DGP praise woman SI of Kasibugga PS కాశీబుగ్గ మహిళా ఎసైకి.. డీజిపి గౌతమ్ సవాంగ్ ప్రశంసలు

Dgp gautam sawang praise woman si k sirisha of kasibugga ps

woman SI, humanitariian gesture, K Sirisha, Kasibugga PS, Adavi Kothur, Unknown deadbody, last rites, Stretcher, AP DGP Goutham sawang, Srikakulam, Andra pradesh, Crime

A woman SI K Sirisha of Kasibugga PS has shown her humanitarian gesture. After coming to know that a dead body was lying in one of the agricultural fields for two days and no body come forward to remove it, the women SI took the help of one person and carried the dead body that was kept on a stretcher.

ITEMVIDEOS: కాశీబుగ్గ మహిళా ఎసైకి.. డీజిపి గౌతమ్ సవాంగ్ ప్రశంసలు

Posted: 02/01/2021 09:35 PM IST
Dgp gautam sawang praise woman si k sirisha of kasibugga ps

శ్రీకాకుళం కాశీబుగ్గ మహిళా ఎస్సై శిరీషపై ఇంటా బయటా ప్రశంసల జల్లు కురుస్తోంది. అటు డిపార్టుమెంటులోనూ ఉన్నాతాధికారుల నుంచి కిందిస్ధాయి సిబ్బంది వరకు అమె చేసిన పనికి ప్రశంసలు కురిపించలేకుండా వుండలేరు. అయితే మానవత్తాన్ని చాటుకున్న అమెను చివరకు పోలీస్ బాస్ డీజీపి కూడా కొనియాడారు. ఇక సామాన్యుల నుంచి అటు పలు విభాగాల అధికారుల వరకు అమె ప్రశంసలు అందుకుంటున్నారు. ఇంతకు ఇంతలా ప్రశ్నంసలను అందుకునేందుకు గల కారణం ఏంటో తెలుసుకోవాలని వుందా.. అయితే వివరాల్లోకి వెళ్ధాం..

జిల్లాలోని పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని అడివికొత్తూరు గ్రామం పొలాల్లో ఓ గుర్తుతెలియని మృతదేహం పడివుంది. అయితే రెండు రోజులు గడుస్తున్నా ఈ శవం ఎవరిదన్న వివరాలు తెలియలేదు. చివరకు అనాధశవం సమాచారం అందుకున్న కాశీబుగ్గ మహిళా ఎస్ఐ అక్కడకు చేరకుని శవాన్ని స్ట్రచ్చర్ పై ఎక్కించారు. అయితే అక్కడి నుంచి అడవి కొత్తూరు వరకు కేవలం వరాల వెంబడే నడవాల్సి వుండగా, ఎస్ఐ శిరీష.. మరో వ్యక్తి సాయంతో స్ట్రచ్చర్ ముందువైపును తాను మోసింది. మార్గమధ్యంలో కొందరు మనుషులు వచ్చినా అమె వారికి స్ట్రచ్చర్ ను ఇచ్చేందుకు నిరాకరించింది.

భుజాలపై అనాధశవాన్ని మోసుకుని వరాల వెంబడి వస్తున్న అమెకు సంబంధించిన వీడియోను అక్కడి స్థానికులు తమ సెల్ ఫోన్లలో బంధించారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆ మృతదేహాన్ని స్థానికుల సాయంతో మహిళా ఎస్సై స్వయంగా అంత్యక్రియలు కూడా జరిపించారు. ఎస్సై శిరీష పొలం గట్లు, అటవీప్రాంతాలు దాటుకుంటూ ఓ స్ట్రెచర్ పై మోసుకురావడం పట్ల సామాజిక మాధ్యమాల్లో విశేష స్పందన వస్తోంది. ఏపీ పోలీస్ విభాగం కూడా ఎస్సై శిరీషను అభినందిస్తూ ట్వీట్ చేసింది. ఆమె వీడియోను కూడా పంచుకుంది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles