Modi and Shah should resign: Yashwant Sinha మమతను అవమానించిన బీజేపికి తగిన మూల్యం

Bjp paid in bengal for taunting mamata banerjee yashwant sinha

yeshwant sinha demands PM, Shah resignation, TMC wins bengal Elections, Narendra Modi, Amit Shah, Yashwanth sinha, vice-President, Trinamol congress, yashwant sinha, yashwant, trinamool congress vice, Mamata, bengal, west bengal assembly election results, Mamta Banerjee, BJP, West Bengal, Politics

Former Union finance minister and Trinamool Congress vice-president Yashwant Sinha demanded the resignation of PM Narendra Modi and Amit Shah, saying they should take moral responsibility for BJP's defeat in Bengal and for 'insulting' its chief minister Mamata Banerjee.

ప్రధాని, అమిత్ షాల రాజీనామాకు యశ్వంత్ సిన్హా డిమాండ్

Posted: 05/03/2021 08:16 PM IST
Bjp paid in bengal for taunting mamata banerjee yashwant sinha

ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హో్ం మంత్రి అమిత్ షాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పశ్చిమ బెంగాల్ లో ఘోరంగా ఓటమిపాలయ్యారని అందుకు నైతిక బాధ్యత వహించి తక్షణం వారిద్దరూ తమ పదవులకు రాజీనామా చేయాలని తృణమూల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు యశ్వంత్ సిన్హా ఆ ఇద్దరు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో తామే గెలుస్తామంటూ బీరాలుపోతూ ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలు గొప్పలు చెప్పుకున్నారని, అంతేకాకుండా ప్రజలను కూడా తమ బీరాలతో తప్పుదారి పట్టించారని అన్నారు.

ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి షాతో పాటుగా పార్టీ బెంగాల్ చీఫ్ దిలీప్ ఘోష్, బీజేపి జాతీయ ఉపాధ్యక్షుడు కైలాశ్ విజయ వర్గీయ కూడా రాజీనామా చేయాలని యశ్వంత్ సిన్హా అన్నారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు మమతను అడుగడుగునా అవమానించారని, ఇది బెంగాల్ ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని అన్నారు. బీజేపీ ఓటమికి అదే ముఖ్యకారణమన్నారు. ప్రజలంతా మమతవైపు నిలిచి మోదీ, షాలకు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు వెళ్లిన మమతను నెట్టివేసి అమె కాలికి గాయమయ్యేలా చేసిన బీజేపి నేతలపై చర్యలు తీసుకోవాల్సిన పార్టీ అధిష్టానం వారినే వెనకోసుకోచ్చి మమతను అవమానించారని దుయ్యబట్టారు.

అమె కాలి గాయాన్ని కూడా ఎగతాళి చేస్తూ అవమానించారని, తమ రాష్ట్రానికి చెందిన ఓ మహిళను, అందునా వారి అభిమానించే నాయకురాలిని అవమానిస్తే పశ్చిమ బెంగాల్ ప్రజలు దానిని తమ ఓటుతో బీజేపిని తిప్పికోట్టారని అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు ఇచ్చాన ఈ ఫలితాల ప్రభావం ఉత్తరప్రదేశ్ ఎన్నికలతో పాటు 2024 పార్లమెంట్ ఎన్నికలపైనా ఉంటుందని సిన్హా పేర్కొన్నారు. కాగా, అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో కేంద్రమంత్రిగా పనిచేసిన సిన్హా బీజేపీ పరిస్థితి, భారత ప్రజాస్వామ్యం రెండూ తీవ్ర ప్రమాదంలో ఉన్నాయని ఆరోపిస్తూ 2018లో బీజేపీ నుంచి బయటకు వచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narendra Modi  Amit Shah  Yashwanth sinha  Trinamol congress  Mamta Banerjee  BJP  West Bengal  Politics  

Other Articles