Flyers with no check-in baggage to get fare discount చెక్-ఇన్ లగేజీ చెక్ పెడితే.. దేశీయ విమానయానంపై రాయితీ

Flyers to soon get concession on fares for travelling without check in baggage

dgca, ticket prices, no baggage, basic fare, cabin luggage, aviation india, zero baggage, passengers, dgca india, airlines, airline baggage policy, opt in basis, India, DGCA, domestic flights, domestic flight fares, check-in Luggage, no check-in baggage discount, no check-in baggage discount fare, domestic air fares discount

The Directorate General of Civil Aviation (DGCA) on Friday allowed airlines to offer concessions in ticket prices to passengers with no check-in luggage, weeks after the government increased the fare band for all flights across India.

చెక్-ఇన్ లగేజీ చెక్ పెడితే.. దేశీయ విమానయానంపై రాయితీ

Posted: 02/26/2021 07:03 PM IST
Flyers to soon get concession on fares for travelling without check in baggage

మీరు దేశీయంగా విమానయానం చేయలనుకుంటున్నారా.? అయితే మీకో గుడ్ న్యూస్. మీరు చెక్ ఇన్ లగేజ్‌ లేకుండా దేశీయంగా విమానాల్లో ప్రయాణిస్తే.. మీ ప్రయాణం టికెట్ ధరపై రాయితీని పోందే అవకాశం లభిస్తోంది. ఔనా నిజంగానా.. అంటున్నారా.? ఇది ముమ్మాటికీ నిజమే. దేశీయంగా ఏ ప్రాంతానికి వెళ్లినా కేవలం క్యాబిన్ లగేజీతో మాత్రమే వెళ్లే ప్రయాణికులు ఈ రకమైన రాయితీని అందించేందుకు పౌర విమానయాన డైరెక్టరేట్ కంట్రోలర్ అనుమతలను ఇచ్చింది. చెక్‌ ఇన్‌ లగేజ్‌ లేకుండా కేవలం క్యాబిన్‌ బ్యాగులతో మాత్రమే ప్రయాణించేవారికి టికెట్లపై రాయితీలు ఇచ్చేలా డీజీసీఏ అనుమతినిచ్చింది.

ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. విమాన ప్రయాణికులు 7 కిలోల వరకు క్యాబిన్‌ బ్యాగేజ్‌, 15 కిలోల వరకు చెక్‌ఇన్‌ లగేజ్‌లను తీసుకెళ్లొచ్చు. అంతకంటే ఎక్కువ లగేజ్‌ తీసుకెళ్లాలంటే అదనపు ఛార్జీలు వర్తిస్తాయి. అయితే డీజీసీఏ కొత్త నిబంధనల ప్రకారం.. ఇకపై చెక్‌ఇన్‌ బ్యాగ్‌లు లేకుండా కేవలం క్యాబిన్‌ బ్యాగులతో వెళ్లే ప్రయాణికులకు విమానయాన సంస్థలు తక్కువ ధరకే టికెట్లు ఇచ్చే అవకాశముంటుంది. అయితే ఈ డిస్కౌంట్లు పొందాలంటే ప్రయాణికులు టికెట్‌ బుక్‌ చేసుకునే సమయంలోనే తమ వెంట తీసుకెళ్లే బ్యాగేజ్‌ బరువు చెప్పాల్సి ఉంటుంది.

‘‘ఎయిర్‌లైన్‌ బ్యాగేజీ పాలసీ ప్రకారం.. విమానయాన సంస్థలు ప్రయాణికులకు ఉచిత బ్యాగేజ్‌ అలవెన్సెస్‌తో పాటు జీరో బ్యాగేజ్‌/నో చెక్‌ఇన్‌ బ్యాగేజ్‌ ధరల స్కీంను అందించేలా అనుమతినిస్తున్నాం. ప్రయాణికులు టికెట్‌ బుక్‌ చేసుకునే సమయంలోనే ఈ టికెట్‌ ధరల స్కీం గురించి వారికి తెలియజేయాలి. అంతేగాక, టికెట్‌పై ప్రింట్‌ చేయాలి’’ అని డీజీసీఏ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు తాజాగా ఓ సర్క్యులర్‌లో వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles