Complainant in Jarkiholi CD case goes missing కర్ణటక మంత్రి రాసలీల వీడియోలోని మహిళ అదృశ్యం

Complainant in jarkiholi cd case claims threat to life refuses to meet cops

ramesh jarkiholi, jarkiholi sex cd, Dinesh Kalahalli, social activist, Siddaramaiah, television channels, Cubbon Park police, government job, bs yediyurappa, karnataka govt, congress, JDU, Shivakumar, Kumaraswamy, Karnataka, Politics, Crime

After Karnataka’s water resources minister Ramesh Jarkiholi resigned from his post, after a CD purportedly showed him seeking sexual favours from a woman, Now reports say the woman goes missing, police trying to trace her through her mobile phone which seems to be switched off.

కర్ణటక మంత్రి రాసలీల వీడియోలోని మహిళ అదృశ్యం

Posted: 03/05/2021 11:55 AM IST
Complainant in jarkiholi cd case claims threat to life refuses to meet cops

కర్ణాటకకు చెందిన మంత్రి రమేశ్ జార్కిహోళి రాసలీలల వీడియో ఒకటి కర్ణాటకలో కలకలం రేపడంతో మంత్రి తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహరం అంతటితో చల్లబడిందనుకునే తరుణంలో ఆయన సదరు మహిళతో రాసలీలల వీడియోలో చేసిన పలు వ్యాఖ్యలు కూడా దుమారం రేగింది. కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప అవినీతిపరుడని, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మంచి వ్యక్తి అని, అంతేకాక కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి త్వరలోనే ముఖ్యమంత్రి అవుతారని కూడా జోస్యం చెప్పడం అంతా రాష్ట్ర రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాలను కూడా కుదిపేసింది.

ఇక ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించిన మంత్రి తనను లైంగిక అవసరాలకు వాడుకున్నారని ఓ మహిళ ఆరోపించడంతో పాటు ఏకంగా మంత్రి తనతో ఏకాంతంగా గడిపిన దృశ్యాల వీడియోను పలు మీడియా ఛానెళ్లకు సమాచార హక్కు చట్టం కార్యకర్త దినేశ్ కల్లహళ్లికి అందించగా.. వాటిని పలు జాతీయ చానెళ్లు పరిశీలించి.. అందులో మాజీ మంత్రి చెప్పిన విషయాలపై దృష్టిసారించాయి. దీంతో ఈ వీడియో టేప్ లోని మాటల సారాంశాన్ని అవి బయటపెట్టిన నేపథ్యంలో సీఎం యడీయూరప్ప అనేక విమర్శలను ఎదుర్కోంటున్నారు.

ఇక తాజాగా ఈ వీడియోలో కనిపించిన యువతి అదృశ్యం కావడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనమైంది. ఆమె ఎక్కడ ఉందన్న విషయాన్ని గుర్తించేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆమె మొబైల్ ఫోన్ నంబర్ కూడా లభ్యం కాలేదని పోలీసు వర్గాలు అంటున్నాయి. వీరిద్దరి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండటంతో వాటిని  ఆపేందుకు కూడా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఓ శాసన సభ్యుడి ప్రోద్బలంతోనే సదరు యువతి రమేశ్ పై వలపు వల విసిరిందని రమేశ్ అనుకూల వర్గాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే రహస్యంగా వీడియోలు చిత్రీకరించారని అంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles