Negative Report Must For Wedding Guests ఇకపై అతిథులకు కూడా నెగిటివ్ రిపోర్టు ఉండాల్సిందే

Govt issues new covid 19 guidelines for weddings negative report must for guests

Governance, covid-19 test, antigen test, wedding guests, covid-19 protocol, Coronavirus, COVID-19, guidelines, covid-19 patients, covid19 vaccine, Covaxin telangana news, Covaxin second dose, Covaxin doses time gap, corona vaccine, covishield, Telangana vaccination drive, Telangana vaccines, Covaxin

The Government made it mandatory for people attending wedding functions, including brides and bridegrooms, to get tested for the novel coronavirus disease (COVID-19) prior to the ceremony. The local tehsildar and the sub-magistrate will raid wedding venues regularly to ensure the guideline is being followed.

పెళ్లిళ్లకు కొత్త మార్గదర్శకాలు: ఇకపై అతిథులకు కూడా నెగిటివ్ రిపోర్టు ఉండాల్సిందే

Posted: 05/19/2021 12:02 PM IST
Govt issues new covid 19 guidelines for weddings negative report must for guests

కరోనా వైరస్ మహమ్మారి రెండో దశలో విలయాన్ని సృష్టిస్తోన్న తరుణంలో దానిని నియంత్రించేందుకు ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. ఇక పెళ్లిళ్లు కుదుర్చుకున్న యువతీ యువకులు తల్లిదండ్రులతో పాటు వధువరులు, ఈ వేడుకకు హాజరయ్యే వధూవరులు కూడా తప్పకుండా కరోనా టెస్టు చేసుకోవాలని ప్రభుత్వం తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇటీవల పెళ్లి వేడుకకు హాజరైన బంధువులలో ఇద్దరు వ్యక్తులు కరోనా సోకి మృత్యువాత పడిన నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను జారీచేసింది. దీంతో తాజా అంక్షల మధ్య కళ్యాణాలు జరగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

అయితే ఈ తరహా అదేశాలను జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వమా.? లేక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమా.? అంటే ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కాదు. కానీ ఈ రాష్ట్రాలు కూడా అదే తరహాలో త్వరలో అంక్షలను అమలు చేసే పరిస్థితులు నెలకోన్నాయి. ఒడిశా ప్రభుత్వం ఈ తరహా అదేశాలను జారీ చేసిన నేపథ్యంలో అదే బాటలో పయనించేందుకు దాదాపుగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సిద్దంగా వున్నాయి. తాజాగా ఈ తరహా మార్గదర్శకాలను ఉత్తరాఖండ్ ప్రభుత్వం విడుదల చేసింది. పెళ్లిళ్లకు హాజరయ్యే బంధుజన వర్గ సంఖ్యను 20కి పరిమితం చేసిన ప్రభుత్వం.. వారందరూ తప్పనిసరిగా మూడు రోజుల వ్యవదిలోపు కరోనా పరీక్షలు చేయించుకుని వుండాలని అదేశించింది.

అయితే కరోనా పరీక్షల్లో నెగిటివ్ రిపోర్టు వచ్చిన బందుజనులు మాత్రమే పెళ్లికి హాజరుకావాలని అదేశించింది. ఈ నివేదికను ఎవరికి వారు పెళ్లి వేడుకుకు హాజరయ్యే సమయం నుంచి తిరిగి ఇంటికి చేరకునే వరకు తమతోనే తీసుకెళ్లాలని అదేశించింది. ఇక పెళ్లి వేడుకలకు తహసీల్దార్ సహా రెవెన్యూ సిబ్బంది వచ్చి తనిఖీలు చేస్తారని.. వారు వచ్చిన సమయంలో తప్పనిసరిగా కోవిడ్ నెగిటవ్ నివేదికను బందువులు చూపించాలని అదేశించారు. అంత్యక్రియలకు కూడా 20మందికి మించి పాల్గొన రాదని, వారందరూ కర్ఫ్యూ పాస్ ను పొందాలని సర్కారు సూచించింది. కర్ఫ్యూ సమయంలో ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యావసర సరుకులు కొనేందుకు సర్కారు అనుమతినిచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles