Kurnool indifferent love story: Two girls eloped కర్నూలులో వెలుగుచూసిన విభిన్న ప్రేమకావ్యం..

Kurnool indifferent love story two girls fall in love and eloped

same sex marriage, same sex love couple, friends fall in love, same gender love, two women eloped, narsimha reddy nagar, Kurnool town, santosh nagar colony, letter, Andhra Pradesh, Crime

In a shocking incident, two women from kurnool district of Andhra Pradesh eloped after falling in love since six months. This Incident came into light after the parents of both the girls approached police. This incident took place in Narasimha Reddy nagar of kurnool town

కర్నూలులో వెలుగుచూసిన విభిన్న ప్రేమకావ్యం..

Posted: 11/05/2020 07:32 PM IST
Kurnool indifferent love story two girls fall in love and eloped

(Image source from: Jagran.com)

తనను ప్రేమించిన యువకుడితో జీవితాంతం కలసి బతకాలని నిర్ణయించుకున్న యువతి.. ఇంట్లో పెద్దవాళ్లను ఒప్పించి వివాహం చేసుకోవడం లేదా ప్రేమించిన వాడి కోసం పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకోవడం ఈ మద్యకాలంలో మనం చూస్తున్నాం. ఇలా కాని పక్షంలో పెద్దలకు చెప్పలేక.. వారు అంగీకరించని తెలిసిన ప్రేమికులు ఇంట్లోంచి పారిపోయి మరీ పెళ్లి చేసుకోవడం కూడా ఈ మధ్యకాలంలో కామన్ గా కనిపిస్తోంది. కానీ కర్నూలులో విభిన్న ప్రమేకథ వెలుగుచూసింది. అంత విచిత్రం ఏముందీ అంటారా.?

యువతిని ప్రేమించే యువకుడో.. లేక యువకుడ్ని ప్రేమించిన యువతి కథనో మనం ఇన్నాళ్లు చూశాం.. కానీ కర్నూలు జిల్లాలో తొలిసారిగా ఓ యువతిని ప్రేమించిన యువతి కథను చూశం. అంతేకాదు వీరద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. ఒకరిని వదలి మరోకరు ఉండలేనందగా వీరి ప్రేమ బంధం పెనవేసుకుపోయింది. ఇక తమను ఎవ్వరూ విడదీయకూడదని భావించిన ఈ ఇద్దరు అమ్మాయిలు ఒకరికోసం మరోకరు ఇంటి నుంచి పారిపోయారు. పోతూ పోతూ తమ ప్రేమ విషయం పెద్దలకు అర్థమయ్యేలా ఓ చిన్న సందేశాన్ని వారికి వదిలివెళ్లారు. దీంతో వారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని సంతోష్‌నగర్ ప్రాంతానికి చెందిన యువతి (21), నర్సింహారెడ్డినగర్ కు చెందిన యువతి (20) చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. వారి స్నేహం ఇటీవల మరింత ముదిరి ప్రేమకు దారితీసింది. ఇద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారు. దీంతో ఈ నెల 3న ఇంట్లో చెప్పకుండా ఇద్దరూ కలిసి వెళ్లిపోయారు. వెళ్తూవెళ్తూ తల్లిదండ్రులకు మెసేజ్ పెట్టారు. అది చూసి కంగారుపడిన ఇద్దరు అమ్మాయిల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతుల కోసం గాలిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles