36.87pc Voter Turnout Recorded in East Godavari Till 11am ఏపీలో ప్రశాంతంగా కొనసాగుతున్న పురపాలక పోలింగ్..

Ap municipal elections 2021 polling underway for urban local bodies in andhra pradesh

AP Municipal Elections 2021 LIVE Updates,AP Municipal Elections 2021,AP Municipal Elections,Andhra Pradesh Municipal Elections 2021 LIVE Updates,Andhra Pradesh Mun icipal Elections 2021,Andhra Pradesh municipal elections,Andhra Pradesh local body polls,Andhra Pradesh urban local bodies polls,Andhra Pradesh ULB elections,ulb elections,ulb polls,AP local body elections 2021,AP local body elections,Andhra Pradesh,Andhra Pradesh elections

Voting is underway across Andhra Pradesh as elections of urban local bodies (ULBs) – 71 municipalities and Nagar Panchayats and 12 municipal corporations are being held. As many as 78.71 lakh eligible voters are eligible to vote in today’s AP Municipal Elections 2021.

ఏపీలో ప్రశాంతంగా కొనసాగుతున్న పురపాలక పోలింగ్..

Posted: 03/10/2021 11:50 AM IST
Ap municipal elections 2021 polling underway for urban local bodies in andhra pradesh

ఏపీలో మునిసిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 12 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిణ కొనసాగుతోంది. మొత్తం  2,214 డివిజన్, వార్డు స్థానాల్లో 580 ఏకగ్రీవం కాగా మిగిలిన డివిజన్, వార్డులకు పోలింగ్ ఈ ఉదయం ప్రారంభమైంది. అలాగే, నాలుగు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 71 మునిసిపాలిటీలు, 12 నగర పాలక సంస్థల్లో పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 11 గంటల వరకు పురపాలక సంఘాలలో 32.23 శాతం ఓటింగ్ నమోదయ్యిందని సమాచారం. మున్సిఫల్ ఎన్ినకల సరళిని కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పరిశీలిస్తున్న అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అనేక మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. కాగా జిల్లాలా వారీగా మధ్యాహ్నం 11 గంటల వరకు నమోదైన పర్సెంటేజీ వివరాలు ఇలా వున్నాయి. శ్రీకాకుళం 24.58, విజయనగరం 31.97, విశాఖపట్నం 28.5, తూర్పుగోదావరి 36.31, పశ్చిమగోదావరి జిల్లా 34.14, కృష్ణా జిల్లా 32.64, గుంటూరు జిల్లా 33.62, ప్రకాశం జిల్లా 36.12, అనంతపురం 31.36, నెల్లూరు 32.67, చిత్తూరు 30.21, కడప 32.82, కర్నూలు 34.12 శాతం పోలింగ్‌ నమోదైంది.

మొత్తంగా 7,549 మంది అభ్యర్థులు ఎన్నికలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా, 77,73,231 మంది తమ ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల సక్రమ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బంధీగా ఏర్పాటు చేసింది. పోలింగ్ ప్రక్రియను సక్రమంగా పూర్తి చేసేందుకు జిల్లాకు ఓ నోడల్ అధికారిని ప్రత్యేకంగా నియమించింది. నోడల్ అధికార వ్యవస్థ ద్వారా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఏర్పాటు చేసింది. 12 నగరపాలకసంస్థలకు, 71 మున్సిపాలిటీలకు మొత్తంగా 26,835 మరియు 21,888 మంది ఎన్నికల సిబ్బందిని ఏర్పాటు చేసింది.

రాష్ట్రంలో జరుగుతున్న పురపాలక పోరులో భాగంగా పొలింగ్ సరళి పరిశీలించారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్. జిల్లా కలెక్టర్ ఏ.ఎండి ఇంతియాజ్‌తో కలిసి విజయవాడలోని బిషప్ గ్రేసి హైస్కూల్, సీవీఆర్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను ఎస్ఈసీ పరిశీలించారు. వృద్ధులు, యువకులు, మహిళా ఓటర్లతో ఆయన మాట్లాడారు. పోలింగ్, క్యూ లైన్లపై ఓటర్ల స్పందన అడిగి తెలుసుకున్నారు. ప్రతీ ఒక్కరూ రాజ్యంగం కల్పించిన ఓటు హక్కును తమ బాధ్యతగా వినియోగించుకోవాలని ఆయన విజ్ణప్తి చేశారు. ఓటు  వేయడానికి 75 సంవత్సరాల టంకాశాల సుబ్బమ్మ వచ్చి క్యూలైన్లో నిలబడటంతో అమెను ఆయన అభినందించారు.

పురపాలక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పేర్ని నాని, విశాఖ జిల్లా భీమిలి నేరెళ్లవలసలో అవంతి శ్రీనివాస్‌, వైఎస్సార్‌ జిల్లా కడప 29వ డివిజన్‌లో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 53వ డివిజన్‌లో వెల్లంపల్లి శ్రీనివాస్‌, ప్రకాశం జిల్లా ఒంగోలు 34వ డివిజన్‌లో బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తమ ఓటు హక్కులను వినియోగించుకున్నారు. ఏపీ వైద్యశాఖా మంత్రి ఆళ్ల నాని ఓటు గల్లంతైంది. దీంతో ఆయన అధికారులను నిలదీసినా ఓటు హక్కు వేసే అవకాశం లేకపోవడంతో, ఏలేరు 25వ డివిజన్ లోని శనివారపు పేట ఎంపీయూపీ పాఠశాలలోని కేంద్రం నుంచి వెనుదిరిగారు.

గుంటూరులో ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థంబాల గరువులోని ఉర్దూ పాఠశాలలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌, బుచ్చయ్యతోటలోని పోలింగ్‌ కేంద్రంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఓటు వేశారు. విశాఖలో ఎంపీ విజయసాయిరెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. విశాఖపట్నం 14 వార్డులోని మారుతీనగర్ పోలింగ్‌ కేంద్రం-11లో ఆయన ఓటేశారు. మాజీ ఎంపీ సబ్బం హరి కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పటమట లంకలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలోని పోలింగ్ బూత్ నంబరు 4లో పవన్ ఓటు వేశారు. అలాగే, ఎమ్మెల్సీ అశోక్‌బాబు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles