Monthly pension for orphans: Delhi CM కరోనాతో తల్లిదండ్రులను పోగొట్టుకున్న చిన్నారులకు పెన్షన్

Delhi cm kejriwal announces rs 50000 ex gratia for families with a covid death

delhi pension, delhi government pension, delhi government news, arvind kejriwal pension, covid pension, delhi covid pension, delhi ration, delhi free ration, delhi ration news, delhi, Arvind Kejriwal, free education, delhi rs 50000 ex gratia, delhi government, delhi covid, delhi covid cases, Arvind Kejriwal news, Delhi lockdown, covid in Delhi

Delhi Chief Minister Arvind Kejriwal said that children who lost their parents due to COVID-19 will get Rs 2,500 per month per child till they turn 25. He also said that the Delhi government will bear the expenses for the education of those children. CM also announced several welfare measures for poverty and disaster-hit families.

కోవిడ్ బాదిత కుటుంబాలకు రూ.50వేల నష్టపరిహారం.. అనాదలకు రూ.2500 పెన్షన్

Posted: 05/18/2021 11:54 PM IST
Delhi cm kejriwal announces rs 50000 ex gratia for families with a covid death

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మధ్యప్రదేశ్ ప్రభుత్వాల బాటలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా పయనిస్తున్నారు. కరోనా మహమ్మారి బారిన పడి తల్లిదండ్రులను కోల్పోయి అనాధలైన పిల్లల పేరున పది లక్షల రూపాయలను వారి పేరున పిక్సడ్ డిపాజిట్ చేయనున్నట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్ వెల్లడించిన విషయం తెలిసిందే. అదే తరహాలో రాజస్థాన్ ప్రభుత్వం కూడా అనాదలైన పిల్లలకు ఒక్కోక్కరికి రూ. 5 వేల రూపాయల పెన్షన్ ఇవ్వనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు, ఇక ఇదే భాటలో పయనించిన ఢిల్లీ సీఎం అరవింగ్ కేజ్రీవాల్ కూడా తాజాగా పలు ప్రకటనలు చేశారు.

కోవిడ్ వల్ల బాధపడిన కుటుంబాలకు అండగా నిలిచేందుకు కీలక నిర్ణయం తీసుకున్న అరవింద్ కేజ్రీవాల్.. కరోనాతో కుటుంబసభ్యులను కోల్పోయిన కుటుంబాలకు రూ.50వేల ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా ఇంట్లో సంపాదించే వ్యక్తి కరోనాతో మరణిస్తే ఆ కుటుంబానికి అదనంగా నెలకు రూ.2500 పింఛను ఇవ్వనున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. భర్త చనిపోతే..భార్యకు పెన్షన్, భార్య చనిపోతే భర్తకు పెన్షన్, పెళ్లి కాని వ్యక్తులు చనిపోతే వారి కుటుంబసభ్యులకు ఆ పెన్షన్ అందించనున్నట్లు కేజ్రీవాల్ ఓ ప్రకటనలో తలిపారు.

అదేవిధంగా, కొవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులను ఆదుకునేందుకు కూడా ఢిల్లీ ప్రభుత్వం ముందుంటుందని చెప్పారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను లేదా సింగిల్ పేరెంట్ పిల్లలు తమ కుటుంబపెద్దను కోల్పోయిన పక్షంలో అనాధలైన పిల్లలకు ఒక్కోక్కరికి రూ. 2500 చోప్పున పెన్షన్ అందిస్తామని తెలిపారు. అంతేకాదు పిల్లలకు 25 సంవత్సరాలు వచ్చే వరకు వారికి చదువులకు అయ్యే ఖర్చును పూర్తిగా ఢిల్లీ ప్రభుత్వం భరిస్తుందని కేజ్రీవాల్ తెలిపారు. ఇక, ఢిల్లీలోని 72 లక్షల మంది నిరుపేదలకు.. నెలకు 10 కిలోల ఆహార పదార్థాలు ఉచితంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. రేషన్ కార్డు లేని పేదలకూ ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. కేబినెట్ ఆమోదం పొందిన వెంటనే సంక్షేమ పథకాలు అమలు చేయనున్నట్లు తెలిపారు.

కాగా, కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోతున్నారని.. వారందరూ అనాథలని బాధపడాల్సిన అవసరం లేదని.. మీకు నేనున్నాను అని అన్నారు. అనాథలైన పిల్లల చదువులు, భవిష్యత్తును ప్రభుత్వమే చూసుకుంటుందని అన్నారు. చేతికందిన పిల్లలను కోల్పోయిన వృద్ధ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఇన్నాళ్లూ వారు పిల్లలపైనే ఆధారపడ్డారు. అలాంటి వారికి పెద్ద కొడుకుగా తాను ఆదుకుంటానని అన్నాడు. అలాంటి కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలుస్తుంది. ఈ వయసులో ఆ పెద్దవాళ్లకు ఆర్థిక అండతో పాటు ఆదరణ, అభిమానం కూడా కావాలి అని కేజ్రీవాల్ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arvind Kejriwal  Orphans  free education  Pension  rs 2500  ex gratia  covid effected families  delhi  politics  

Other Articles