ACB Raid Scare, Tehsildar burns Rs 20 lakh రూ. 20 లక్షలను కల్చిబూడిత చేసిన తహసీల్దార్

Tehsildar burns currency notes worth rs 20 lakh due to this reason

Anti-Corruption Bureau (ACB), ACB Officials, Tehsildar, Kalpesh Kumar Jain, Revenue Inspector, Parvath singh, currency notes, burn, bribe cash, Bribery case, Sirohi district, Rajasthan, Crime

In a bizarre incident, a Tehsildar in Rajasthan's Sirohi district burnt currency notes worth around Rs 15-20 lakh. According to the weird incident, when Anti-Corruption Bureau officials reached the house of the Tehsildar Kalpesh Kumar Jain, he hurriedly locked himself inside his house and burnt the currency notes.

ITEMVIDEOS: ఏసీబి అధికారులు డొర్ కొడితే.. రూ. 20 లక్షలను కల్చిబూడిత చేసిన తహసీల్దార్

Posted: 03/26/2021 12:21 PM IST
Tehsildar burns currency notes worth rs 20 lakh due to this reason

నిరుద్యోగులుగా ఉన్నప్పుడు ఉద్యోగం లభిస్తే చాలు అనుకున్న వారు అదృష్టం కలిసోచ్చి ప్రభుత్వ అధికారులైన తరువాత జీతం పక్కనబెట్టి.. అమ్యామ్యాలకు అలవాటు పడి ప్రజలు లంచాల పేరుతో హింసించుకుతింటున్నారు. ఇలాంటి వారి భరతం పట్టడానికి ఏసీబి అధికారులు, సంబంధిత శాఖాల అధికారులు వున్నా.. వారి దృష్టికి వచ్చేవి మాత్రం చాలా తక్కువ కేసులే. ఖమ్మం జిల్లాలో తహసీల్దార్ కార్యాలయంలోని ఓ అధికారితో పాటు సర్వేయర్ ఏసీబికి పట్టుబడితే స్థానిక ప్రజలు మిఠాయిలు పంచుకుని, బాణాసంచా పేల్చి మరీ పండగ చేసుకున్నారంటే వారి అవినీతికి ఎన్ని అమాయక గుండెలు అవేదన చెందాయో అర్థం చేసుకోవచ్చు.

ఇక అవినీతి ఎక్కడైనా అదే కదండీ.. తాజాగా రాజస్థాన్ లోని సిరోహీ జిల్లాలో ఓ లంచావతారానికి అవినీతి నిరోధక శాఖ అధికారులు వస్తున్నారన్న సమాచారంతో తన చేతులతో తానే స్వయంగా 20 లక్షల రూపాయలను తగులబెట్టారు. ఇంటి తలుపులు, కిటీకిలన్నీ మూసివేసి వంటగదిలోకి వెళ్లాడు. గ్యాస్ స్టవ్ వెలిగించి.. దానిపై నోట్ల కట్టలు పెట్టి మరి తగులబెట్టాడు. ఈ లెక్కకు మించిన నోట్లను అధికారుల కంటబడకుండా తహసీల్దార్ భార్య కూడా ఆయనకు సహకరించింది. మొత్తం నోట్లను కాల్చివేసినా విషయం మాత్రం బయటకు పొక్కింది. అదెలా అంటే...

సిరోహీ జిల్లాలోని ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకున్న కేసులో రెవెన్యూ ఇన్ స్పెక్టర్ పర్వత్ సింగ్ ను ఏపీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీనిపై ఏసీబీ అధికారుల విచారణలో ఈ లంచానికి సంబంధించిన తన ప్రమేయం ఏమీ లేదని.. తహసీల్దార్ కల్పేష్ కుమార్ జైన్ అదేశాలకు అనుగూణంగానే తాను ఈ డబ్బును తీసుకున్నానని తెలిపారు. దీంతో పర్వత్ సింగ్ ను వెంటబెట్టుకుని కల్పేష్ కుమార్ జైన్ ఇంటికి వచ్చారు. తహసీల్దార్ కల్పేష్ కు ఈ మేరకు సమాచారం అందింది. ఈ క్రమంలో తన ఇంటికి ఏసీబి అధికారులు రైడింగ్ కు వస్తున్నారని తెలుసుకున్న ఆయన.. తనకు తోచిన ఉపాయంతో నోట్లను కాల్చి బూడిద చేశారు.

ఇంతలో కల్పేష్ ఇంటికి చేరుకున్న ఏసీబి అధికారులు.. నోట్ల కట్టలను కాల్చడాన్ని కిటికీలోంచి గమనించి.. ఆయనను నోట్లు తగుటబెట్టవద్దని వారించారు. అయినా కల్పేష్ మాత్రం తన పని తాను చేసుకుపోయాడు. అధికారులు ఎంతగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. దీంతో అధికారులు బలవంతంగా ఆయన ఇంట్లోకి ప్రవేశించారు. నేరుగా వంటగదిలోకి వెళ్లి అక్కడ తగలబడుతున్న నోట్లతో పాటు మిగిలని లక్షన్నర నోట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. వారు అక్కడికి చేరుకునే సమయానికి అక్కడ ఏకంగా 20 లక్షల రూపాయల కరెన్సీ నోట్లు కాలి బూడిదయ్యాయి. అతన్ని అరెస్టు చేసిన అధికారులు అతను కాల్చిన నోట్ల బూడిదను కూడా స్వాధీనం చేసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ACB Officials  Tehsildar  currency notes  burn  bribe cash  Bribery case  Sirohi district  Rajasthan  Crime  

Other Articles