Tejashwi Yadav breaks Lalu prasad Yadav Record తన తండ్రి పేరునున్న రికార్డును బ్రేక్ చేసిన తేజస్వీ యాదవ్

Bitter elections tejashwi yadav breaks lalu prasad yadav record of highest number of meetings in a day

Tejashwi Yadav, Chief Minister Nitish Kumar, Bihar assembly election 2020,Bihar election news,bihar election 2020 live updates,bihar election news live updates,bihar assembly election live news,, election meeting, BJP JDU coalition, Muzaffarpur, Bihar, Politics

RJD leader Tejashwi Yadav's had breaked a record which was in his father Lalu Prasad Yadav's name. Tejashwi had participated the highest number of public rallies in a day and created this record. In the public rallies he promised 10 lakh jobs to the youth. The RJD is trying to attack the Chief Minister and the NDA over comments made in the past when the two were contesting against each other.

ప్రాణంతో ప్రజాస్వామ్యానికి ముడిపెట్టడం దారుణం: తేజస్వీ యాదవ్

Posted: 11/03/2020 10:53 PM IST
Bitter elections tejashwi yadav breaks lalu prasad yadav record of highest number of meetings in a day

(Image source from: Ndtv.com)

యావత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని కీర్తించుకునే మన నేతలు అదే ప్రజాస్వామ్యానికి ప్రాణంతో ముడిపెట్టడం ఎంత దారుణమైన పరిస్థితి అంటూ ఆర్జీడి యువనేత తేజస్వీ యాదవ్ తనదైన శైలిలో విమర్శించారు. ఓటరు జీవితాన్ని రాజకీయ పార్టీ నిర్థేశించే స్థాయికి దిగజారిపోయామా.? అంటూ ఆయన అవేదన వ్యక్తం చేశారు, ఈ ఏడాది పంద్రాగస్టున ఎర్రకోటపై నుంచి దేశ ప్రజలందరికీ ఉచితంగా కరోనా వాక్సీన్ అందిస్తామని సందేశాన్ని ఇచ్చిన ప్రధాని నరేంద్రమోడీకి చెందిన పార్టీ బీహార్ లో మాత్రం తాము అధికారంలోకి వస్తేనే అందరికీ ఉచితంగా టీకాను అందిస్తామని ఎన్నికల మానిఫెస్టోలో పేర్కోని మనిషి జీవితానికి ఓటుకు ముడిపెట్టడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కరోనా టీకాను ఉచితంగా అందజేస్తామన్న హామీని బీజేపి తమ మానిఫెస్టోలో పేర్కోనడం.. దానిని ఎన్నికల కమీషన్ కూడా సమర్ధించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీకి తేజస్వీ యాదవ్ లేఖాస్త్రాన్ని సంధించారు, గతంలో ఇచ్చిన హామీలను ప్రధాని మర్చిపోయారని ఇప్పుడు కూడా వాటి ఊసే ఎత్తకుండా కొత్త హామీలతో బీజేపి రాష్ట్రప్రజల ముందకు రావడంపై ఆయన విమర్శలను కురిపించారు. ఈ క్రమంలో ఈ నెల 1వ తేదీన తాను ప్రధానమంత్రి నరేంద్రమోడీకి రాసిన రెండు పేజీల లేఖను ఈ రోజు ట్విట్టర్ లో తేజస్వి యాదవ్ పోస్టు చేసి అభిమానులు, కార్యకర్తలతో పంచుకున్నారు. ఈ సందర్భంగా అరేళ్ల క్రితం బీహర్ ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చలేకపోయారని చెప్పారు.

ఆయన లేఖ సారంశం సాగిందిలా.. ఆరేళ్ల క్రితం బీహార్ ప్రజలకు ప్రధాని హోదాలో నరేంద్రమోడీ ఇచ్చిన హామీలు నాయకులు మార్చిపోయినా.. పాలకులు నెరవేర్చకపోయినా.. ప్రజలకు మాత్రం గుర్తున్నాయని తేజస్వీ యాదవ్ ఎద్దేవా చేశారు. బీహార్ కు ప్రత్యేక హోదా కల్పిస్తామన్నారని, రాష్ట్రానికి రూ. 1.25 లక్షల కోట్ల ప్యాకేజీ ఇస్తామన్నారని... ఇంకా మరెన్నో హామీలను ఇచ్చినా.. ప్రధానంగా ప్రజలు ఈ రెండు హామీల గురించే అధికంగా అలోచిస్తున్నారని,. ఇవి సాకారమైన పక్షంలో తమ జీవితాల్లోకి వెలుగులు వస్తాయని బీహార్ వాసులు ఎదురుచూస్తున్నారని.. అవి ఏమయ్యాయని ప్రశ్నించారు. చట్టాల పేరుతో ఇంకెన్నేళ్లు బీహార్ కు ప్రత్యేక హోదాను తిరస్కరిస్తారని నిలదీశారు.

40 మంది రాష్ట్ర ఎంపీల్లో 39 మందిని మీకు అందించిన బీహార్ కోసం చట్టాలను మార్పు చేయలేరా? అని ప్రశ్నించారు. ఎన్నో అంశాలకు సంబంధించి చట్టాలను సవరణ చేసిన మీరు... ఈ అంశంలో మాత్రం ఆ పని చేయలేరా? అని అడిగారు. పాట్నా యూనివర్శిటీకి కేంద్ర హోదా కల్పిస్తామన్న హామీని కూడా నిలబెట్టుకోలేకపోయారని తేజశ్వి విమర్శించారు. బీహార్ పై సవతి ప్రేమను చూపిస్తున్నారని మండిపడ్డారు. కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా బీహార్ కూలీలను కేంద్రం చిన్న చూపు చూసిందని విమర్శించారు. విదేశాల్లోని ఎన్నారైలను వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమానాలను కేంద్రం ఏర్పాటు చేసిందని... ఇదే సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మైళ్లు నడుస్తూ వచ్చిన బీహారీలను మాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles