Uttarakhand CM Rawat lands in another controversy మళ్లీ నోరుజారిన సీఎం.. ఈ సారి రేషన్.. పరేషాన్.!

You gave birth to 2 why not 20 uttarakhand cm s latest controversy

Uttarakhand CM, Tirath Singh Rawat, poor families, Covid pandemic, 20 children, food grains, pulses, PM Garib Kalyan Yojana, Uttarakhand, Politics

Uttarakhand Chief Minister Tirath Singh Rawat said poor families struggling to feed themselves amid the Covid pandemic should have had 20 children if they wanted more rations from a central government scheme that distributes food grains and pulses.

ITEMVIDEOS: మళ్లీ నోరుజారిన ముఖ్యమంత్రి.. ఈ సారి రేషన్.. పరేషాన్.!

Posted: 03/22/2021 06:24 PM IST
You gave birth to 2 why not 20 uttarakhand cm s latest controversy

ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే వరకు ఆయన నియోజికవర్గానికి మాత్రమే ఆయన తెలుసు. కానీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయగానే యావత్ దేశప్రజలకు పరిచయం అయ్యాడు. అదేంటి అంటే ఆ రాష్ట్ర ప్రజలకు మాత్రమే తెలుసు కాదా.? అంటారా.. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తూ యావత్ దేశ ప్రజల నుంచి వ్యతిరేకత మూటగట్టుకుంటున్నాడు. మహిళల వస్త్రధారణపై వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కిన ఉత్తరాఖండ్‌ నూతన ముఖ్యమంత్రి తీరత్‌ సింగ్‌ రావత్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అమెరికా భారత దేశాన్ని దాదాపు రెండు వందల సంవత్సరాలు పాలించిందని.. అయినా కరోనాను ఎదుర్కోవడంలో భారత్ తీసుకున్న నిర్ణయాలు దేశప్రజలకు రక్షణగా నిలువగా అమెరికా మాత్రం కరోనా కల్లోలంతో కొట్టుమిట్టాడిందని వ్యాఖ్యలు చేశారు. ఇందులో తప్పేముంది అంటారా.? అమెరికా ఎప్పుడు భారత్ ను పాలించలేదు.. పాలించే అవకాశం కూడా లేదు. కానీ మరీ సీఎం అలా ఎందుకు అన్నారో తెలియదు. బహుశా బ్రిటుషు అనుకుని పోరబడి అమెరికా అన్నారేమో కానీ.. అక్కడి అధికారులు కూడా ఆయనను సరిచేయలేదు. ఇక దీనిపై నెట్ జనులు వ్యంగోక్తులు విసురుతున్నారు.

ఇక అదే సభలో ఆయన మరో వివాదానికి కూడా తేరలేపాడు. ‘‘ప్రభుత్వం అందించే రేషన్‌ ఎక్కువ కావాలనుకునేవారు మరింత మంది పిల్లలను కనాల్సింది కదా’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పేద కుటుంబాలకు కేంద్రం ఒక్కోక్కరికి 5కేజీల రేషన్, పప్పు దినుసులు అందిస్తోందని అయితే వంది కిలోల రేషన్ వచ్చినవారిని చూసి పది కిలోల రేషన్ తీసుకున్నవారు అక్కస్సుతో రగిలిపోయారని అన్నారు. మీరు ఇద్దరే వుంటే మీకు అంతే రేషన్ వస్తోంది కదా.. మీకు అవకాశం వున్నప్పుడు పది మందికి బదులు ఇద్దరితోనే సరిపెట్టుకున్నారు.. ఇప్పుడు వారిపై అక్కస్సు ఎందుకుని ఆయన తనదైన స్టైయిల్ లో కాంట్రవర్సీకి కాలుదువ్వారు.


సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత తీరత్ తొలిసారి మహిళల వస్త్రాధారణపై వ్యాఖ్యలు చేశారు. మహిళలు తమ వస్త్రాధారణతో సభ్యసమాజానికి ఏమి సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. ఈ క్రమంతో తాను ఎదుర్కోన్న ఘటనను వివరించారు. తనతో పాటు విమానంలో ప్రయాణించిర ఓ మహిళ రిప్డ్ జీన్స్ వేసుకుందని, తీరా చూస్తే అమె ఇద్దరు పిల్లల తల్లి అని..వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక భవిష్యత్తులో ఈ తీరథ్ సింగ్ రావత్ మరెన్ని కాంట్రవర్సీలకు కాలుదువ్వుతారో వేచి చూడాల్సిందే. మరి ఇతనిపై అధిష్టానం ఏమైనా ఆంక్షలను విధించే అవకాశాలు వున్నాయేమో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles