Rahul Gandhi swims with fishermen in Kerala నడి సంద్రంలో చేపలు పట్టి.. ఈత కోట్టిన రాహుల్

Watch rahul gandhi jumps into the sea swims with fishermen in kerala

Rahul gandhi swims with fishermen, Rahul Gandhi, kollam, Thangassery beach, rahul gandhi kollam, rahul gandhi kollam news, kerala assembly election rahul gandhi, Rahul Gandhi jumps in sea, Rahul Gandhi fisheries, Rahul Gandhi jumps, Rahul Gandhi Kerala, Kerala

Congress leader Rahul Gandhi took part in a fishing exercise in poll-bound Kerala's Kollam district. During the exercise, he jumped into the sea along with fishermen as they cast their nets. As per local Congress leaders, Rahul Gandhi reportedly spent around 10 minutes swimming in the sea with the fishermen.

ITEMVIDEOS: నడి సముద్రంలో చేపలు పట్టి.. ఈత కోట్టిన రాహుల్ గాంధీ

Posted: 02/25/2021 05:46 PM IST
Watch rahul gandhi jumps into the sea swims with fishermen in kerala

కాంగ్రెస్‌ అగ్రనేత రాహు‌ల్ ‌‌గాంధీ త్వరలో ఎన్నికలను జరగనున్న కేరళ రాష్ట్రంలో పర్యటిస్తూ.. అక్కడి కొల్లాం జిల్లాలోని మత్య్సకారుల సమస్యలను తెలుసుకునేందుకు వారితో కలసి సముద్రయానం చేశారు. దాదాపు రెండున్నర గంటల పాటు సముద్రంలో వారితో గడిపిన ఆయన.. వారి సమస్యలను క్షుణ్ణంగా అవగతం చేసుకున్నారు. తాను చాలా పర్యాయాలు చేపలను తిన్నానని, అయితే ఎప్పడు ఈ చేపలు ఎలా తన ముందుకు బోజనంగా వచ్చాయన్న విషయాలపై తాను శ్రద్దపెట్టలేదని.. కానీ ఇవాళ తనకు ఈ విషయం పూర్తిగా అవగతమైందని అన్నారు.

మత్య్సకార్మికులు ఎంతటి కష్టనష్టాలకు, వ్యయప్రయాసలకోర్చి సముద్రంలోని చేపలను తమకు అందుబాటులోకి తీసుకువస్తున్నారో తాను వారితో కలసి చేపలు పట్టడం ద్వారా అర్థమైందని అన్నారు. ఈ క్రమంలో సముద్రంలోకి వలలు వేసిన తరువాత కొందరు మత్స్యకారులు సముద్రంలోకి దూకి ఈత కొట్టారు. వారిని చూసిన రాహుల్ గాంధీ కూడా తాను స‌ముద్రంలోకి దూకి ఈతకొట్టారు. ఈత కొడుతూ తనతో పాటు దూకిన మత్స్యకారులతో మాట్లాడుతూ ఏకంగా పదినిమిషాలకు పైగానే రాహుల్ సముద్రంలో ఈతకోట్టారు.

నీలి రంగు టీ షర్టు, కాకీ వర్ణ ఫ్యాంటు ధరించిన రాహుల్ గాంధీ తిరుగు ప్రయాణంలో తడిచిన బట్టలతోనే తన్గస్సెరీ బీచ్ వద్దకు చేరుకున్న తరువాత తన దుస్తులను మార్చుకున్నారు. తాను మాకెవరికీ చెప్పకుండా సముద్రంలోకి దూకీ ఈత కోట్టారు. ఆయన ఆకస్మికంగా చేసిన పనితో తాము తొలుత నివ్వెరపోయామని, అయితే సముద్రంలోకి దూకిన ఆయన చాలా ప్రశాంతంగా పది నిమిషాల పాటు ఈత కొట్టారని ఓ కాంగ్రెస్ నాయకుడు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles