అత్యచార కేసుల్లో బాధితులను పెళ్లి చేసుకుంటామని హామీ ఇచ్చినా.. లేక మరో విధంగా రాజీ కుదుర్చుకున్నా కేసుల నుంచి మినహాయింపు మాత్రం లభించదని గతంలోనే చెప్పిన దేశసర్వన్నత న్యాయస్థానం ఇవాళ ఓ ప్రభుత్వం ఉద్యోగి విషయంలో మాత్రం ఆ ఉత్తర్వులను సడలించింది. అత్యాచార ఆరోపణల నేపథ్యంలో పోక్సో యాక్ట్ కింద నమోదైన కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ‘‘బాధితురాలిని పెళ్లి చేసుకుంటావా.. లేక జైలుకెళ్తావా’’ అని నిందితుడిని ప్రశ్నించింది. ఉద్యోగం నుంచి సస్పెండ్ కాకుండా ఉండాలన్నా.. జైలుకు వెళ్లకుండా ఉండాలన్న బాధితురాలిని వివాహం చేసుకోవాలని సూచించింది.
నిందితుడు మోహిత్ సుభాష్ చవాన్ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ‘‘నీవు పాఠశాల విద్యార్థినిపై అత్యాచారం చేశావ్. ఇందుకు గాను నీమీద పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు అయ్యింది. ఒకవేళ నీవు బాధితురాలిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంటే.. మేం నీకు సాయం చేయగలం. లేదంటే నీవు జైలుకెళ్తావ్.. అప్పుడు ఆటోమెటిగ్గా నీ ఉద్యోగం కూడా పోతుంది’’ అని కోర్టు నిందితుడికి తెలిపింది. గతంలోనే తాను బాధితురాలిని వివాహం చేసుకోవడానికి అమెతో రాజీ కుదుర్చుకునేందుకు వచ్చానని, అయితే అందుకు అమె అంగీకరించలేదని చౌహాన్ తెలిపాడు.
కాగా అమె అంగీకరించకపోవడంతో తమ కుటుంబసభ్యులు వేరే యువతితో తన పెళ్లి చేశారని చెప్పాడు. దీంతో ఇప్పుడు తాను పెళ్లైన వ్యక్తినయ్యానని, ఇప్పడు బాధితురాలిని పెళ్లి చేసుకోలేను అని న్యాయసానం ఎదుట చెప్పాడు. నిందితుడు చవాన్ మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిక్ ప్రొడక్షన్ కంపెనీలో టెక్నిషియన్‌గా పని చేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం చవాన్ మైనర్ స్కూల్ విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. దాంతో అతడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు అయ్యింది. ప్రభుత్వ ఉద్యోగి కావడంతో పోలీసులు చవాన్‌ని అరెస్ట్ చేస్తే.. వెంటనే అతడిని ఉద్యోగం నుంచి తొలగిస్తారు.
దాంతో అతడు అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ.. హై కోర్టుని ఆశ్రయించాడు. అక్కడ ఆశించిన ఫలితం రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. చవాన్ బెయిల్ పిటిషన్ సందర్బంగా కోర్టు.. బాధితురాలిని వివాహం చేసుకుంటే.. జైలుకెళ్లాల్సిన అవసరంలేదని తెలిపింది. ఇక ఈ విషయంలో కోర్టు బలవంతం ఏం లేదని స్పష్టం చేసింది. ఒకవేళ బాధితురాలిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా లేకపోతే.. రెగ్యూలర్ బెయిల్‌కు అప్లై చేసుకోవాలని కోర్టు సూచించింది. చవాన్‌కి నాలుగు వారాల పాటు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more