలిసిందే.

కరోనా పాజిటివ్ వచ్చిన తన సోదరుడ్ని విరించి అసుపత్రిలో చేర్చిన ఆయన సోదరి స్వతహాగా వైద్యురాలు కూడా ఆనందయ్య మందు పనిచేస్తుందని, దానిని వేసిన వెంటనే తన సోదరుడికి పల్స్ రేట్ ఒక్కసారిగా 93కు చేరుకుందని చెప్పారు. ఈ వీడియో కూడా నెట్టింట్లో సంచలనంగా మారడంతో ఆనందయ్య ఔషదానికి గ్రీన్ సిగ్నల్ ఇవాల్సిన అసవరం ఏపీ ప్రభుత్వానికి ఏర్పడింది. అయితే శాస్త్రీయ అధ్యయనం పేరుతో కొన్నిరోజుల పాటు పంఫిణీని నిలిపివేసిన ప్రభుత్వం... తిరిగి ఔషధ పంపణీకి అనుమతి మంజూరు చేసింది. సీసీఏఆర్ఎస్ (జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ) కమిటీ ఇచ్చిన నివేదికను పూర్తిగా పరిశీలించిన ప్రభుత్వం ఆనందయ్య మందు పంపిణీకి అభ్యంతరం లేదని తేల్చి చెప్పింది.

అయితే, ఆనందయ్య కుటుంబీకులు కంట్లో వేస్తున్న మందుకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. దీనిపై కమిటీ నుంచి నివేదిక రావాల్సి ఉందని, నివేదిక పరిశీలన అనంతరం నిర్ణయం తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. దీనికి మరికొంత సమయం పడుతుందని వెల్లడించింది. కాగా, సీసీఏఆర్ఎస్ నివేదికలో ఆసక్తికర అంశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఆనందయ్య మందు వాడితే కరోనా తగ్గుతుందని చెప్పలేమని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ మందు వాడుతున్నంత మాత్రాన ఇతర మందులు ఆపొద్దని ప్రభుత్వం పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles