Railway passengers not opting ac coaches amid covid scare రైలు ప్రయాణాలు ప్యాసింజర్లు ఫుల్.. ఆ బోగీలలో మాత్రం నిల్..

Railway passengers not opting ac coaches amid coronavirus scare

Indian Railways, railway passengers, train journey, corona Lockdown, special trains, passengers, ac coaches, sleeper class, coronavirus scare, South central Railway, first class, two tier ac coach, 3 tier ac coaches

Indian Railways had resumed services for passengers after the Lockdown, with special trains in high traffic routes. But passengers not opting ac coaches for travelling amid coronavirus scare. Mainly in South central Railway ac coaches are seen with few passengers.

కరోనా ఎఫెక్ట్: రైలు ప్రయాణాలు ప్యాసింజర్లు ఫుల్.. ఆ బోగీలలో మాత్రం నిల్..

Posted: 12/16/2020 10:23 PM IST
Railway passengers not opting ac coaches amid coronavirus scare

కరోనా మహమ్మారి విజృంభన నేపథ్యంలో దేశప్రజలు ఇప్పటికే భయాందోళనల మధ్య బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంతో భక్తిశ్రద్దలతో జరుపుకునే పండుగలను కూడా ప్రజలు అమితాసక్తితో కాకుండా సోషల్ డిస్టెసింగ్, శానిటైజింగ్ లతో జరుపుకునే పరిస్తితులు ఉత్పన్నమయ్యాయి, ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపింది. ఈ క్రమంలో దేశ అర్థిక పురోగతి కోసం కేంద్రప్రభుత్వం పలు ఆంక్షల నడుపు అన్ లాక్ చేస్తూ వచ్చింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పలు మార్గాల్లో కీలక రైళ్లను ప్రయాణాల కోసం కూడా ప్రవేశపెట్టింది. దీంతో జనరల్ అన్ రిజర్వర్డ్ టిక్కెట్ల వ్యవస్థకు కూడా క్రమబద్దీకరించింది.

వలస కూలీలతో పాటు పలు కారణాలతో దేశంలోని వివిధ ప్రాంతాలలో లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో చిక్కకుపోయనవారు వారివారి గమ్యస్థానాలకు చేరుకున్నారు. ఇక తమ జీవనభృతి కోసం యోచించిన పలువురు వలస కూలీలు కూడా కరోనా లాక్ డౌన్ ముందు ప్రాంతాలకు వెళ్లి తమ పనులను చేసుకుంటున్నారు. ఈ క్రమంలో రైళ్లకు గిరాకీ పెరిగింది. అయితే క్రమక్రమంగా రైళ్ల మార్గాలను పెంచుతూ వచ్చిన కేంద్ర రైల్వేశాఖ పూర్తిగా మాత్రం ఇంకా అన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకురాలేదు. అందేకాదు చిన్న పట్టణాలను నగరాలతో కలిపే పాసింజర్ రైళ్లు, ఎంఎంటీఎస్ రైళ్లకు కూడా ఇప్పటికే అనుమతులు లభించలేదు.

అయినా ఇటీవల రైల్వేశాఖ విడుదల చేసిన ఓ ప్రకటనలో రైల్వేశాఖ మంచి లాభాలనే అర్జించిందని పేర్కోంది. కరోనా కారణంగా రైల్వేలోని స్లీపర్ బోగీలు, టు సీటర్ బోగీలలో మాత్రమే ప్రయాణాలు సాగుతున్నా.. రైల్వేలు మాత్రం లాభాలను అర్జించడం గమనార్హం. అదేంటీ ఏసీ బోగీలలో ప్రయాణాలు సాగడం లేదా.? అంటే.. కరోనా ఎపెక్ట్ తో పాటు శీతాకాలం కావడంతో రైల్వేలోని ఏసీ బోగీ బోగాలకు ప్రయాణికులు దూరంగా వుంటున్నారు, మరీముఖ్యంగా హైదరాబాద్ నుంచి బయలుదేరే రైళ్లలో ప్రయాణించే వారిలో ఎక్కువమంది స్లీపర్ క్లాసునే ఎంచుకుంటున్నారు. దీంతో ఏసీ బోగీలు బోసిపోయి కనిపిస్తున్నాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి నుంచి బయలుదేరే రైళ్లలో స్లీపర్ క్లాసులకు ఫుల్ డిమాండ్ ఉండగా, ఏసీ కోచ్ లను బుక్ చేసుకునే వారి సంఖ్య బహు స్వల్పంగా ఉంది.

నిజానికి కరోనాకు ముందు ఏసీ బోగీలకు విపరీతమైన డిమాండ్ ఉండేది. ఇక వెయింటింగ్ లిస్ట్ గురించి చెప్పక్కర్లేదు. కాచిగూడ నుంచి బయలుదేరే కాచిగూడ-బెంగళూరు-మైసూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఫస్ట్, సెకండ్ క్లాస్, ధర్డ్ ఏసీ వెయిటింగ్ లిస్ట్ 150 వరకు ఉండేది. అయితే, ఇప్పుడు కరోనాకు తోడు శీతాకాలం కావడంతో వీటికి డిమాండ్ ఒక్కసారిగా పడిపోయింది. కాచిగూడ-చెన్నై-చెంగల్పట్టు ఎక్స్‌ప్రెస్ సహా సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే అన్ని రైళ్లలోనూ ఇదే పరిస్థితి నెలకొందని అధికారులు చెబుతున్నారు. ఈ రైళ్లలోని ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏసీ బోగీల్లో ఆక్యుపెన్సీ రేటు 60-70 శాతం మధ్య ఉందని తెలిపారు. స్లీపర్ బోగాలలో టిక్కట్లు లభించిని ప్రయాణికులు గత్యంతరం లేని పరిస్థితుల్లో వీటిలో ప్రయాణిస్తున్నారని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles