Schools and colleges to reopen soon in AP ఏపీలో తెరుచుకోనున్న కాలేజీలు, పాఠశాలు

Schools and colleges to reopen soon in andhra pradesh

Andhra Pradesh Schools, AP colleges, AP Schools Reopen, Andhra Pradesh Chief Secretary Nelam sahney, Intermediate colleges, re-opening schools, AP Government, Educational Institutions, Andhra Pradesh Nes

Andhra Pradesh Chief Secretary Nelam sahney has released the shedule for the re-opening of schools, Intermediate colleges and all the other Educational Institutions in a three phase manner from November 2nd.

ఏపీలో తెరుచుకోనున్న విద్యాసంస్థలు.. దశలవారీగా పాఠశాల ప్రారంభం..

Posted: 10/29/2020 11:03 PM IST
Schools and colleges to reopen soon in andhra pradesh

(Image source from: Businessupturn.com)

దేశవ్యాప్తంగా అన్ లాక్ 5.0 మార్గదర్శకాలు మరో నెల రోజుల పాటు అమల్లో వుంటాయని కేంద్ర హొం మంత్రిత్వ శాఖ ఇటీవలే అదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాల నేపథ్యంలో దేశంలోని పాఠశాలలు, విద్యాసంస్థలు, కాలేజీలన్నీ నవంబర్ వరకు తెరుచుకోవని ఈ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాస్ట్ర ప్రభుత్వం మాత్రం నవంబర్ 1వ తేదీని అధికారికంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించగానే ఆ మరుసటి రోజు నుంచి పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలను తెరిచేందుకు సిద్దమైంది.

ఏపీలో దశల వారీగా విద్యాసంస్థల పునఃప్రారంభించాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా, అన్ లాక్ 5.0 మార్గదర్శకాలు వచ్చినా.. తమ రాష్ట్రప్రభుత్వ మార్గదర్శకాలనే అధికారులు పాటించాలని ఈ మేరకు రాష్ట్ర సీఎస్ నీలం సాహ్నీ తాజాగా షెడ్యూల్ విడుదల చేశారు. రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలోనే ట్యూషన్ సెంటర్ కు వెళ్లిన చిన్నారి విద్యార్థులందరూ కరోనాబారిన పడిన ఘటనలు ఉత్పన్నమైనా.. ప్రభుత్వం మాత్రం దశలవారీగా ప్రారంభించాలన్న నిర్ణయానికే వచ్చింది. రోజు విడిచి రోజు తరగతులు నిర్వహించడంతో పాటు ఒంటిపూట బడులు మాత్రమే నిర్వహించేందుకు సముఖత చూపుతోంది.

నవంబరు 2 నుంచి 9, 10వ తరగతి విద్యార్థులకు, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు క్లాసులు ఉంటాయి. నవంబరు 12 నుంచి ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు క్లాసులు జరుపుతారు. నవంబరు 23 నుంచి 6, 7, 8 తరగతుల విద్యార్థులకు బోధన ప్రారంభం అవుతుంది. ఇక, 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు డిసెంబరు 14 నుంచి క్లాసులు నిర్వహించనున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ఇవే నిబంధనలు వర్తిస్తాయని మార్గదర్శకాలు జారీ  చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని తరగతుల నిర్వహించాలని అదేశాలు జారీ అయినా.. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను పంపుతారా అన్నది వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles