Traders body asks govt to ban WhatsApp నూతన ప్రైవసీ విధానాలతో వాట్సాఫ్ జోరుకు బ్రేకులు..

India inc cautions employees on whatsapp privacy policy changes

Whatsapp privacy policy, WhatsApp, Microsoft teams, slack, Telegram, signal, social media, whatsapp privacy policy changes, corporate matters, business meetings cyber security, facebook

Tata Steel Ltd. and other companies, Indian and multinational, have begun issuing advisories to staff asking them to avoid sharing sensitive information on WhatsApp and stop using the platform for critical business calls.

వాట్సాఫ్ జోరుకు బ్రేకులు.. నూతన ప్రైవసీ విధానాలే కారణం..

Posted: 01/11/2021 08:54 PM IST
India inc cautions employees on whatsapp privacy policy changes

వాట్సాప్.. స్మార్ట్ ఫోన్ వున్న పత్రీ ఒక్కరికీ ఇదో అందివచ్చిన అద్భుత సాధనం.. తమ ఫోటోలతో పాటు పలు వీడియోలు, ఇతర సమాచారాన్ని తమ అప్తులు, స్నేహితులు, బంధువులతో పంచుకునేలా దోహదపడుతోంది. అయితే తాజాగా వాట్సాప్ తమ ప్రైవసీ పాలసీని మార్చడంతో పాటు సేవలను అందించడంలోనూ నూతన నిబంధనలను తీసుకుని రావడంలో ప్రకటించిన మార్పులు ఇప్పుడు ఆ సంస్థ మనుగడనే ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. మరీ ముఖ్యంగా వాట్సాప్ బుజినెస్ లో తీసుకువచ్చిన మార్పులతో దేశీయ, అంతర్జాతీయ, బహుళజాతీ సంస్థలు అనేకం తమ ఉద్యోగులు, సిబ్బందికి ఇక వాట్సాప్ వినియోగంతో దూరంగా వుండాలని అదేశాలను కూడా జారీ చేశాయి.

టాటా స్టీల్ సహా పలు దేశీయ సంస్థలు, వాట్సప్ పై తాజాగా అదేశాలను జారీచేశాయి. అంతేకాదు.. ముఖ్యంగా అత్యంత విశ్వసనీయ సమాచారంతో పాటు కీలక, సున్నితమైన బిజినెస్ కాల్స్ కు వాట్సప్ వాడొద్దని చెబుతున్నాయి. కొత్త ప్రైవసీ పాలసీ, సర్వీసు నిబంధనల ఆధారంగా వాట్సాప్ తమ పేరెంట్ కంపెనీ ఫేస్ బుక్ తో డేటా షేర్ చేసుకుంటుందని వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో ఫేస్ బుక్ నుంచి కీలక సమాచారం బయటి వ్యక్తులకు కూడా చేరుతుందన్న అందోళనలు వ్యక్తమవుతున్నాయి, దీనిపై సైబర్ సెక్యూరిటీ నిపుణులు, కన్సల్టెంట్లు.. కంపెనీలు తమ ఉద్యోగులకు వాట్సప్ ను దూరంగా ఉంచాలని చెప్పమంటున్నారు.

ఇక వాట్సాప్ ప్రైవసీ పాలసీని మార్చిందన్న వార్తలతో పాటు సేవల కోనసాగింపులోనూ నూతన నిబంధనలు తీసుకురావడంపై ఇప్పటికే భారత వ్యాపారస్థుల నుంచి కేంద్రానికి వినతులు వెల్లువెత్తాయి, కేంద్రం వాట్పాఫ్ పై నిషేధం విధించాలని వ్యాపారసంస్థలు డిమాండ్ చేస్తున్నాయి, ఈ నేపథ్యంలో ఇవాళ సమావేశం కానున్న పార్లమెంటరీ కమిటీ వాట్సప్ ప్రైవసీ అప్ డేటా పై చర్చించేందుకు రెడీ అయింది. దీంతో అప్రమత్తమైన టాటా స్టీల్ తమ ఉద్యోగులకు కార్పొరేట్ విషయాలు, బిజినెస్ సమావేశాలు వాట్సప్ ద్వారా పంపొద్దని సూచిస్తుంది. ఇక ఇప్పటికే పలు దేశీయ, బహుళ జాతీ సంస్థలు కూడా ఈ విషయమై స్పందించాయి. తమ ఉద్యోగులకు వాట్సాప్ నుంచి దూరంగా వుండాలని సూచనలు జారీ చేశాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Whatsapp privacy policy  WhatsApp  Microsoft teams  business meetings  cyber security  facebook  

Other Articles