Ramdev again questions Covid-19 vaccines అలోపతి వైద్యులపై మరోమారు బాబా రాందేవ్ విమర్శలు

Ramdev again questions covid 19 vaccines says he s protected by yoga ayurveda

Baba Ramdev, coronavirus, corona vaccine, Patanjali, Coronil, Indian Medical Association, IMA, Ayurveda, resident doctors associations, ramdev vs IMA, allopathy, allopathy medicine, Baba Ramdev's remarks, nationwide protest

Yoga guru Swami Ramdev has again questioned the efficacy of Covid-19 vaccines while claiming that the fatalities caused by Covid-19 showed that allopathy was not 100% effective. He also alleged the presence of a campaign against ancient Indian science of Ayurveda.

అలోపతి వైద్యులపై కొనసాగుతున్న బాబా రాందేవ్ విమర్శల దాడి

Posted: 05/31/2021 09:10 AM IST
Ramdev again questions covid 19 vaccines says he s protected by yoga ayurveda

అల్లోపతి వైద్య విధానంపై తీవ్ర విమర్శలు చేసి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆగ్రహానికి గురైన ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని కబళిస్తూన్న నేపథ్యంలో తమ ప్రాణాలను పణ్ణంగా పెట్టి వైద్యులు బాధితులకు చికిత్స అందిస్తున్నా.. తమపై బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలు భారతీయ వైద్యానికే కళంకలా ఆపాదించేలా వున్నాయని వారు అవేదన వ్యక్తం చేశారు, బాబా రాందేవ్ పై చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఆయనపై రాజద్రోహం కింద కేసులు కూడా నమోదు చేయాలని వైద్యులు ఏకంగా ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాసినా.. వారికి ఎలాంటి స్పందన రాలేదు.

అయితే కేంద్రంలోని పాలక పక్షం నుంచి తనకు మెండుగా సహాయసహకారాలు వున్నాయని చెప్పకనే చెప్పిన బాబా రాందేవ్.. అలోపతి వైద్యులపై ఏమాత్రం వెనక్కి తగ్గని ఆయన వారిపై విమర్శలను కోనసాగిస్తూనే వున్నారు. దీంతో ఉత్తరాఖండ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులు ఆయనపై ఏకంగా వెయ్యి కోట్ల పరువు నష్టం దావా వేశారు. అందేకాదు ఆయన తన వైఖరి మార్చుకునేలా జూన్ 1వ తేదీని ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైద్యులు నిరసనను వ్యక్తం చేయనున్నారు. మరోమారు అలాంటి విమర్శలే చేశారు. అల్లోపతితో పోలుస్తూ కొందరు ఉద్దేశపూర్వకంగా ఆయుర్వేద వైద్యాన్ని తక్కువ చేసి చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరోనా టీకాలు వేసుకున్నప్పటికీ కొందరు మరణిస్తున్నారని, దీనిని బట్టే మనకు అల్లోపతి వైద్యం సమర్థత ఏపాటిదో అర్థం అవుతోందని అన్నారు. ఇంగ్లిష్ వైద్యం 100 శాతం పనిచేయదనడానికి ఇది నిదర్శనమన్నారు. తాను కొన్ని దశాబ్దాలుగా యోగాను అభ్యసిస్తున్నానని, ఆయుర్వేదాన్ని అనుసరిస్తున్నానని పేర్కొన్న బాబా.. తనకు టీకాలతో పనిలేదన్నారు. ఆయుర్వేద వైద్యాన్ని విదేశీయులు కూడా అనుసరిస్తున్నారని గుర్తు చేశారు. భవిష్యత్తులో ఆయుర్వేద వైద్యానికి ప్రపంచవ్యాప్తంగా ఆమోదం లభిస్తుందని రాందేవ్ బాబా స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles