Megastar Chiranjeevi tests positive for Covid-19 మెగాస్టార్ చిరంజీవికి అసింప్టమాటిక్ కరోనా..

Chiranjeevi konidela tests positive for covid 19 under home quarantine

Chiranjeevi, Chiranjeevi corona, Chiranjeevi Asymptomatic, Chiranjeevi covid, Chiranjeevi covid19, Chiranjeevi coronavirus, Acharya, Chiranjeevi movies, Chiranjeevi Celebrities, Chiranjeevi fans, Tollywood, movies, Entertainment

Telugu megastar Chiranjeevi on Monday announced that he has tested positive for coronavirus. The 65-year-old actor said that he did a COVID-19 test as part of the safety protocol before joining the sets of his upcoming movie Acharya.

మెగాస్టార్ చిరంజీవికి అసింప్టమాటిక్ కరోనా.. త్వరగా కోలుకోవాలని అభిమానుల ట్వీట్లు

Posted: 11/09/2020 02:10 PM IST
Chiranjeevi konidela tests positive for covid 19 under home quarantine

(Image source from: Instagram.com/chiranjeevikonidela)

యావత్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ బారిన మెగాస్టార్ చిరంజీవి కూడా పడ్డారు. గత ఏడు నెలలుగా అత్యంత జాగ్రత్తగా ఉంటూనే టాలీవుడ్ కళాకారులకు సిసిసి తరపున సేవలు అందించిన ఆయన.. ఆ తరువాత అభిమానికి గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స చేయించిన ఆయన అన్ని జాగ్రత్తలు పాటించినా ఈ మహమ్మారి ఎలా సోకిందో తెలియదు. తన సోదరుడు నాగబాబుకు కరోనా వైరస్ సోకి ఆతరువాత దాని నుంచి కోలుకున్నారు. దీంతో ఆయన రెండో పర్యాయం వరుణ్ తేజ్ తో కలసి ప్లాస్మా దానం కూడా చేశారు. ఈ సందర్భంగా నాగబాబుకు చిరంజీవి సర్ ప్రైజ్ కూడా ఇచ్చారు. నేరుగా ఆయన ప్లాస్మా దానం ఇస్తున్న అసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు.

కరోనా బారిన ఎవరూ పడకూదడు.. అందరూ జాగ్రత్తగా వుండాలని మరోవైపు ప్రచారం కూడా నిర్వహించిన ఆయన.. తాను అన్ని విధాలుగా కరోనా దరికి చేరకుండా జాగ్రత్తలు పాటించారు. అయినా మహమ్మారి ఎలా సోకిందో అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతం ఆయన ఆచార్య సినిమాలో నటించాల్సి ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షూటింగ్ లో పాల్గొనడం కోసం కరోనా పరీక్ష చేయించుకున్నారు. వైద్య నివేదికలో తనకు కరోనా సోకినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

‘ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని, కొవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కొవిడ్ లక్షణాలు లేవు. వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను. గత 4-5 రోజులుగా నన్ను కలిసిన వారందరిని టెస్ట్ చేయించుకోవలసిందిగా కోరుతున్నాను. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియజేస్తాను’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. దీంతో చిరంజీవికి లక్షణాలు లేని కరోనా వైరస్ సోకిందని విషయం తెలిసిన అభిమానలు ఆయన త్వరంగా కరోనా బారి నుంచి బయటపడాలని కోరుతున్నారు. ఆయన అరోగ్యం కోసం పలువురు అభిమానులు ప్రార్థనలు, ప్రత్యేక పూజలను కూడా నిర్వహిస్తున్నారు. చిరంజీవికి కరోనా సోకిందన్న విషయం తెలిసిన వెంటనే పలువురు ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ట్వీట్లు పెడుతున్నారు.

‘డ్యాడ్... మీరు త్వరగా కోలుకుంటారని, తిరిగి పూర్తి ఎనర్జీతో మా ముందుకు వస్తారని కోరుకుంటున్నాను’ - సుస్మిత కొణిదెల

‘గెట్ వెల్ సూన్ డ్యాడీ.. మీరు శరవేగంగా కోలుకోవాలి’ - వరుణ్ తేజ్

‘గెట్ వెల్ సూన్ మామయ్య’ - ఉపాసన కొణిదెల

‘మావయ్య మీరు త్వరగా కోలుకోవాలి.. జాగ్రత్తలు తీసుకోండి. మేమందరం మీవెంటే ఉన్నాం’ - సాయి తేజ్

‘మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ధైర్యంగా ఉండండి సర్’ - హీరో నితిన్

‘ఏడు రోజుల్లో మీకు నెగెటివ్ వస్తుంది’ - నిర్మాత బండ్ల గణేశ్

‘మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.. చిరు గారూ’ - సంగీత దర్శకుడు తమన్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles