Narada Case: 4 TMC ministers get interim bail నారదా కుంభకోణం కేసులో అరెస్టైన టీఎంసీ నేతలకు బెయిల్.!

Narada case court grants bail to 4 accused including 3 tmc leaders

TMC, Mamata Banerjee, firhad hakim, narada sting case, narada case, West Bengal, BJP, Narada Scam, Narada case updates, Narada Scam virtual hearing, Mamata Banerjee, CM of Bengal, Firhad Hakim arrest, Madan Mitra arrested, Sovan Chatterjee arrest, Narada case, Narada case in Bengal

The Bankshall Court has granted bail to West Bengal ministers Subrata Mukherjee and Firhad Hakim, TMC MLA Madan Mitra, and former Kolkata mayor Sovan Chatterjee after CBI arrested the four in connection with the 2016 Narada sting operation case.

నారదా కుంభకోణం కేసులో అరెస్టైన టీఎంసీ నేతలకు బెయిల్.!

Posted: 05/17/2021 11:41 PM IST
Narada case court grants bail to 4 accused including 3 tmc leaders

నారదా కుంభకోణం కేసులో సీబీఐ అరెస్టు చేసిన ఇద్దరు మంత్రులతో పాటు ఓ ఎమ్మెల్యే. మరో మాజీ మంత్రికి సీబిఐ ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. నారద స్టింగ్ అపరేషన్ లో చిక్కుకున్న ఇద్దరు మంత్రులు ఫిర్హాద్ హకీం, సుబ్రతా ముఖర్జీలతో పాటో ఎమ్మెల్యే మదన్ మిత్రా, మాజీ మంత్రి సోవన్ ఛటర్జీలను ఇవాళ సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకుని తమ కార్యాలయానికి తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. సిబిఐ అధికారులు వీరిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టి వారిని తమ కస్టడీకి అప్పగించాలని కోరారు. అయితే సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం మా్త్రం ఈ నలుగురికి బెయిల్ మంజూరు చేసింది.

నారగా కుంబకోణం కేసులో నిమగ్నమయ్యారన్న అభియోగాలపై ఎదుర్కోంటున్న ఈ నలుగురు టీఎంసీ నేతలను అదుపులోకి తీసుకుని విచారించేందుకు రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధనకర్ అనుమతిస్తూ అదేశాలు జారీ చేశారు. దీంతో 2016లో కలకలం రేగిన నారదా కుంభకోణంపై సీబీఐ.. ఈ అరెస్టులతో జోరు పెంచింది. ఈ ఉదయం.. కేంద్ర బలగాలతో బంగాల్‌ రవాణా మంత్రి హకీం నివాసానికి చేరుకున్న సీబీఐ బృందం ఆయనను తమ కార్యాలయానికి తరలించింది. ఆ తర్వాత టీఎంసీ ప్రజాప్రతినిధులను అరెస్టు చేసినట్లు ప్రకటించింది. దీంతో మమత బెనర్జీ క్యాబినెట్ మంత్రులను, సీనియర్ నేతలను సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకుని కొల్ కత్తా లోని వారి కార్యాలయానికి తరలించారు.

దీంతో సీబీఐ కార్యాలయం ఎదుట నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. వారి అరెస్టును నిరసిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కార్యలయం ఎదుటే నిరసన తెలిపారు. అమెకు మద్దతుగా తృణమూల్​ మద్దతుదారులు లాక్ డౌన్‌ ఆంక్షలు పక్కన పెట్టి మరీ రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ తన మంత్రులను కాదు తననూ అరెస్టు చేయాలని సీబీఐ అధికారులకు సవాల్‌ విసిరారు. ఓ పద్దతి లేకుండా తమ మంత్రులను అరెస్టు చేయడంపై ఆమె తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. సిబిఐ కార్యాలయం ఎదుట దాదాపుగా ఆరు గంటల పాటు నిరసన తెలిపిన అమె తరువాత అక్కడి నుంచి వెనుదిరిగారు.

కల్పితంగా సృష్టించిన కంపెనీల ప్రతినిధుల నుంచి కొందరు రాజకీయ నాయకులు లంచం తీసుకుంటున్నారనే అభియోగాలతో సీబీఐ ఈ కేసు నమోదు చేసింది. నారదా టీవీ ఛానెల్ 2014లో చేపట్టిన స్టింగ్ ఆపరేషన్​లో ఈ తతంగం వెలుగులోకి వచ్చింది. కలకత్తా హైకోర్టు ఆదేశాలతో 2017 మార్చిలో దీనిపై దర్యాప్తు ప్రారంభించింది. టీఎంసీకి చెందిన కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇందులో ఉన్నట్లు ఈ ఆపరేషన్ చేపట్టిన మ్యాథ్యూ శ్యామ్యూల్ పేర్కొన్నారు. వీరు డబ్బు తీసుకుంటున్న వీడియో 2016 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బయటకు విడుదలైంది. తాజాగా గవర్నర్ అనుమతులు ఇవ్వడంతో మంత్రులతో పాటు సినియర్ నాయకుల అరెస్టు జరిగింది.

అయితే ఈ కేసులో తాను నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ ఆధారంగా కొందరి అరెస్టులు జరిగడంపై నారద న్యూస్ వ్యవస్థాపకుడు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ మాథ్యూ సామ్యూల్ హర్షం వ్యక్తం చేశారు. కాగా, ఈ కేసులో ఇంకా పెద్దవాళ్లు చాలా మంది వున్నారని, అయితే ఇవాళ జరిగిన అరెస్టులు సముద్రంలో ఓ బొట్టు మాత్రమేనని మాధ్యూ సామ్యూల్ తెలిపారు. ఈ కేసులో ఇటీవలే టీఎంసీ నుంచి బీజేపిలో చేరిన సువేందు అధికారిని ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన ప్రశ్నించారు. 2016లో తన స్టింగ్ ఆపరేషన్ టేపులు విడుదల అయ్యాయని, అయితే అందులో చిక్కకున్న రాజకీయ నాయకులపై మూడేళ్ల క్రితమే చార్జిషీటు దాఖలైనా ఇప్పటివరకు సీబిఐ వారిని ముట్టుకోలేదని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles