Telugu writer KK Ranganathacharyulu dies of Covid-19 ప్రముఖ భాషాసాహితీవేత్త ఆచార్య కెకెఆర్ కరోనాతో మృతి

Telugu writer kk ranganathacharyulu dies of covid 19

KK Ranganathacharyulu, COVID 19, Coronavirus, Corona Second wave, Andhra Saraswatha Parishat College, Telugu Department, Professor, Hyderabad Central University, Dean of the School of Humanities, Viplava Rachayitala Sangham, corona vaccine, corona deaths, Humanities, Telugu literary gaint, Andhra Pradesh, Telangana

Literary giant KK Ranganathacharyulu died of Covid-19 at a private hospital in Hyderabad. He was 80. Popularly known as KKR, he worked as a professor in the Telugu Department at Hyderabad Central University from 1987 to 2003 and was Dean of the School of Humanities.

ప్రముఖ భాషాసాహితీవేత్త ఆచార్య కె కె రంగనాధాచార్యులు కన్నుమూత

Posted: 05/16/2021 10:20 PM IST
Telugu writer kk ranganathacharyulu dies of covid 19

ప్రముఖ చారిత్రక భాషా సాహితీవేత్త ఆచార్య కోయిల్ కందావై రంగనాథాచార్యులు కన్నుమూశారు. ఆయన మరణం సాహితీలోకాన్నివిషాదంలో ముంచింది. తెలుగు సాహీతి లోకానికి తీరని నష్టం కలిగించింది. సహృదయుడూ సామాజిక స్పృహ, ఆచితూచి మాట్లాడే వ్యక్తిత్వం కేకేఆర్ సొంతం. సాంప్రదాయిక కుటుంబ నేపథ్యం నుంచి అనితర సాధ్యమైన తన సొంత వ్యక్తిత్వాన్ని నిర్మించుకున్న మహామనీషి ఆయన. రంగనాధాచార్యులు చిన్ననాటి నుంచి సంప్రదాయాలను, సంప్రదాయ కుటుంబ వాతావరణాన్ని వదిలి, ఆదునిక వాతవరణంలోకి మారాలనేది ఆయన ధృఢమైన కాంక్ష.

ఆచార్య కె కె రంగనాధాచార్యులు వేద పండితుల సంప్రదాయ కుటుంబంలో 1941 జూన్ 14న జన్మించారు. ఆయన బాల్య విద్యాభ్యాసంమంతా సీతారంబాగ్ లోని సంస్కృత విద్యాపీఠంలో వారి చిన్నాన్న శ్రీమాన్ కోయిల్ కందావై శఠగోప రామానుజాచార్యుల వద్ద జరిగింది. ఆయన తండ్రి కోయిల్ కందావై కృష్ణమాచార్యులు ప్రముఖ న్యాయవాధిగా ప్రసిద్దిపోందారు. సంస్కృత విద్యాపీఠంలో రంగనాథాచార్యులు అలంకార శాస్త్రాన్ని ప్రత్యేక అధ్యయనంగా అభ్యసించారు. ఆయన తన భావజాలానికి అనుగూణంగా కులాంతర వివాహం చేసుకుని సంప్రదాయాలన్నింటినీ వదిలి.. కుటుంబం నుంచి బయటకు వచ్చి సంస్కరణవాదిగా మారారు.

ఆయన ఇటు సంస్కృతంలో ఎం.ఏ పూర్తిచేసిన తరువాత.. 1967లో తెలుగులో ఎం.ఏ పూర్తి చేశారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రాచ్చా కళాశాలలో ఉపన్యాసకుడిగా చేరారు. డిగ్రీలోనూ, పీజీలోనూ పెంటాలజీ పాఠాలు చెబుతూ ఆదునిక భాషా శాస్త్రం వైపు తన దృష్టిని మరల్చి.. ఉస్మానియా విశ్వవిద్యాలయం భాషాశాస్త్రంలో ఏం.ఏ పూర్తి చేశారు. భాషాశాస్త్ర గురువు ఆచార్య భద్రిరాజుకృష్ణమూర్తి పర్యవేక్షణలో శాసనభాషా చారిత్రక వ్యాకరణం అనే అంశంపై పరిశోధన చేసి 1978లో పి.హెచ్.డి పట్టా పోందారు. ఆ తరువాత ప్రాచ్చా కళాశాలలో ప్రధానాచార్యులుగా తెలుగు భాషా చరిత్ర, భాషా శాస్త్ర పాఠాలు చెప్పి చాలా మంది విద్యార్థులను ఆధునిక భాషా శాస్త్రంపై అవగాహన కల్పించారు.

Telugu writer KK Ranganathacharyulu

ప్రాచ్చ భాష బోధనలోని సంప్రదాయ వాతావరణాన్ని పూర్తిగా మార్చివేశారు. తెలుగు భాషా సాహిత్య ప్రక్రియలలో ఆధునిక ధోరణిలతో ఆలోచనలు మారుతున్న సమయంలో అధ్యపకులు అంటే భయమున్న రోజులలో విద్యార్థులలో స్పర్థను పెంచి.. అధ్యాపకులు ఆత్మీయతను అందించే విధంగా వాతావరణాన్ని మార్చారు. ఆ తరువాత ఎందరికో పరిశోధన పర్యవేక్షకులుగా ఉండి తెలుగు భాషా సాహిత్యాలకు ఆధునిక ధృక్పధంలో కృషి చేశారు. ముఖ్యంగా ఆధునిక కవిత్వ విమర్శపై వారు రాసిన వ్యాసాలు, ఉపన్యాసాలు పలువురిలో ఆలోచనలు రేకెత్తించే విధంగా వున్నాయి.

ఆచార్య కేకేఆర్ వారి గురువుగారు ఆచార్య భద్రిరాజుకృష్ణమూర్తిగారిపైన అమితమైన భక్తి. అయితే అవసరమైన చోట ఆయనతోనూ విభేధించేవారు. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా, డీన్ గా వ్యవహరించి గురువుల స్థానానికి మంచి పేరు తెచ్చారు. 1987 నుంచి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగం ఫ్రొఫెసర్ గా విధులు నిర్వహించిన ఆయన హ్యుమానిటీస్ స్కూల్ డీన్ గా వ్యవహరించారు. ఈ క్రమంలో 14 మందితో 1970లో ప్రారంభమైన విప్లవ రచయితల సంఘంలో ఒకరిగా వున్న ఆయన విరసంలో దీర్ఘకాలం కోనసాగలేకపోయారు. అయితే విరసం రచయితలతో మాత్రం ఆయన నిత్యం సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. ఇక దిగంబర రచయితులుగా పేరోందిన జ్వాలాముఖి, నిఖిలేశ్వర్ లకు ఆయన ఆప్తమిత్రుడు.

పదవీ విరమణ చేసిన ఎప్పుడూ తన విమర్శనాత్మక దృష్టితో వ్యాసాలు రాయడం.. ముఖ్యంగా నేటి తెలుగుబాషపై పరిశోధించడం ఒక వ్యాపకంగా పెట్టుకున్నారు. ఆయన విద్యాభ్యాసం కాలంలోని చైతన్యం గురించి మిత్రులతో, విద్యార్థులతో చర్చిస్తూ.. ఎన్నో సామాజిక విషయాలను నూతన దృక్పధంలో వివరించేవారు. కేకేఆర్ ఈ రోజున పరమపదించడం విద్యార్థి లోకానికి ఒక తీరని నష్టం. రంగనాథాచార్యుల మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని.. బాషా సాహిత్యమున్నంత వరకు ఆయన చిరంజీవిగా వుంటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles