Diwali offer discount in flight charges దీపావళి బోనాంజా: దేశీయ విమానయానం మరింత చౌక..

Govt extends fare capping for domestic flights till february 24

Airline fare, Flight prices, Aviation industry, Domestic Aviation, Fare band for flights, dgca, Diwali, domestic airfare

The aviation regulator DGCA issued the government-decided fare limits for these bands - domestic flights with less than 40-minute duration to have lower and upper limits of Rs 2,000 and Rs 6,000, for 40-60 minutes Rs 2,500 and Rs 7,500, for 60-90 minutes Rs 3,000 and Rs 9,000, for 90-120 minutes Rs 3,500 and Rs 10,000, for 120-150 minutes Rs 4,500 and Rs 13,000, and for 150-180 minutes Rs 5,500 and Rs 15,700.

దీపావళి బోనాంజా: దేశీయ విమానయానం మరింత చౌక..

Posted: 11/06/2020 03:48 PM IST
Govt extends fare capping for domestic flights till february 24

దేశీయ విమానాల ఛార్జీలపై ఇప్పటికే పరిమితి కొనసాగుతుందని, ఈ పరిమితిని 2021 ఫిబ్రవరి 24 వరకు కొనసాగిస్తామని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ ఇటీవల తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మే నెల నుంచి దేశీయ విమాన ఛార్జీల పరిమితి కొనసాగుతున్న విషయం తెలిసిందే. డీజీసీఏ విడదుల చేసిన చార్జీల పరిమితులు 40 నిమిషాల కన్నా తక్కువ వ్యవధి కలిగిన దేశీయ విమానాలు కనిష్టంగా రూ, 2,000 గరిష్టంగా రూ. 6000లుగా నిర్ణయించబడ్డాయి, అదే విధంగా 40-60 నిమిషాల రూ .2,500 నుంచి రూ .7,500, 60-90 నిమిషాలకు రూ .3,000- రూ .9,000, 90-120 నిమిషాలకు రూ .3,500- రూ .10,000, 120-150 నిమిషాలకు రూ .4,500- రూ .13,000, 150-180 నిమిషాలకు రూ .5,500- రూ .15,700లగా నిర్ణయించింది.

ఇదిలావుంటే.. కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజారవాణాపై ఆంక్షలు, పరిమితులు కోనసాగుతున్న విషయం తెలిసిందే, దీంతో ఇక్కట్లు పడుతున్న ప్రయాణికుల కోసం కూడా కేంద్రం యోచిస్తొంది. ఇక ప్రయాణికుల సంఖ్యపై కూడా అంక్షలు కోనసాగుతున్నాయి, మే నుంచి విమానంలోని సీట్ల కెపాసిటీలో కేవలం 33శాతం మాత్రమే ప్రయాణికులను అనుమతించగా, ఆ తరువాత దానిని కాస్తా జూన్ 26 నుంచి 45శాతానికి పెంచారు, ఇక సెప్టెంబర్ 2 నుంచి 60 శాతం మంది ప్రయాణికులు కెపాసిటీని పెంచారు. ఇక తర్వలోనే ఈ కెపాసిటీని 75శాతం మేర పెంచనున్నట్లు కేంద్ర విమానయాన సంస్థ తెలిపింది. ఇక మరింతగా విమానయానాన్ని ప్రయాణికులకు చేరువ చేసే క్రమంలో భాగంగా మరో శుభవార్తను కేంద్రం వెలువరించింది.

దీపావళి కానుకగా విమాన ఛార్జీలను భారీగా తగ్గించింది. కరోనా కారణంగా ప్రజా రవాణాను ఆశ్రయించే వారి సంఖ్య తగ్గిపోగా, విమానాలు ఎక్కేవారి సంఖ్య కూడా గణనీయంగా పడిపోయింది. అయితే, ఈ పండగ సీజన్ ను ఉపయోగించుకుని, తిరిగి ప్రయాణికుల సంఖ్యను పెంచాలని భావిస్తున్న కేంద్రం, గత సంవత్సరంతో పోలిస్తే 30 నుంచి 40 శాతం మేరకు చార్జీలను తగ్గించింది. తగ్గిన చార్జీల ప్రకారం, చెన్నై నుంచి బెంగళూరుకు రూ.1,700తోనే ప్రయాణించవచ్చు. ఇక హైదరాబాద్‌కు రూ.2,400 నుంచి రూ.2,800 వరకూ, ఢిల్లీకి రూ.4 వేల వరకూ చార్జీలను నిర్ణయించారు. ప్రస్తుతం అంతర్రాష్ట్రాల మధ్య మాత్రమే విమాన సేవలు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles