Bird Flu scare in vikarabad and suryapet వికారాబాద్, సూర్యాపేట లలో బర్డ్ ప్లూ కలకలం..

1 000 poultry birds die in telangana s suryapet and vikarabad samples sent to pune

bird flu tension in Telanaga, bird flu scare in suryapet, bird flu scare in vikarabad, bird flu scare in telangana, bird flu, poultry birds, influenza, Samples, Pune, suryapet, vikarabad, Animal Husbundry, Hyderabad, Chicken rates, Eggs Price, Telangana

As many as 1,000 poultry birds have died in Suryapet district prompting officials to send the samples for testing to check if avian influenza was the reason. And also thousands of hens and crows from Vikarabad district raise alert in the district.

వికారాబాద్, సూర్యాపేట లలో బర్డ్ ప్లూ కలకలం.. కోళ్లు, కాకులు మృతి

Posted: 02/03/2021 04:36 PM IST
1 000 poultry birds die in telangana s suryapet and vikarabad samples sent to pune

తెలంగాణలోని సూర్యపేట, వికారాబాద్ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. సూర్యాపేటలో వందలాది కోళ్లు మృత్యవాత పడ్డాయి. గత వారం రోజులుగా ఈ విషయాన్ని అక్కడి ఫౌల్ట్రీల యాజమాన్యాలు గుర్తిస్తున్నాయి. కాగా క్రితం రోజున పెద్ద సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడటంతో పశుసంవర్థక శాఖ రంగంలోకి దిగింది. మరణించిన కోళ్ల నుంచి శాంపిళ్లను సేకరించి పూనేలోని వైరాలజీ ల్యాబ్ కు పంపారు. ఫారాలలో కోళ్లు మరణించడం అన్నది సాధారణంగా చోటుచేసుకునే విషయమే అయినా.. వాటిని పరీక్షించి వాటికి బర్డ్ ప్వూ సోకిందో లేదో తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహించేందకు పంపారు.

దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో గత కొన్ని నెలల క్రితం బ‌ర్డ్ ఫ్లూ కేసులు వెలుగులోకి రావ‌డంతో తీవ్ర క‌ల‌క‌లం రేగిన విష‌యం తెలిసిందే. చికెన్ రేట్లు అమాంత తగ్గి నేల చూపులు చూస్తున్న తరుణంలో తెలంగాణలో ఎక్కడా బర్డ్ ప్లూ లేదని.. ప్రభుత్వం, అధికారులు స్పష్టమైన హామీలను ఇవ్వడంతో చికెన్ అమ్మకాలకు మళ్లీ డిమాండ్ వచ్చింది. ఇక తాజాగా అటు సూర్యాపేట, ఇటు వికారాబాద్ జిల్లాలలో వేలాది కోళ్లు మరణించడం కలకలం రేపుతోంది. వికారాబాద్ జిల్లాలో కోళ్లతో పాటు కాకులకు వింత వ్యాధి సోకుతుండ‌డం అల‌జ‌డి రేపుతోంది.

వందలాది కోళ్లుతో పాటు జిల్లాలోని ప‌లు ప్రాంతాల్లో కాకులు కూడా ఉన్న‌ట్టుండి మృత్యువాత ప‌డుతున్నాయ‌ని అక్క‌డి ప్ర‌జ‌లు చెబుతున్నారు. దారూర్‌, యాలాల మండలాల్లోని పలు గ్రామాల్లో పెద్ద ఎత్తున‌ కోళ్లు చనిపోతున్నాయని తెలిపారు. అయిన‌ప్ప‌టికీ, అధికారులు చ‌నిపోయిన కోళ్ల విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతుండ‌డంతో స్థానికులు వాటిని పాతిపెట్టకుండా బయట పడేస్తున్నారు. దీంతో వాటిని తింటోన్న కాకులు మృత్యువాత‌ ప‌డుతున్నాయి. దీంతో వికారాబాద్ జిల్లాలోని ప‌లు ప్రాంతాల ప్ర‌జ‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. చర్య‌లు చేప‌ట్టాల‌ని అధికారుల‌కు విన్నవించుకుంటున్నారు. వారం రోజులుగా కోళ్లు, కాకులు చ‌నిపోతున్నాయ‌ని చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bird flu  poultry birds  influenza  Samples  Pune  suryapet  vikarabad  Animal Husbundry  Chicken rates  Eggs Price  Telangana  

Other Articles