(Image source from: Twitter.com/somuveerraju)
రాష్ట్రంలోని వైఎస్ జగన్ ప్రభుత్వానికి హిందూ సంప్రదాయాలపై, హిందూ దేవాలయాలపై ఎలాంటి గౌరవం, నమ్మకం లేకుండా వ్యవహరిస్తోందని రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. హిందూ దేవాలయాలపై క్రమం తప్పకుండా దాడులు జరుగుతున్న పరిణామాలు వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అధికం అవుతున్నాయని ఆయన మండిపడ్డారు, హిందువుల మనోభావాలను అవహేళన చేసే విధంగా ఆలయాలు, విగ్రహాలపై దాడులు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు, రామతీర్థం ధర్మయాత్రకు ముందుగానే పిలుపునిచ్చినప్పటికీ అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు.
విజయనగరం జిల్లాలో కొదండరామస్వామి విగ్రహ ధ్వంసం ఘటనకు నిరసనగా బీజేపి, జనసేన సంయుక్తంగా రామతీర్థం ధర్మయాత్రకు పిలుపునిచ్చాయి, ఈ పిలుపుమేరకు ఇవాళ రామతీర్థానికి వెళ్తున్న బీజేపి, జనసేన నేతలను తెల్లవారుజామునుంచే పోలీసులు గృహనిర్భంధం చేశారు, ఇక విజయనగరం చేరకున్న బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును కూడా ధర్మయాత్రలో పాల్గోనకుండా అదుపులోకి తీసుకున్నారు. దీంతో స్థానికంగా కొద్దిసేపు ఉద్రిక్తతకు దారితీసింది. సెక్షన్ 30 అమల్లో వున్నందున ఎలాంటి ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు, సోమువీర్రాజుతో పాటు పలువురు బీజేపి నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని నెల్లిమర్ల ఠాణాకు తరలించారు.
ధర్మ రక్షణ కోసం @BJP4Andhra మరియు @JanaSenaParty సంయుక్తముగా ఈరోజు కార్యక్రమాన్ని తలపెడితే .. మమ్మల్ని మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా నాయకులని, మా కార్యకర్తలను హౌస్ అరెస్టులు చేస్తారా ? (2/3)#SaveHinduTemplesInAP pic.twitter.com/F8INLkxkqC
— Somu Veerraju (@somuveerraju) January 5, 2021
పోలీసుల తీరును నిరసిస్తూ బీజేపి, జనసేన కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు, కొదండరాముడి ఆలయంలో జరిగిన ఘటనను నిరసిస్తూ తాము చేపట్టిన ధర్మయాత్రకు ఎందుకు వున్నఫళంగా అనుమతులను నిరాకరించారని బీజేపి నేతలు ప్రశ్నించారు. అధికార వైసీపీ, విఫక్ష టీడీపీ నేతలను అనుమతించిన ప్రభుత్వం, పోలీసు యంత్రాం.. జనసేనతో పాటు తమను ఎందుకు అడ్డుకుంటున్నారని సోము వీర్రాజు ప్రశ్నించారు, వెంటనే గృహనిర్భంధంలో వుంచిన బీజేపి, జనసేన నేతలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు, ఈ సందర్భంగా విశాఖలోని బీజేపి కార్యాలయానికి చేరుకున్న పోలీసులు.. ఎంపీ సీఎం రమేష్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌లను విశాఖ ఏసీపీ మూర్తి, శ్రావణ్ కుమారులు అడ్డుకున్నారు.
#SaveTemplesInAP pic.twitter.com/dMNGXLC5Sg
— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) January 5, 2021
కోదండ రామస్వామి విగ్రహ శిరచ్ఛేదన దుస్సంఘటనను ఖండిస్తూ తాము చేపట్టిన యాత్రను ప్రభుత్వం అడ్డుకుంటోన్న తీరును ఖండిస్తున్నామని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటనలో తెలిపారు. నిన్న రాత్రి నుంచే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని జనసేన వ్యవహారాల కమిటీ సభ్యులను, నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేస్తామని బెదిరించడం ప్రారంభించారని చెప్పారు. ఈ రోజు తెల్లవారు జాము నుంచే నేతలను, శ్రేణులను గృహ నిర్బంధంలో ఉంచడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో పోలీసు స్టేషన్లకు తీసుకెళ్లారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాలపై దాడులు ఒక వ్యూహం ప్రకారమే జరుగుతున్నాయని ఆయన అరోపించారు.
(Video Source: NTV Telugu)
(And get your daily news straight to your inbox)
Jan 19 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామస్థాయిలో ఎన్నికల నిర్వహణ పంచాయితీ హైకోర్టుకు చేరిన తరుణంలో ఎన్నికల నిర్వహణ వుంటుందా.? లేదా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఫిబ్రవరిలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల... Read more
Jan 19 | అనునిత్యం దేశం కోసం.. దేశభక్తి కోసం ప్రసంగాలు గుప్పించే వ్యక్తుల నుంచి దేశానికి సంబంధించిన అత్యంత గోప్యమైన సమాచారం ఓ జర్నలిస్టుకు లీక్ కావడంపై కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా... Read more
Jan 19 | హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ లిమిటెడ్ సంస్థ రూపోందించిన కరోనా వాక్సీన్ కోవాక్సీన్ ను మూడవ దశ ట్రయల్స్ పూర్తి కాకుండానే అత్యవసర వినియోగం కోసం లైసెన్స్ పొందిన విషయం తెలిసిందే. అయితే... Read more
Jan 19 | నాగార్జునసాగర్ ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఉప ఎన్నికలలో భారీ మెజారిటీని సాధించేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో తమకు ఎదురులేదని.. మోనార్క్ ముద్రను వేసుకున్న టీఆర్ఎస్ ఇకపై ఎన్నికలంటే... Read more
Jan 19 | కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళిని భయం గుప్పెట్లోకి నెట్టిన తరువాత రెండో వేవ్ అంటూ భయాలు ఉత్పన్నమైన వేళ.. సెకెండ్ స్ట్రెయిన్ కూడా పలు దేశాలను అతలాకుతలం చేసింది. కరోనా నుంచి కోలుకున్న తరువాత... Read more