Court summons Jagan, 17 others సీఎం జగన్ అక్రమాస్థుల కేసులో ఈడీ నోటీసులు..

Ed summons cm jagan 17 others in dissappropriate assets case

special court, Enforcement Directorate, Y.S. Jagan Mohan Reddy, Aurobindo Pharma, money laundering, quid pro quo cases, Jagan Monhan Reddy, Jaganmohan Reddy, Enforcement Directorate, ED, Jagan Reddy disproportionate assets case, Jagan Reddy DA case, Jagan Reddy ED, Andhra Pradesh, Politics

A special court for Enforcement Directorate cases has issued summons to Andhra Pradesh Chief Minister Y.S. Jagan Mohan Reddy and 17 others to appear before it here on Monday in connection with the charge-sheet filed against them by the agency over money laundering in the quid pro quo cases involving several companies and individuals.

సీఎం జగన్ అక్రమాస్థుల కేసులో ఈడీ నోటీసులు.. మరో 17 మందికి..

Posted: 01/09/2021 09:08 PM IST
Ed summons cm jagan 17 others in dissappropriate assets case

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ పై వున్న అక్రమాస్థుల కేసుల్లో కదలిక రాష్ట్రంలో ఒక్కసారిగా కుదుపుకు గురిచేసింది, ఈ కేసులో ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది. అరబిందో, హెటిరో భూ కేటాయింపుల చార్జిషీట్‌ ఇటీవల నాంపల్లి కోర్టు నుంచి ఈడీ కోర్టుకు బదిలీ అయింది. అరబిందో, హెటిరో భూ కేటాయింపుల చార్జిషీట్ ను విచారణకు స్వీకరించిన ఈడీ కోర్టు.. ఈనెల 11న విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. సీఎం జగన్ సహా విజయసాయిరెడ్డి, హెటిరో డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, అరంబిందో ఎండీ నిత్యానందరెడ్డి, పీవీ రాంప్రసాద్ రెడ్డి, టైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ చంద్రారెడ్డి, విశ్రాంత ఐఏఎస్‌ బీపీ ఆచార్యకు ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది.

జడ్చర్ల సెజ్ లో అరబిందో, హెటిరో సంస్థలకు భూ కేటాయింపుల్లో క్విడ్‌ ప్రోకో జరిగిందని సీబీఐ, ఈడీ అభియోగం. అరబిందో, హెటిరో సంస్థలకు చెరో 75 ఎకరాలను ధరల నిర్ణయాక కమిటీ నిర్ణయానికి విరుద్ధంగా ఎకరం రూ.7లక్షల చొప్పున వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం కేటాయించినట్టు సీబీఐ, ఈడీ చార్జీషీట్లలో పేర్కొన్నాయి. మెదక్‌ జిల్లా పాశమైలారంలో అరబిందో సంస్థకు గతంలో ఏపీఐఐసీ కేటాయించిన 30 ఎకరాలను నిబంధనలకు విరుద్ధంగా ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌కు బదలాయించినట్టు మరో అభియోగం. దాని వల్ల అరబిందో ఎండీ నిత్యానందరెడ్డి బావమరిది పి.శరత్‌ చంద్రారెడ్డి ఎండీగా ఉన్న ట్రైడెంట్‌ సంస్థ రూ.4.33 కోట్లు అక్రమంగా లబ్ధి పొందినట్టు అభియోగం.

వీటికి ప్రతిఫలంగా అరబిందో ఎండీ నిత్యానందరెడ్డి రూ.10కోట్లు, హెటిరో డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డి రూ.17.25 కోట్లు జగన్‌ కు చెందిన జగతి పబ్లికేషన్స్‌, జననీ ఇన్‌ ఫ్రా సంస్థల్లోకి పెట్టుబడుల రూపంలో మళ్లించారని సీబీఐ, ఈడీ అభియోగ పత్రాల సారాంశం. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు చేసిన ఈడీ.. హెటిరో, అరబిందో, జననీ ఇన్ ఫ్రా, జగతి పబ్లికేషన్స్ కు చెందిన సుమారు రూ.51 కో ట్ల విలువైన ఆస్తులను తాత్కాలిక జప్తు చేసి స్వాధీనం చేసుకోగా.. వాటిపై అప్పీలేట్ ట్రైబ్యునల్ స్టే ఇచ్చింది. అప్పీలేట్ ట్రైబ్యునల్ ఉత్తర్వులపై ఈడీ దాఖలు చేసిన పిటిషన్లు తెలంగాణ హైకోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. అరబిందో, హెటిరోకు భూకేటాయింపులపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్‌ 2016లో నాంపల్లి కోర్టులో చార్జ్‌ షీట్ దాఖలు చేయగా.. ఇటీవల సీబీఐ, ఈడీ కోర్టుకు బదిలీ అయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles