ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి మరోమారు భయాందోళనకు గురిచేస్తోంది. కరోనావైరస్ సెకెండ్ వేవ్ నేపథ్యంలో ప్రపంచంలోని పలు దేశాలు వణికిపోతున్న తరుణంలో దేశంలోని పరిస్థితులపై వైద్యఆరోగ్య శాఖ అధికారులు, ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం దృష్టి సారించింది, ఈ నేపథ్యంలో ఇదివరకే దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కరోనా వైరస్ నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలపై అత్యున్నత న్యాయస్థానం స్టేటస్ రిపోర్టును కోరింది. కాగా ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, అసోం రాష్ట్రాలు అందించిన నివేదికలను పరిశీలించిన న్యాయస్థానం.. ఢిల్లీ, గుజరాత్ ప్రభుత్వాలపై అసహనం వ్యక్తం చేసింది.
దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కట్టడికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో నివేదిక అందించాలని సుప్రీంకోర్టు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. డిసెంబర్ లో కరోనా మరింత విజృంభించే అవకాశం ఉందని అందోళన వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం... పరిస్థితులు మరింత దిగజారక ముందే జాగ్రత్త పడాలని రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది. ఢిల్లీ, గుజారత్, మహారాష్ట్ర, అస్సోం సహా ఇతర రాష్ట్రాలను కూడా ఈ విషయంలో అత్యున్నత న్యాయస్థానం అదేశించింది. కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయాన్ని, సహకారాన్ని కోరుకుంటున్నాయో కూడా నివేదికలో పేర్కొనాలని తెలిపింది.
ఈ మేరకు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ఎస్ రెడ్డిలతో కూడిన సర్వోన్నత న్యాయస్థాన త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలను జారీ చేసింది. కరోనాపై పూర్తి స్థాయిలో యుద్ధం చేయకపోతే... డిసెంబర్ లో విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. శీతాకాలంలో కరోనా మరింతగా విజృంభించే అవకాశాలు వున్నాయని ఇప్పటికే పలు దేశాల్లో సెకెండ్ వేవ్ తీవ్రత కనబడుతోందని, దీనిని తేలిగ్గా తీసుకోరాదని, న్యాయస్థానం సూచించింది. కాగా, గుజరాత్, ఢిల్లీ, అసోం, మహారాష్ట్ర రాష్ట్రాలలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 44,059 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 91 లక్షలను దాటింది. త్వరలోనే సెకండ్ వేవ్ రాబోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 11 | తెలంగాణ సీఎం కేసీఆర్ సమీప బంధువుల కిడ్నాప్ కేసులో అరెస్టయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టులో పరాభవం ఎదురైంది. అమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం... Read more
Jan 11 | భారత్ లో బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజుకో రాష్ట్రాలకు రాష్ట్రాలను వ్యాపిస్తూ అందోళనకర పరిస్థితులకు దారితీస్తోంది. బర్డ్ ఫ్లూ కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. మొదట రాజస్థాన్, మధ్యప్రదేశ్లో... Read more
Jan 11 | ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెలలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల కమీషన్ నగరా మ్రోగించిన నేపథ్యంలో దీనిని వ్యతిరేకిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఎన్నికలను నిలుపుదల చేయాలని రాష్ట్ర హైకోర్టును... Read more
Jan 11 | వాట్సాప్.. స్మార్ట్ ఫోన్ వున్న పత్రీ ఒక్కరికీ ఇదో అందివచ్చిన అద్భుత సాధనం.. తమ ఫోటోలతో పాటు పలు వీడియోలు, ఇతర సమాచారాన్ని తమ అప్తులు, స్నేహితులు, బంధువులతో పంచుకునేలా దోహదపడుతోంది. అయితే తాజాగా... Read more
Jan 11 | జమ్మూకాశ్మీర్ లో గత ఏడాది జరిగిన ఎన్ కౌంటర్ పథకం ప్రకారం ఆర్మీ అధికారులు చేసిన ఘటనా..? లేక వారు ఉగ్రవాదులా.? అన్న ప్రశ్నలకు ప్రస్తుతం పోలీసుల చార్జీషీటు సంచలనంగా మారింది, జమ్మూకాశ్మీర్ లోని... Read more